తిరుమల ఆలయాన్ని నిర్వీర్యం చేసే భారీ కుట్ర - Tirumala Aalayamతిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు.

వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల భద్రత, స్వామివారి కల్యాణాల నిర్వహణ స్థలం మార్పిడి వివాదం, మరోప్రాకారం వివాదం ఇలాంటి అనేక అంశాల సందర్భంగా వారి నాయకత్వంలోనే వివాదాలు పరిష్కరింపబడ్డాయి. పది సంవత్సారాలపాటు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సలహాదారుడుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉంటూ అనేక ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని వీడారు. వారు వ్రాసిన ‘తిరుమల చరితామృతం’ (ఎమెస్కో ప్రచురణ) అనే తిరుపతి చరిత్ర గ్రంథం నుండి నేడు మనకు కావలసిన కొన్ని ముఖ్యాంశాలు)
స్వామివారి ప్రధాన ఆలయం
 అత్యంత ప్రాచీన మందిరం:
పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభం నుంచి తిరుమలలో దేవాలయం ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక కాలంలో కట్టిన దేవాలయాలు నేడు లేవు. ట్టు క్రింద ఆటవికులు పూజించేవారు. వీరు పాలు, తేనే, కొర్రక్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ||శ| 7-8 శతాబ్దాల వరకు శ్రీ స్వామివారి విగ్రహాన్ని ఆరుబయట చెలు, అన్నం నివేదన చేసేవారు. తరువాత జానపదులు మట్టి మూకుళ్లలో స్వామి వారికి ఆరగింపు చేసేవారు. ఇదే కుమ్మరి భీముని అర్చావిధానం. సగం పగలకొట్టిన కొత్త మట్టికుండలో నైవేద్యం చేసేవారు. ఈ ఆచారం నేటికీ ఉంది. క్రీ||శ|| 2వ శతాబ్దంలో జైన తమిళుడు ఇళ్ళంగో అడిగన్ వ్రాసిన ‘శిలప్పదికారం’ గ్రంధంలో తిరుమల దేవుణ్ణి ‘తిరువేంగడ ముడైయాన్’గా పేర్కొనడం జరిగింది. ఆధునిక చరిత్ర మేరకు క్రీ||శ|| 7-8 శతాబ్దాల నాటికే ఆచ్ఛాదనతో కూడిన తిరుమల దేవాలయం ఉండేది. క్రీ శ|| 9666 నుండి అనేక శాసనాలు మనకు లభిస్తున్నాయి. తిరుమల దేవాలయపు గోడల పైగల అనేక శాసనాలను పరిశీలించి 1927లో శ్రీ సాధు సుబ్రహ్మణ్యంగారు ఆరు గ్రంథాలను వ్రాశారు.

తిరుమల దేవాలయంపై మాత్రం ముస్లింలు దండయాత్ర చేయలేదు:
9వ శతాబ్దం నుండి భారతదేశంపై విదేశీ ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యయి. ఉత్తర భారతదేశంలోని చిన్నా పెద్దా దేవాలయాలు – అయోధ్య, మధుర, కాశీ, షోలాపూర్…. ఒకటేమిటి అన్ని దేవాలయాలు పదేపదే విధ్వంసానికి గురి అయ్యాయి.
13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని వివిధ దేవాలయాలపై ముస్లిం దురాక్రమణలు జరిగాయి.ఉత్తర భారతంనుండి దక్షిణ భారతం వైపు సైన్యాలు వెళ్ళే మార్గంలోనే తిరుపతి ఉంది. 1328లో తమిళనాడులోని శ్రీరంగంపై దండయాత్ర జరిగింది. మధుర మీనాక్షి దేవాలయం విధ్వంసం అయ్యింది. 13వ శతాబ్దంలోనే తిరుపతిలోని పార్థసారధి దేవాలయంపై దాడికి ముస్లిం మూకలు రానున్నాయని తెలిసి గర్భగుడి మూసివేశారు. 700సం||లపాటు గోడచాటునే శ్రీ పార్థసారధిస్వామి, సత్యభామ రుక్మిణి దాక్కోవలసి వచ్చింది. గర్భగుడి కుడివైపున శ్రీ గోవిందరాజస్వామి శయన స్థితిలో నేడు దర్శనమిస్తారు. ఈ దేవాలయాన్నే శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం అంటారు. 1980వ సంవత్సరంలో 700సం||ల తరువాత శ్రీ పార్థసారథి స్వామి, సత్యభామ రుక్మిణిలు తిరిగి పూజలు అందుకోవటం ప్రారంభించారు.

