పాకిస్తాన్లో హిందువులపై కొనసాగుతున్న నరమేధం.

0
పాకిస్తాన్లో హిందువులపై కొనసాగుతున్న నరమేధం. ఇరవై ఒక్క ఇళ్ళు దహనం

పాకిస్థాన్లో హిందువులపై అమానవీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్లోని సింధు ప్రాంతంలో గల 21 హిందూ గృహాలు తగులబెట్టబడ్డాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కొట్టి వాళ్ల ఇళ్లల్లో నుంచి గెంటి వేశారు. తగలబడ్డ ఇళ్లలో చిక్కుకున్న వారి పరిస్థితి విషమంగా ఉంది.

మరో గ్రామంలో స్థానిక పాకిస్థానీ గూండాలు ఒక నిరుపేద హిందూ కుటుంబం పై దాడి చేశారు. ఆ ఇంట్లోనే గృహిణిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆ ఇంట్లోని వారిని ఆ ప్రాంతం నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు.

దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ వీలైనంత త్వరగా తమ దేశంలోని మైనారిటీ హిందువులను దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ లక్ష్యంతోనే వారు హిందువుల గృహాలపై దాడులు చేసి మహిళలను పిల్లలను హింసించడం ద్వారా వారిని భయభ్రాంతులను చేసి ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళగొడుతున్నారు.

ఇటీవల సింధ్ ప్రావిన్స్ లోని తడడోస్, తర్పార్కర, హల, మటియారి గ్రామాలలో గల 21 హిందూ గృహాలను తగులబెట్టారు.
అందిన సమాచారాన్ని బట్టి పిల్లలతో సహా అనేకమంది మరణించారు. మరికొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

మరొక పాకిస్తానీ మూకల దాడిలో ఒక ముస్లిమేతర మహిళను ఆమె కుటుంబ సభ్యుల ముందే లైంగికంగా వేధించడమే కాకుండా, ఆ కుటుంబ సభ్యులపై దారుణంగా దాడి చేసి వారిని వారి ఇంటి నుంచి వెళ్లగొట్టారు.

పాకిస్థాన్లోని పంజాబ్ ఈ ప్రాంతంలో ఒక నిరుపేద హిందూ కుటుంబంపై వారి పొరుగు వారే దాడి చేసి వారిని అక్కడినుంచి వెళ్లగొట్టారు. తీవ్ర గాయాలతో వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

గ్రామాలలో జరుగుతున్న దాడులే కాకుండా, పాకిస్థాన్లోని హిందువులు పాకిస్తాన్ ప్రభుత్వ పరంగా కూడా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు.
COVID – 19 సంక్షోభ సమయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లభించకపోవడం ముదావహం. కనీసం పసి పసి పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా వారిని వేధింపులకు గురి చేస్తూ ఉండడం ఆ రాక్షస మూకలకు మామూలు విషయం.

అనేక సంవత్సరాలుగా సింధు ప్రావిన్స్లోని   మెజారిటీ ముస్లిములు తమ ప్రభుత్వం తో కలిసి అక్కడి  హిందూ మైనారిటీలపై  నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. నిజానికి మొదట్లో ముస్లిములు ఆ ప్రాంతంలో శరణార్ధులుగా ఆశ్రయం పొందారు. తదనంతర కాలంలో వారు ఆ ప్రాంతమంతా సంఖ్యాపరంగా విస్తరించి ఆక్రమించారు.

తెలుగు అనువాదం : హిందూ సాగర్ రెడ్డి
మూలము: విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top