నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, May 1, 2020

కూర్చుని భోజనం చేయడం - Kurchuni bhojanam cheyadam

కూర్చుని భోజనం చేయడం - Kurchuni bhojanam cheyadam
కూర్చుని భోజనం చేయడం
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కాక అందరం కలిసి కుర్చుని భోజనం చేయడం మన సంప్రదాయంలో కనిపిస్తుంది. పొద్దునంతా కష్టపడి సాయంకాలానికి ఇంటికి చేరుకున్నాక, స్నానం చేసి, సంధ్యాదీపారాధన చేసి, అందరూ కలిసి కూర్చుని, వడ్డించుకుని భోజనం చేసేవారు.

పెళ్ళిల సమయంలో ఎవరికి ఇప్పుడూంటే బఫ్ఫేలు వచ్చాయి. ఎవరికోసం ఆగడమనేది లేదు, నచ్చినప్పుడు తింటారు.

అయితే కలిసి కూర్చుని భోజనం చేయడం వలన కలిగే ఉపయోగాలేమిటి ? శాస్త్రపరిశోధనలు ఏమని ఋజువు చేశాయి.
 •  1. కలిసి భోన్ చేయడం వలన కుటుంబ బాంధవ్యాలు బలపడతాయి. పిల్లలకైతే తమకు కుటుంబం యొక్క తోడు ఉందనే భద్రతా భావం కలుగుతుంది.
 •  2. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు అది దోహద చేస్తుంది.
 •  3. ఇలాంటి అలవాటు ఉన్న ఇంటి పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ముఖ్యంగా గణితం బాగా చేయగలుగుతారు.
 •  4. 5000 మంది యువుత మీద పరిశోధన చేసినప్పుడు ఇలాంటి అలవాటు ఉన్న ఇంటి  పిల్లలు మానసికంగా బలంగా ఉంటారట, మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందట.
 •  5. కుటుంబ సభ్యుల్లో భావప్రసార నైపుణ్యాలు (communication skills) మెరుగుపడతాయి. అలాంటి కుటుంబాల్లో స్త్రీలకు ఒత్తిడి తక్కువగా ఉండి, సంతోషంగా ఉంటారట.
 •  6. ఆహారం విషయంలో జిహ్వచాపల్యాన్ని అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
 •  7. పిల్లలో ఊబకాయం రాదు, కుంగుబాటు (డిప్రెషన్) ఉండదు.
 •  8. వేళకు తినడం అలవాటవుతుంది.
 •  9. ఆహారాన్ని వృధా చేయడం అనేది తగ్గుతుంది.
 • 10. పిల్లల్లో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది, తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెడతారు.
 • 11. ఇటువంటి పిల్లల్లో అధికశాతమంది హింసకు పాల్పడరట. పశ్చిమ దేశాల్లో ఈ అలవాటును ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే కలిసి భోజనం చేసే కుటుంబాల్లో పిల్లలు మిగితావారితో పోల్చితే మద్యం, మాదకద్రవ్యాలకు తక్కువగా బానిస అవుతున్నారట.
 • 12. పిల్లలో బలమైన జ్ఞాపకాలను ఇది కలిగించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయం, ఆచారవ్యవహారాలను వారు కూడా పాటించేలా చేస్తుందట.
 • 13. తమ భావాలు, ఆలోచనలు పంచుకునేందుకు కుటుంబంలో ఎవరు లేరని భావించప్పుడు, ఒంటరితనం ఆవహించి, బయట తోడు కోసం వెతుక్కుంటారు. కొన్నిసార్లు దుర్మార్గుల చేతిలో పడి శారీరికంగా, మానసికంగా దోపిడికి గురై కష్టాలపాలవుతారు. కుటుంబనతా కలిసి భోజనం చేయడం వలన పిల్లలు పెడద్రోవ పట్టరని, ప్రేమ పేరుతో దుర్మార్గుల చేతిలో పడి మోసపోయే అవకాశం తక్కువట.
 • 14. అమెరికాలో పదవ తరగతికి అనుబంధంగా పసిపిల్లల సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. తెలిసీతెలియని ఆ వయస్సులోనే అనేకమంది స్త్రీలు గర్భవతులవ్వడం చేత వీటిని ఏర్పాటు చేశారు. వీళ్ళను వెట్ మధర్స్ అంటారు. కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం చేత ఇలాంటి స్థితికి దిగజారకుండా ఉంటారని అక్కడి మానసిక నిపుణులు వారికి సలహాలిస్తున్నారు.
చూశారా ! ఎన్ని ఉపయోగాలున్నాయో ! ఈ రోజు పశ్చిమ దేశాల్లో ఈ అలవాటుని ప్రోత్సహించేందుకు సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. మనకా అవసరంలేదు. చేయాల్సిందల్లా ఉన్న సంప్రదాయన్ని కొనసాగించడమే.

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష
సంకలనం: ఋషి పరంపర
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com