బోదకాలు / ఫైలేరియా తగ్గడానికి అయుర్వేద చికిత్స - Filarial disease, Bodhakalu, Paileria, Ayurveda

బోదకాలు / ఫైలేరియా తగ్గడానికి అయుర్వేద చికిత్స  - Filarial disease, Bodhakalu, Paileria, Ayurveda
కొన్ని రకముల దోమకాటు వలన ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.ప్రారంభ దశలో జ్వరం వస్తుంది.తర్వాత కాలి యొక్క వాపు పెరుగుతుంది. ప్రారంభదశలోనే వ్యాధి తెలుసుకోవాలి.
  • 1. మహా సుదర్శన చూర్ణం,నిత్యానంద రసం,శీతాన్శురసం,శ్లీపదారి లోహం ,పునర్నవ మండూరము,లోహాసవము వంటి మందులు బోదవ్యాధిని అరికడతాయి.
  • 2. జిల్లేడు మొక్క వేళ్ళు కాని ,పత్తి చెట్టు వేళ్ళను కానీ శుభ్రం చేసి ,గంజితో కలిపి మెత్తంగా నూరి బోద వచ్చిన చోట లేపనం చేస్తుంటే వాపు తగ్గిపోతుంది.
  • 3. బొప్పాయి ఆకులను నూరి ,రసాన్ని పల్చగా బోద వచ్చిన చోట పులిమి ,అరగంట తర్వాత కడిగేసుకుంటే వాపు తగ్గుతుంది.
  • 4. మునగ చెట్టు బెరడు ,ఆవాలు ,శొంఠి సమపాళ్ళలో నూరి వాపు మీద రాస్తుంటే తగ్గుముఖం పడుతుంది.
  • 5. కాలి వాపునకు ప్రతి రోజూ వేడినీటి కాపడం పెడుతూ ,ప్రతిపూటా అల్లపు రసం తాగుతుండాలి.
  • 6. వసకొమ్మును సారాయితో గంధం లాగా అరగ దీసి పైన పట్టు వేస్తుంటే బోద వాపులు హరించి పోతాయి.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top