జ్యోతిశ్శాస్త్రంలో "జ్యోతి" అనే పదానికి అర్ధం పరమార్ధం
జ్యోతిశ్శాస్త్రంలో ‘జ్యోతిః’ ఉన్నది కదా? జ్యోతి అంటే?
జ్యోతిషము అనే మాటకు astronomy మరియు astrology అనే రెండు అర్థాలూ ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిశ్చక్రము అన్న మాటరాశిచక్రం zodiac ను సూచిస్తున్నది. జ్యోతిషాంపతి అన్నమాట తమాషాగా సూర్యుడు చంద్రుడూ యిద్ధరికీ వర్తిస్తున్నది. సుప్రసిధ్దమయిన శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రంలో ఒకశ్లోకం యిలా ఉంది:
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:.
ఈ శ్లోకప్రకారం సూర్యుడు జ్యోతిస్సులన్నింటికీ ప్రభువుగా కీర్తించబడుతున్నాడు. ఇక్కడ జ్యోతులుగా కీర్తించబడినవి ఆకాశవీధిలోని నక్ష్యత్రాలు.
ఆశ్విన్యాది సప్తవింశతి (27) నక్ష్యత్రాలకు నాధుడుగా చంద్రుడు పురాణప్రసిధ్ధి గడించాడు. ఈ 27 నక్ష్యత్రాలు దక్షప్రజాపతి కుమార్తెలనీ వీరిని ఆయన చంద్రుడికిచ్చి వివాహం చేసుకున్నాడనీ ఐతిహ్యం. ఇక్కడ మరొక చమత్కారమైన కథకూడా ఉంది. ఆ చంద్రుడికి వారిలో రోహిణిపట్ల మిగతా సోదరీమణులకు అసూయ కలిగేంత మోజు. జ్యోతిషంలో రోహిణీ నక్ష్యత్రం చంద్రుడికి ఉఛ్ఛ. అంటే అక్కడ మిక్కిలి బలమూ, ప్రకాశమూ. అది వేరే సంగతి. వదిలేద్దాం శాఖా చంక్రమణం దేనికి.
ఒక సంవత్సరకాలంలో భూమి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షణం పూర్తి చేస్తుంది. మనం సూర్యుని మీద నుండి చూస్తే భూమి ఇలా ప్రదక్షణం చేయటం గమనించవచ్చును. మనం భూమినుండి కదా చూడ కలిగేది? అందుచేత మనకు సూర్యుడే భూమి చుట్టూ ఒక ప్రదక్షణం ఒక సంవత్సరకాలంలో పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇతర గ్రహాలు కూడా వేర్వేరు కాలప్రమాణాలతో సూర్యుడి చుట్టూ ప్రదక్షణం చేస్తున్నాయి. మనకు మాత్రం అవన్నీ మన భూమి చుట్టూ ప్రదక్షణం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో అసహజం యేమీ లేదు కద.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించే మార్గం కొంచెం విశేషం కలిగి ఉంది. దీనికి ఇంచుమించు 10 డిగ్రీల ఉత్తరదక్షిణాలుగా ఒక పట్టీ (belt) లాగా అనుకుంటే దీనిమీదే భూమిచుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్న అన్ని దృశ్యమాన గ్రహాల యొక్కా చంద్రుడి యొక్కా కక్ష్యలు ఉన్నాయి. ఇలా సూర్యచంద్రాదులూ గ్రహాలూ మనకు కనవచ్చే అంతరిక్ష వీధినే మనం రాశి చక్రం అంటాం.

- అంతరిక్షంలో కనవచ్చే అనేక నక్ష్యత్రమండలాలలో ఈ రాశిచక్రం వెనుకాల మనకు ప్రముఖంగా గోచరించే నక్ష్యత్రమండలాలే యీ ఆశ్విన్యాది సప్తవింశతి (27) నక్ష్యత్రమండలాలూ.
ఇప్పుడు మనకు అంతరిక్షంలో ముఖ్యమైన జ్యోతులుగా యీ 27 నక్ష్యత్రమండలాలూ, వాటికంటే ప్రముఖంగా చంద్రుడూ, ఆ శశిబింబంకన్నా ప్రముఖంగా సూర్యుడూ తెలియ వస్తున్నారు.
ఈ జ్యోతులకు సంబంధించిన జ్ఞానాన్ని అందించేదే జ్యోతిశ్శాస్త్రం.
గ్రహములు |
సూర్య చంద్రులకు 'కర్మసాక్షులు' అని పేరు. సూర్యుని చలనం (అంటే సూర్యుని చుట్టూ భూమి చలనం) ఆధారంగా సంవత్సరం యేర్పడుతోంది. మరలా సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం మందలంలో దృశ్యమానుడై ఉండే కాలానికి ఒక్కొక్క కార్తెగా 27 కార్తెలు లెక్కించబడుతున్నాయి.
ఋతువుల వర్తనానికి సూర్యుడే ఆధారం. కార్తెల రాకకూ వ్యవసాయాది కార్యక్రమాలకు గొప్ప సంబంధం ఉంది. ఉదాహరణకు మృగశిరాకార్తె రాక తొలకరి వానల ప్రారంభాన్ని సూచిస్తుంది.
వ్యవసాయకార్యక్రమాలకు యీ కార్తెల రాకలు బండగుర్తులు.

