నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, May 17, 2020

స్వదేశీ వస్తువులను సరఫరా చేయడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఆర్డర్‌మీ’ని ప్రారంభించబోతున్న బాబా రామ్‌దేవ్ - Baba Ramdev Led Patanjali To Launch E-Commerce Platform ‘OrderMe’ To Supply Swadeshi Goods

తంజలి ఆయుర్వేద సంస్థ సరి కొత్త స్వదేశీ online అంతర్జాల వస్తు విక్రయ సంస్థ ORDER ME 

పోస్ట్ కోవిడ్ ఎరాలో భారత్‌లో స్వదేశీ ఉద్యమం ఊపందుకోనుంది..
దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పతంజలి గ్రూపు రంగంలోకో దిగింది..
  • ➣ ప్రధాని మోదీజీ అన్ని విషయాలలోనూ స్వదేశీని అలవరచు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన 48 గంటల్లోనే పతంజలి అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది..
  • ➣ తానే స్వంతంగా #e_commerce వ్యాపారంలోకి వస్తున్నట్లు ప్రకటించింది..
  • ➣ #OrderMe పేరుతో ఈ వ్యాపారంలోకి రానున్న పతంజలి తన వస్తువులతోపాటు ఇతర స్వదేశీ వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయనుంది.. 
  • ➣ వచ్చే 15 రోజుల్లో ప్రారంభించనున్న ఈ ప్లాట్‌ఫాం కొన్ని గంటల్లోనే ఉచితంగా ఉత్పత్తులను ఇంటి వద్దనే అందజేస్తుంది.
  • ➣ అదనంగా, ఈ వేదిక పతంజలికి సుమారు 1,500 మంది వైద్యుల నుండి 24X7 24 గంటలు ఉచిత వైద్య సలహాలను, అలాగే యోగాను కూడా అందిస్తుంది.
  • ➣ అభివృద్ధిని ధృవీకరిస్తూ, పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆచార్య బాల్కృష్ణ మాట్లాడుతూ “ఆర్డర్మీ స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే సరఫరా చేస్తుంది మరియు ఆమోదిస్తుంది. స్థానిక చిల్లర వ్యాపారులు మరియు చిన్న దుకాణ యజమానులందరినీ అనుసంధానించడం ద్వారా మా దీర్ఘకాల స్వదేశీ ఉద్యమానికి తోడ్పడటం పతంజలి యొక్క ప్రయత్నం, తద్వారా స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేవారు మా ప్లాట్‌ఫాం నుండి ప్రయోజనం పొందవచ్చు. వారు ప్లాట్‌ఫామ్‌లో చేరవచ్చు.
  • ➣ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) దేశీయ వస్తువులను పంపిణీ చేయడానికి, స్వదేశీ కంపెనీలు అభివృద్ధి చెందేలా ఈ వేదిక ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
ముఖ్యమైన విషయం ఏమంటే ఒక విలేఖరి రాందేవ్‌బాబా గారిని "మీరు సన్యాసి కదా మీకు వ్యాపారాలు ఎందుకు.." అని ప్రశ్నిస్తే ఆయన ఈవిధంగా సమాధానం ఇచ్చారు: "మనం పప్పులు ఉప్పుల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు సర్వం విదేశీ వస్తువులే వాడడం వల్ల కొన్ని లక్షల కోట్లు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. కొంతైనా అడ్డుకుని ఈ దోపిడీని అరికట్టాలని, మన రైతులకు మంచి ధరలు అందివ్వాలని వ్యాపారంలోకి వచ్చాను. ఇతర దేశాల్లో బట్టలు వేసుకోవడమే తెలియని కాలంలోనే మనం ఓడల్లో వెళ్ళి ప్రపంచమంతా వ్యాపారం చేశాం. అటువంటిది మన కోసం మనం వ్యాపారం ఎందుకు చేయకూడదు..??"

అనువాదము: కోటి మాధవ్ బాలు
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com