సామాజిక స్మగ్లర్లు పాస్టర్లు - Samajika smaglarlu pastarlu

కరుణాకర్ గారి నుంచి ఇదిగో అందరికీ సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. "సామాజిక స్మగ్లర్లు పాస్టర్లు" పుస్తకానికి ఒక రూపం వచ్చేసింది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ పుస్తకాన్ని నేను ఒక్కడినే వ్రాయడం లేదు. మరోవ్యక్తి కూడా ఈ పుస్తక రచనలో భాగస్వామి. ప్రస్తుతానికి ఆయన పేరు రామభక్త్.

ఆయన తన వెర్షన్ ఎప్పుడో వ్రాసి పంపించేశారు. నా భాగమే లేటయ్యింది. లాక్డౌన్ పుణ్యమాని ఇప్పటికైనా పూర్తి చేయగలిగాను.

ఇక రెండు భాగాలని ఎక్కడెక్కడ సమన్వయం చేసి, సమ్మిళతం చేయాలో చూసుకుని ఫైనల్ ఔట్ పుట్ తయారు చేసేస్తే డి.టి.పి. వర్క్ స్టాటైపోతుంది.
నాభాగంలో నేను వ్రాసిన అంశాల విషయ సూచిక:

 • 1) ఉపోద్ఘాతము
 • 2) పాస్టర్ గిరీ కి ఎందుకంత గిరాకీ
 • 3) మతమార్పిడులకు పాస్టర్లు అనుసరించే వ్యూహాలు
 • 4) పాస్టర్ల మోసాలకు బైబిల్ లైసెన్స్
 • 5) ఒంటిస్తంభం మేడ
 • 6) పల్లెల్లో ముసలం
 • 7) గ్రహాంతరవాసులు
 • 8) ఆ ఒక్కటీ అడక్కు
 • 9) అహో పరలోక నివాసమా!
 • 10) క్రైస్తవ భారత్ ముఖచిత్రం
 • 11 గురువుని ముంచిన శిష్యులు
 • 12) భూతల స్వర్గం.

ప్రస్తుతానికి ఇవి. ఇంకా ఒకటి రెండు పెరగొచ్చు.

పేర్లు వింటుంటేనే ఫైవ్ స్టార్ హోటల్ లో మెనూ చదువుతున్నట్లుగా ఉంది కదూ పాస్టర్లూ..! అంతేమరి పేర్లతోనే పిచ్చెక్కిస్తా. యామ్ ఏ ప్రొఫెషనల్ రైటర్ యూ నో. సినిమా ఇండస్ట్రీ కి వెళ్తే త్రివిక్రమ్ లాగా యాడికో పోయేవాణ్ణి. నమ్మకం లేదా? అయితే బుక్ లో వ్రాసిన ఇంకో కొటేషన్ కూడా చెప్తా చూడండి.

"క్రైస్తవులకు-వాస్తవాలకు మధ్య పాస్టర్లు గోడలా నిలబడతారు. ఆ గోడ ను భేదించుకుని వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెట్టే సామర్ధ్యం ఏ కొందరికో ఉంటుంది"

ఒకే..! ఇంకా చాలా ఉన్నాయ్..దాచామ్. మా బాలయ్య బాబు లా.

రామభక్త్ గారు వ్రాసిన భాగంలో కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలను మొదటిసారి చదివాను. ఖచ్చితంగా ఈ పుస్తకం #శివశక్తి కి మరో మైలురాయి కాబోతోంది. అన్నిపనులూ చకచకా జరిగిపోతే జూలై ఎండింగ్ కల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది.

పుస్తకావిష్కరణ కు చీఫ్ గెస్ట్ గా మా బ్రాండ్ అంబాసిడర్, పాస్టర్ విజయ్ కుమార్ ని పిలుద్దాం అనుకుంటున్నా. అలాగే పుస్తకాన్ని కంచె ఐలయ్య కు అంకితం ఇస్తున్నా.

ప్లీజ్ బ్లెస్ మీ పాస్టర్స్..! హూ..మీరు ఇవ్వరు గాని నేనే ఇస్తా చూడండి.

బైబిల్ దేవుడు మీ గుడారాలు పీకివేయునుగాక. ఆమెన్.

To know more:
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top