వెంకన్న భూములు వేలానికిమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి రెండు బృందాలను తితిదే ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది.

మూలము: విశ్వ సంవాద కేంద్రము ( ఆంధ్రప్రదేశ్ )

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top