జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు - Jallikattu

జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు - Jallikattu

జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు

ఇటీవల 2010లో జలిలకట్టుపై పెద్ద జగడమే జరిగింది. పశుహింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు గగ్గోలు పెడితే, గ్రామీణ సంస్కృతికి ఈ క్రీడ అద్దంపడుతుందని చాలామంది సమర్థించారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించి జల్లికట్టుకు అనుమతినివ్వాలని వేలాదిమంది ఉద్యమించారు. చివరికి కేంద్రం జోక్యంతో ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు కథ సుఖాంతమైంది. కొన్ని వారాలపాటు దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ మొత్తం ప్రహసనంలో కొన్ని ఆందోళన కలిగించే, ప్రమాదకర ధోరణులు కూడా బయటపడ్డాయి.

వినాయక నిమజ్జనం, దీపావళి టపాకా యలు, రంగురంగుల హోళీ, కృష్ణాష్టమి ఉట్లు కొట్టే పండుగ, జల్లికట్టు...ఇలా పండుగ, ఉత్సవం ఏదైనా 'పర్యావరణ పరిరక్షకులు', 'మేధావులు', 'జంతు ప్రేమికులు' మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవన్నీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పరచినవేనని, వాటి వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదని వాదిస్తారు. వాటిని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ ప్రపంచం సుఖంగా, శాంతిగా బతకలేదని నొక్కి చెపుతారు. అందుకోసం ఊరేగింపులు, ఉద్యమాలు నిర్వహిస్తారు.
జల్లికట్టు - Jallikattu
జల్లికట్టు - Jallikattu
జల్లికట్టు ఏమిటి?
జల్లికట్టు 5000 ఏళ్ళనాటి నుండి వస్తున్న సంప్రదాయ క్రీడ. సింధూ నాగరకత సమయం నుంచి ఈ క్రీడ మన దేశంలో ఉంది. ఈ క్రీడా చిత్రాన్ని ముద్రించిన నాణాలు కూడా ఈ నాగరకత అవశేషాల్లో లభించాయి. పొగరుబోతు ఆంబోతు ల్ని వాటి మూపురాలు పట్టుకుని అదుపు చేయడం ఈ క్రీడలో ప్రధాన అంశం. అందుకనే దీనిని 'ఎరు తజువుతల్‌' (ఎద్దును అదుపు చేయడం) అంటారు. అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిన నాగరక తగా పేరుపడిన సింధూ నాగరకతలో ఉన్న ఈ క్రీడను ఇప్పుడు కొందరు 'అనాగరికం' అంటున్నారు. అదే విచిత్రం.

తమిళనాట నాయక రాజులు పరిపాలిస్తున్న ప్పుడు ఎద్దుల కొమ్ములకు బట్టలో చుట్టిన బంగారు నాణాలు కట్టేవారు. ఎద్దు మూపురాన్ని పట్టుకుని అదుపు చేసేవాళ్ళు ఆ బట్టను రెండవ కొమ్ముకు ముడివేయాలి. అలా చేస్తే అందులో నాణాలు అత నికి బహుమతిగా ఇచ్చేవారు. జల్లి లేదా సల్లి అంటే నాణాలు. కట్టు అంటే కట్టడం. ఇప్పుడు నాణాలు లేకుండా కేవలం ఒక బట్ట మాత్రమే కడుతున్నారు. 'వాడివాసల్‌' అనే ద్వారం నుండి బయటకు వచ్చే ఎద్దు లేదా ఎద్దులు నిర్ణీత మార్గం గుండా పరుగెడ తాయి. అలా పరుగెట్టే వాటిని పట్టుకుని అదుపు చేయాలి. ఇందులో అనేక వందలమంది పాల్గొంటా రు. ప్రయత్నిస్తారు. కానీ ఒకరిద్దరు మాత్రమే విజ యం సాధిస్తారు. వారికే బహుమతి లభిస్తుంది.