17వ శతాబ్దంలో చంద్రగిరి, తిరుపతి మధ్య ఉన్న శ్రీ తిమ్మప్ప దేవాలయం, అగస్త్యేశ్వర దేవాలయం విధ్వంసానికి గురయ్యాయి. తిరుచానూరు దేవాలయం కూడా విధ్వంసానికి గురయింది. అయితే విచిత్రం తిరుమలపై మాత్రం విదేశీ ముస్లిం దురాక్రమణదారులు దాడి చేయలేకపోయారు. నిజానికి సైనికులకు తిరుమల కొండ ఎక్కడం పెద్ద కష్టమేమీకాదు. అయినా వారు ఆ విధమైన దుస్సాహసం చేయలేదు. ఇది తిరుమల వెంకన్నస్వామి మహిమ కాకపోతే మరేమిటి?

ఈస్ట్ ఇండియా కంపెనీ, తరువాత ఆంగ్లేయ ప్రభుత్వం తిరుమలపై పెత్తనం వహించాయి. ఆ సమయంలో కూడా ఇంగ్లీషు అధికారులు తిరుమల కొండను సైతం ఎక్కే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు కొన్ని సందర్భాలలో ఆంగ్లేయ సైనికులే తిరుమలపైకి విదేశస్థులెవరూ (ముస్లిం ఆక్రమణకారులు, నజీబుల్లా లాంటివాళ్ళు) రాకుండా అడ్డుపడ్డారు. తిరుపతి ప్రక్కనగల కరకంబాడి గ్రామం తిరుమల రక్షణకు ఆంగ్లేయ సైనిక కేంద్రంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున సీనియర్ అధికారి మెకన్జే నివేదిక ప్రకారం….

ఆలయానికి చుట్టూ నాలుగు మాడవీధులుండేవి. కొండమీది జనాభా చాలా తక్కువ. ఆ అడవుల్లో దాదాపు ఒక లక్షమంది యానాదులు ఉండేవారు. అడవుల్లో ఉండే తేనే, చందనం, ఎర్ర చందనం, మూలికలు, ఉసిరిక, కందమూలాలు వంటివి తెచ్చి తిరుమలలో అమ్ముకుని జీవించేవారు.” ఆలయానికి చుట్టూ మాడ వీధులలో కూడా అడవిపందులు తిరుగుతూ ఉండేవి. అవి ఎవరికీ హానిచేయవు. వాటి జోలికి పోతే వారిని కోరలతో చీల్చివేసేవి. యాత్రికులకు, స్థానికులకు పాములు, తేళ్ళు తిరుగాడుతూ కనిపించేవి. కానీ అవి ఎవరినీ కరిచేవి కాదు. ఎవరైనా వాటికి హాని తలపెట్టినప్పుడు అవి కాటు వేసినా ఆ పాముకాని, తేలుకాని కరిచిన వ్యక్తిని వెంటనే ఆలయంలోకి తీసుకువెళ్ళి, స్వామి వారి తీర్థం అతనికి ఇచ్చి, కుట్టిన ప్రదేశంలో ‘స్వామి తీర్థంతో’ కడిగితే విషం ఎక్కకుండా అతను బతికేవాడు. ఇదంతా భగవంతుని అనుగ్రహం వల్లనే జరుగుతోందని అందరి నమ్మకం…..”

ముససల్మానులు (మ్లేచ్ఛులు), ఇంగ్లీషు వారు కూడా ఈ దేవుడికి మొక్కులు మొక్కుకుని, కానుకలు వేల రూపాయలలో పంపేవారు.”
తిరుమల గోపురం
తిరుమల గోపురం 
తిరుమల ఆదాయంపై కన్నేసిన ముస్లిం, ఆంగ్లేయ పాలకులు:
విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల అఖండంగా వెలుగొందింది. సంవత్సరంలో 10 ఉత్సవాలు జరిగేవి. విజయనగర సామ్రాజ్య పాలకులు ఒక ప్రత్యేక అధికారిని నియమించి తిరుమల దేవాలయం అత్యంత సక్రమంగా జరిగేటట్లు ఏర్పాటు చేశారు. 60సం||ల పాటు సైనిక అధికారిగా పనిచేసిన సాళువ నరసింహరాయలు నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారులందరికీ ఆదర్శప్రాయుడు. 1440 – 1500 విజయనగర సామ్రాజ్యం 1565లో కళావిహీనమయింది. దీంతో తిరుమల గ్రహణం పట్టుకొంది.

