జూలై 21 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం - Amarnath Yatra

0
జూలై 21 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం - Amarnath Yatra
మ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన అమర్‌నాథ్‌ యాత్ర 2020 జులై 21న ప్రారంభం కానుంది. ఈ సారి కేవలం 14 రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 3తో ముగియనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి శుక్రవారం ప్రథమ పూజ నిర్వహించారు.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లదలిచిన వారు ఈ సారి కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో టికెట్లను ఎంపిక చేస్తారు. కేవలం 4 నుంచి 5 వేల మంది యాత్రికులను మాత్రమే ఎంపిక చేయనున్నారు. 55 ఏళ్లు పైబడిన వారికి యాత్రకు అనుమతించరు. సాధువులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అలాగే యాత్రికులకు కొవిడ్‌-19 పరీక్షలు చేస్తారు. లక్షణాలు లేనివారికి మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. తొలిసారిగా ఉదయం, సాయంత్రం లైవ్‌ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top