భారతీయమైన పన్చాన్జ్ఞవిధానంలో నెలలు సూర్య-చాంద్రమానంలో లెక్కిస్తాము. చంద్రుని వృధ్ధిక్షయాలు ఒక ఆవృత్తి పూర్తి చేసుకుందుకు పట్టే కాలం ఒక చాంద్రమాన మాసం. ఒక్కొక్కరాశిలో సూర్యుడు దర్శనమిచ్చే మాసం ఒక సూర్యమాసం. సాదారణంగా మాసాలను చాంద్రమానంలో లెక్కపెడుతూ, ప్రతి చాంద్రమాసమూ ఫలాని సూర్యమాసంలో రావాలని నియమం పెట్టుకున్నాము. ఒక్కక్కసారి హెచ్చు తగ్గులు వస్తాయి - అప్పుడు అధికమాసం లేదా క్షయ మాసం వస్తుంది. వీటిగురించి ఇంకా విపులంగా మరొక సారి వ్రాస్తాను. ఇప్పటికి ఇది చాలు. మరలా ప్రతి చాంద్రమానమాసాన్ని 30 దినాలుగా విభజించాము - సూర్యుడి నుండి చంద్రుడు జరిగే ప్రతి 12 డిగ్రీల దూరం ఒక చాంద్రదినం అన్నమాట. దీనినే తిథి అంటాము.
చాంద్రమానం నెల 28 రోజుల చిల్లర కాబట్టి, అందులో 30వ వంతైన చాంద్రదినం (తిథి) రోజుకన్నా చిన్నది. కాబట్టి తిధులు రోజులో యెప్పుడన్నా మొదలవుతాయి, అంతమవుతాయి. ఇదంతా పంచాంగంలో గుణించి ప్రచురిస్తారు. పంచాంగం అంటే అందులో 5 అంగాలు (విషయాలు) ఉంటాయి. తిథి, వారమూ, చంద్రుడు సంచరించే నక్ష్యత్రమూ ఇంకా యోగమూ , కరణమూ అనేవి. యోగం అనేది సూర్యచంద్రుల దృశ్యకోణాల కలయిక. కరణం అనేది తిథిలో సగం కాలం ఉంటుంది. ఇవే కాక కార్తెల ఆగమనమూ ఇంకా అనేక ఉపయుక్త విషయాలూ పంచాంగంలో సిధ్ధాంతులు పొందుపరుస్తారు.

ఇక్కడ గమనించవలసిన విషయం యేమిటంటే యీ పంచాంగ గణనంలో ప్రధానవిషయాలన్నీ సూర్య చంద్రుల గమనంపైన ఆధారపడ్డవే. ఈ సూర్యచంద్రులే ప్రధాన జ్యోతులు. ఈ సూర్యచంద్రులగమనాలను రాశిచక్రంలోను జ్యోతులను అనుసరించి తెలుసుకుంటున్నాము - కార్తెలు సూర్యగమనాన్నీ, దిననక్ష్యత్రం చంద్రగమనాన్నీ తెలుపుతున్నాయి గదా.
ఇలా జ్యోతిషం అనేది రాశి చక్రం మీద వర్తించే జ్యోతులకు సంబంధించిన విజ్ఞానం అని తెలుస్తోంది. సిధ్ధాంతులు ప్రతిసంవత్సరమూ యీ జ్యోతులకు సంబందించిన గమనాలను ఉల్లేఖిస్తూ ఉంటారు.
గ్రహాలు స్వయంప్రకాశాలు కావని యెప్పటినుండో మనకు (భారతీయ జ్యోతిర్వేత్తలకు) తెలుసు. కాని అవి జ్యోతులవలెనే దర్శనమిస్తూ ఉంటాయి కాబట్టి వాటినీ మనం జ్యోతుల క్రింద గ్రహించటాన్ని ఆమోదించవచ్చును.
ఈ విధంగా అనేకమైన జ్యోతులు రాశిచక్రంపైన దర్శనమిస్తుంటాయి అనునిత్యం. వాటి తత్కాల స్థితిగతులను బట్టి రాబోయే కాలంలో జరిగే పరిణామాలను బేరీజు వేసే ఫలభాగం గురించి యిక్కడ నేను వేరే వ్యాఖ్యానించనవుసరం లేదు. ముఖ్యమయిన విషయం జ్యోతిశ్శాస్త్రంలో జ్యోతి అనే మాట యేమి సూచిస్తుందో లఘువ్యాఖ్య చేయటమే.
రచన/సంకలనం: శ్యామలీయం