ముస్లింల, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో తిరుపతి, చంద్రగిరి కీలక రాజకీయ కేంద్రాలుగా ఉండేవి. తిరుమలకు వచ్చే స్వామివారికి వచ్చే ఆదాయంపై ముస్లిం, ఈస్ట్ ఇండియా, ఆంగ్లేయ పాలకుల కన్నుపడింది. తిరుమలలో జరిగే పూజాకార్యక్రమాలలో స్వయంగా జోక్యం చేసుకోకపోయినా దేవాలయ నిర్వహణ ఖర్చుల కోసం కొంత రొఖ్ఖమును అందజేసి మిగిలిన ఆదాయాన్నంతా తమ బొక్కసంలో వేసుకునేవారు. వివరాలకు కొన్ని ఉదాహరణలు : కొన్ని సంవత్సరాలు ఆర్కాటు నవాబు పరిపాలన పరిధిలో తిరుమల తిరుపతి ఉండేది. 1740 నాటికి ఆర్కాట్ నవాబు చనిపోయాడు. అతని కొడుకు నవాబు అయ్యాడు. తన రాజ్యానికి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ధన సహాయం తీసుకుని, దానికి ప్రతిగా ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయలసీమ జిల్లాలను తిరుమల వెంకటేశ్వరుణ్ణి ‘కుదువ’ పెట్టాడు.

ఒకనాడు దేవస్థానానికి 400ల గ్రామాలు దేవదేయాలుగా ఉండేవి. కంపెనీ పాలన నాటికి 187 గ్రామాలయ్యాయి. తరువాత అన్ని గ్రామాలు ఆంగ్లేయుల పరమయ్యాయి. ఒకనాడు తిరుమల తిరుపతి సరిహద్దు అంటే శ్రీకాళహస్తి, నాగలాపురం, కడప.
  • ➣ “1831 మే-ఆగష్టుకు చెందిన ఆంగ్లేయ పత్రిక ఏషియాటిక్ జర్నల్ (ఆంగ్లేయపాలనా పరిధిలోని దేశాల పరిస్థితిని తెలిపే పత్రిక) లోని ఒక వ్యాసపు అంశం (హిస్టరీ ఆఫ్ తిరుపతి గ్రంథంలోని ఎపెండిక్స్ వ్యాసం).” ఇలా ఉంది,”…..
  • ➣ “తన శిశువుకున్న కాలి అందెలు, చేతి గాజులు, విప్పి హుండీలో వేసి ఈ రాతి విగ్రహం తనపైనా, తన శిశువుపైనా అనుగ్రహం చేస్తుందని నమ్మడం, తాను ఈ పని చేయడానికి ఆనందంగా వందల మైళ్ళు ఎంతో ప్రయాసలకు లోనై రావడం వింత కాదా? ఈ యాత్ర తప్ప ఆమె జీవితంలో తన ఊరి బయటకే వచ్చి ఉండకపోవచ్చు….”
  • ➣ “1822 సంవత్సరం మొత్తం ఆదాయం (ఖర్చులు తీయకుండా) 1,42,000 చిల్లర. ఖర్చులు 25వేలు తగ్గిస్తే మిగతాది సర్కారుకు నికర ఆదాయం . అదే 1820లో ఆదాయం 1,02,000/-రూ||లు.”
  • ➣ “తిరుపతి ఆలయం విషయంలోనూ అంతే…. కంపెనీ ఆధీనంలోకి వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం ఆదాయం తగ్గేట్లు చూస్తున్నాం.
వచ్చిన ఆదాయం కూడా వారికి దక్కకుండా సర్కారుకే చెందేట్లు చూస్తున్నాం. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగితే తిరుపతి ఆదాయం పూర్తిగా పడిపోయి ఆలయ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. హిందువులు ఉత్తేజ పరచగల స్తోమతగల ఈ ఆలయం నిర్వీర్యం అవుతుంది. అలానే దేశంలోని ముఖ్యమైన ఆలయాల విషయంలో కూడా. అవన్నీ తిరుపతిలా కాదు. ఇప్పటికే దెబ్బతిని పోయి వున్నాయి.”
రధోత్సవం
రధోత్సవం 
అయినా ఈ హిందూమతమనే దెయ్యానికి ఇంకా చాలా ఆయువుపట్లు అలానే ఉన్నాయి. నెమ్మదిగా వాటిని దెబ్బతీయాలి.” ఇదీ ఆంగ్లేయుల కుట్ర.

సంకలనం: K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.
వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top