అక్రమ చర్చి నిర్మాణంపై 8 వారాల్లో నివేదిక ఇవ్వండి – తూ.గో జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన NHRC - Report within 8 weeks on illegal church construction - NHRC directed by East Godavari District District Collector

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, అనుమతులు లేకుండా, అక్రమంగా, హిందువులు మాత్రమే నివసిస్తున్న ఇండ్ల మధ్యలో జరుగుతున్న ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు స్థానిక గ్రామ రెవెన్యూ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ దాకా పలుమార్లు ఫిర్యాదులు పంపినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) కి ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసినదే.

జాతీయ మానవ హక్కుల కమీషన్ నేడు ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలను ప్రారంభించాలని, 8 వారాల్లోగా తీసుకున్న చర్యల గురించి NHRC కి తెలియజేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) ఆదేశాలు జారీ చేసింది.

__విశ్వ సంవాద కేంద్రము 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top