ఎందుకీ క్రీడ?
జల్లికట్టు కేవలం వినోదం కోసం ఆడే ఆట కాదు. దీనితో గ్రామీణ జీవన వ్యవస్థలోని సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. జల్లికట్టు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మనుష్యుల మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని, వాటి చుట్టూ అల్లుకున్న ఆచారాలు, పద్ధతుల్ని మన కు చూపుతుంది. దేవాలయాల్లో ఒక ఎద్దును ప్రత్యే కంగా పెంచుతారు. దానిని కోయిల్‌ కాలై (దేవాల య ఎద్దు) అంటారు. దీనిని చాలా పవిత్రంగా చూసుకుంటారు. జల్లికట్టు ఆటలో మొదట ఈ ఎద్దు పరిగెడుతుంది. అప్పుడు దానిని ఎవరూ తాకరు. ఆ తరువాతే అసలు ఆట మొదలవుతుంది. ఈ ఆటలో కులం, వర్గం తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. కాలగతిలో క్రమపరిణా మంలో భాగంగా ఏర్పడే స్థానిక పశు జాతుల వల్ల కలిగే ప్రయోజనాలు విదేశీ, సంకర జాతుల వల్ల ఉండవు. 

భారత రాజ్యాంగంలోని 48వ అధి కరణ పశు సంతతి అంతరించిపోకుండా, వాటిని వధశాలలకు తరలించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. అలాగే ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సులో ఆమోదించిన తీర్మానం కూడా దీనికి సంబంధించి నదే. అందులో ని 1,2,3 సూత్రాలు పశుసంపద ప్రకృతిలో ముఖ్య భాగమని, వాటిని జాతీయ సంపదగా గుర్తించి పరిరక్షించుకోవాలని పేర్కొంటున్నాయి. ఆ తీర్మానం పై ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ సంతకాలు చేశాయి.

జల్లికట్టును ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
గ్రామీణ జీవన వ్యవస్థతో ఏమాత్రం సంబం ధం లేనివారు, దాని గురించి ఎలాంటి అవగాహన లేని నగరవాసులు కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అలాగే సంచలన వార్తల కోసం తహతహలాడే మీడియా కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది. ఒక సంవత్సరంలో మొత్తం 10వేలమంది జల్లికట్టు క్రీడలో పాల్గొంటారనుకుంటే అందులో 50 నుంచి 100మందికి మాత్రమే కొద్దిగా గాయపడతారు. మరణాలనేవి అసలు ఉండవు. కానీ జల్లికట్టువల్ల హింస జరిగిపోతోందంటూ ప్రచారం మాత్రం సాగుతోంది.

ఈ దేశంలో సంస్కృతీ సభ్యతల్ని పూర్తిగా రూపుమాపి తద్వారా ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్న మిషనరీలు కూడా ఇలాంటి ఉత్సవాలు, క్రీడల్ని వ్యతిరేకించారు. మత వ్యాప్తికి జోషువా ప్రాజెక్ట్‌లాంటి ప్రణాళికల్ని అమలు చేస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇక్కడ సంస్కృతీ సంప్రదాయాల్ని ధ్వంసం చేసేందుకు మరో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. అదే ప్రాజెక్ట్‌ థెసా లొనికా. దేశీయ ఉత్సవాలు, పండుగలపై విషప్రచా రం చేసి, వాటి పట్ల ప్రజల్లో అసహ్యాన్ని, చిన్నచూ పును కలిగించి తద్వారా వారిని సంస్కృతి, సంప్రదా యాలకు దూరం చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. అందులో భాగమే హిందూ పండుగలు, ఉత్సవాలపై విషప్రచారం. వీళ్ళేకాక జల్లికట్టు జగడాన్ని జిహాదీ వాదులు కూడా ఉపయోగించు కోవాలనుకున్నారు. జల్లికట్టు మద్దతుగా ప్రజల్లో సహజంగా వచ్చిన స్పందనను తమ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. 

ఈ ప్రదర్శనల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ వ్యతిరేక ఉద్యమం గా మలచాలంటూ పేర్కొన్న కొన్ని పత్రాలు మెరీనా బీచ్‌లో లభించడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యప రచింది.ఒసామాబినా లాడెన్‌ చిత్రాలు ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. భారత, మోదీ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. 

రచన: కేశవ (లోకహితం)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top