చైనా వస్తువులను బహిష్కరించాలంటూ CAIT పిలుపు - CAIT calls for boycott of China goods7 కోట్ల మంది వ్యాపారులు మరియు 40,000 ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ వాణిజ్య సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జూన్ 10 నుండి దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించే జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది.

చైనా వస్తువులను విక్రయించవద్దని వ్యాపారులను ప్రేరేపించడమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “వోకల్ ఫర్ లోకల్” పిలుపులో భాగంగా దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భారతీయ వినియోగదారులను కోరతామని CAIT తెలిపింది.

ఒక వీడియో విలేకరుల సమావేశంలో CAIT, రైలులో క్యాటరింగ్ సమయంలో టీ మరియు నీరు త్రాగడానికి ఉపయోగపడే ఒక గ్లాసును, ఫేస్ మాస్క్ ను విడుదల చేసింది, దీనిపై CAIT ప్రచారం యొక్క సందేశం ముద్రింపబడి ఉంది. వ్యాపారులు ఈ మాస్కును ధరించి ఈ ప్రచారాన్ని సాగిస్తారని తెలిపారు. మరోవైపు, 2020 డిసెంబర్ నాటికి అన్ని రాజధాని మరియు శతాబ్ది రైళ్లలో క్యాటరింగ్ కోసం సుమారు 5 కోట్ల గ్లాసులను తాము పంపిణీ చేస్తామని కూడా వారు వెల్లడించారు.
2021 డిసెంబర్ నాటికి చైనా వస్తువుల దిగుమతిని సుమారు లక్ష కోట్ల రూపాయలకు తగ్గించాలని CAIT భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, చైనా నుండి దిగుమతి అయ్యే సుమారు 3000 ఉత్పత్తుల యొక్క సమగ్ర జాబితాను CAIT సిద్ధం చేసింది. ఈ ఉత్పత్తులకు బదులుగా భారతదేశంలో తయారైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు సులభంగా లభిస్తాయని CAIT పేర్కొంది. CAIT తయారుచేసిన 3000 ఉత్పత్తుల జాబితాలో ప్రాథమికంగా FMCG, వినియోగ వస్తువులు, బొమ్మలు, పండుగ వస్తువులు, బట్టలు, వస్త్రాలు, స్టేషనరీ, కాగితం, ఆహార వస్తువులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బిల్డర్ హార్డ్‌వేర్ మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో భారతీయ తయారీదారులదే ప్రధానమైన పాత్ర అని వారు చెప్పారు. చైనా ఉత్పత్తుల బహిష్కరణలో, దేశవ్యాప్తంగా దేశీయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించడంలో CAIT భారతీయ తయారీదారులతో కలిసి పని చేస్తుందని తెలిపారు.

ఈ ప్రచారానికి ఎక్కువ మందిని జోడించడానికి సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రచారాన్ని నిర్వహిస్తామని CAIT తెలిపింది. CAIT ఈ కార్యాచరణకు తన వైస్ చైర్మన్ బ్రిజ్ మోహన్ అగర్వాల్‌ను కన్వీనర్‌గా, సుమిత్ అగర్వాల్ మరియు ధైరీషీల్ పాటిల్‌లను కో-కన్వీనర్‌లుగా నిర్ణయించింది. వీరితో దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల సీనియర్ వాణిజ్య నాయకులు అందులో సభ్యులుగా ఉన్నారు.

గతంలో కూడా CAIT దేశీయ వ్యాపారులకు స్థానం కల్పించటం లేదంటూ ఇ-కామర్స్ ప్లేయర్స్, ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ పెట్టుబడులకు వ్యతిరేకంగా కూడా CAIT గతంలో తీవ్ర నిరసన తెలిపింది.


buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top