ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి - Mangal Pandey, The First Freedom Fighter

ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి - Mangal Pandey, The First Freedom Fighter

మంగళ్ పాండే

మంగళ్ పాండే, ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. 1857 లో తొలి స్వాంతంత్ర సంగ్రామంలో (అది కేవలం తిరిగుబాటు కాదని రాజీవ్ దీక్షిత్ వివరించారు) కీలకపాత్ర పోషించిన వ్యక్తి. వీరు 19 జూలై 1827 లో నగ్వా గ్రామం, ఎక్కువ బల్లియా జిల్లా, అవధ్ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పేదరికమే వారిని బ్రిటీష్ సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది. అయితే వారి జీవితాన్ని మలుపు తప్పిన ఒక సంఘటన గురించి నేను చిన్నప్పుడు చదివాను. అది -

బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు.మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు .

ఒకనాడు బ్రిటీష్ రైఫిల్స్‌లో మందుగుండు పెట్టి, వాటిని ఉపయోగించడానికి ఆవు మాంసపు కొవ్వు, పంది మాంసపుకొవ్వు ఉపయోగించేవారు. ఆ కొవ్వును సైనికులు నోటితో కొరకాల్సి ఉంటుంది...... ఒకసారి మంగళ్ పాండే ఒక గ్రామం ద్వారా వెళుతుండగా వారికి దాహం వేసింది. దగ్గరలో ఒక స్త్రీ బావిలో నీరు తోడుతుండటం చూసి, అక్కా! నాకు దాహంగా ఉంది, కాస్త నీరు ఇస్తావా అని అడిగారు. దానికి బదులుగా ఆ వనిత, తమ్ముడూ! నువ్వు బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్నావు. గోమాత మాంసపు కొవ్వును నీ నోటితో స్పృశిస్తావు. గోవు ఎంతో పవిత్రమైనది. నీకు నీరిస్తే, నీరు కూడా అపవిత్రమవుతుంది. క్షమించు తమ్ముడూ అని చెప్పిందట. అది మంగళ్ పాండే లో ఆలోచనను రగిలించింది. అదే క్రమంగా బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు కారణమయ్యింది.

1857 లో జరిగిన ఆ పోరాటం కారణంగా 300 పట్టణాలకు భారతీయులు స్వాతంత్రం సాధించగలిగారు. ఆ తిరుగుబాటులో ఆంగ్లేయుల తలలు నరికారు భారతీయ వీరులు. కానీ కొందరు రాజుల కుట్రల కారణంగా ఉచ్చు మరింత బిగిసి ఆంగ్లేయులు ఇంకో 90 ఏళ్ళ పాటు పాలించే అవకాశం దక్కిందని రాజీవ్ దీక్షిత్ తన ఉపన్యాసంలో చెప్పారు. అటు తర్వాత 8 ఏప్రియల్ 1857 లో మంగళ్ పాండేను బ్రిటీష్ వారు ఉరిదీశారు.

కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్ప ఉద్యమకారుడు. భారతదేశ స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు. ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం. ఈ సందర్బముగా మంగళ్ పాండే గారికి నివాళి అర్పిద్దాం

అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !
  • బంధువులారా మేల్కొనండి స్వాతంత్య్రం, లక్ష్మీకి పవిత్రమైన అర్చన చేయడానికి ముందడుగువేయండి ,దేశ వ్యతిరేక విదేశీ శత్రువులతో పోరాటం చేసి స్వతంత్ర్య భారతాన్ని సాధిద్దాం అని భారతీయులను జాగృతపరిచిన దేశభక్తుడు...
  • బైరక్పుర్ లో ఆంగ్లేయుల విద్రోహ,విరుద్ద కార్యకలాపాలను వ్యతిరేకించి తీవ్రపోరాటంచేసిన ధీరుడు....
  • స్వతంత్ర్య ఆకాంక్ష గర్జన ద్వారా భారతీయుల యొక్క ధైర్య సాహసాలను బ్రిటీష్ సామ్రజ్యానికి చాటిచెప్పిన తల్లి భారతీ సుపుత్రుడు...
  • ఉరికొయ్యలను ముద్దాడి భారతమాత ఒడిలో వీరమరణం పొందిన వీరుడు మంగల్ పాండే జయంతి సందర్భంగా వందనం..

వందేమాతరం - భారత్ మాతా కీ జై

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top