గంగాజలంతో కరోనా చికిత్స? - Ganga Jalam tho Carona Chikitsa

గంగాజలంతో కరోనా చికిత్స? - Ganga Jalam tho Carona Chikitsa
ది నుంచి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తారు భారతీయులు. పురాణాల్లోనూ దీని ప్రస్థావన ఉంది. భగీరథుడు తమ వంశస్తులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని కైలాసం నుంచి గంగను భువి పైకి తీసుకొచ్చాడన్నది పురాణ గాథ. మరి అంత పవిత్ర గంగను కరోనా మహమ్మారికి చికిత్స చేయవచ్చా? ఇదే విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు ప్రతిపాదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు.

తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ‘నమామి గంగా’ మిషన్‌ గురించి షెకావత్‌ మాట్లాడారు. గంగానది ప్రక్షాళకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో కలిసి ఎన్నో సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్స కోసం గంగా జలాన్ని వాడవచ్చా? అన్న దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిపారు. ”వందేళ్ల పాటు గంగా జలాన్ని నిల్వ ఉంచినా అది చెడిపోదు. ఇతర నదీ జలాలతో పోలిస్తే, గంగాజలం పూర్తి భిన్నం. దాని వెనుక ఉన్న నిజమేంటో శతాబ్దాలుగా అందరికీ తెలుసు. అందుకే కరోనా వైరస్‌ చికిత్సలో గంగాజలం వినియోగించవచ్చా? అన్న దానిపై పరిశోధించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపాం” అని షెకావత్‌ వెల్లడించారు.

అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న కేంద్ర జలవనరులశాఖ ప్రతిపాదనలను ఐసీఎంఆర్‌ తోసిపుచ్చింది. కొవిడ్‌-19 చికిత్సకు పవిత్ర గంగాజలం ఉపయోగపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని తెలిపింది. ఇప్పటికే గంగానదిలో భారీగా బ్యాక్టీరియా ఉందని వెల్లడించింది. ఇది కొవిడ్‌-19వంటి వైరస్‌లపై వీటి ప్రభావం చూపదని పేర్కొంది.

మరోవైపు దేశంలో నీటి వనరుల గురించి షెకావత్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 132 డ్యామ్‌ల్లో 56శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ‘గతంతో పోలిస్తే, నీటి పరిస్థితి బాగుంది. ఈ ఏడాది విపరీతమైన మంచు కురిసింది. అదంతా ప్రయోజనం చేకూర్చేదే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా నదీ జలాలు చాలా వరకూ శుభ్రపడ్డాయి. అయితే, అవి తాగునీటికి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్నది అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడే ఏమీ చెప్పలేం” అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top