ప్రమాదంలో ఆరుద్ర పురుగులు - Pramādanlō ārudra purugulu
ప్రకృతమ్మ ఒడిలో ఎర్ర నేస్తాలు - ఇప్పుడు ప్రమాదంలో

ఆరుద్ర కార్తెలో కనిపించే ఆ పురుగుల పేరు ఆరుద్ర పురుగులు (చందమామ పురుగులు). ఎప్పుడైనా ఆరుద్ర పురుగుల గురించి విన్నారా? లేదా చూశారా? అయితే ఇది చదవండి.

తొలకరి జల్లుల్లు నేల తల్లిని ముద్దాడగానే .. ఆ జీవులకు ప్రాణం లేచొస్తుంది. పచ్చని పంటపొలాలపై పాకుతూ అవి పలకరిస్తాయి. వాటి రాకే శుభసూచకంగా భావించి రైతులు పులకరించిపోతారు. అవే ఆరుద్ర పురుగులు.

పచ్చని పంటపొలాలపై ఎర్రని నక్షత్రాల్లా కనిపిస్తున్నవి ఏమిటో గుర్తుపట్టారా? అవును ... ఆరుద్ర పురుగులే. వేగంగా నడుస్తూ ... ముట్టుకోగానే ముడుచుకుపోయే ఈ చిట్టి జీవులు రైతన్నల నేస్తాలు. ప్రకృతి సోయగాలు. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాకాల ఆగమనానికి గుర్తుగా ఇవి తడి నేలపై ... పంటపొలాలపై పాకుతూ కనువిందు చేస్తున్నాయి.ఆరుద్ర పురుగుల్ని శుభ సూచకంగా భావిస్తారు రైతన్నలు. అయితే గతంలో ఎక్కువగా ఉండే పురుగులు ... ఇప్పుడు తగ్గిపోయాయంటున్నారు. రెడ్ బగ్స్‌ గురించి తెల్సుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, తగిన చర్యలు తీసుకోకపోతే ... భవిష్యత్తులో ఆరుద్ర పురుగులంటే పుస్తకాల్లోనో, ఇంటర్‌నెట్‌లోనో చూడడం తప్ప మరో గత్యంతరం ఉండదు.

కేవలం ఒక చిన్న ప్రాంతానికి పరిమితమై, జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోస్తున్నాయి ఆరుద్ర పురుగులు. ఇప్పుడవి ప్రమాదంలో పడ్డాయి. 

వాటిని చంపి మందులు తయారు చేయడం కోసం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీటిని చంపి, ఉడికించి మందులను తయారు చేస్తారు. అందువలన వీటికి గల్ఫ్ దేశాల్లో చాలా గిరాకీ ఉంది. కిలోకు 500 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బుకు ఆశపడి, ఈ మిత్రజీవాలను, ఆరుద్రకార్తె అతిధులను అక్రమంగా రవాణా (స్మగిలింగ్) చేస్తున్నారు దుండగులు. దీని కోసం ప్రత్యేకంగా కమిటీలు వేసుకుని మరి వాటిని ఏరి వేస్తున్నారు.యాదగిరిగుట్ట, భువనగిరి ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. 

మనం మేల్కోకుంటే భూసారాన్ని పెంచే ఈ పురుగులు అంతరించిపోతాయి. దయ చేసే వాటి గురించి అందరికి అవగాహన కలిగించి వాటిని రక్షించండి.

సంకలనం: సాక్షి - గౌరీ గణేష్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top