"నర్తనశాల" హరికథ - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం - "Narthanasala" Harikatha - Radio broadcasting of Vijayawada -

"Narthanasala" Harikatha - Radio broadcasting of Vijayawada -

"నర్తనశాల" హరికథ - ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

  • ప్రసార తేదీ: మే 24, 2011
  • కథకులు: ముదపాక (మండపాక?) బాలసుందరం భాగవతార్
  • ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
స్థూలంగా నర్తనశాల కథ ఇదీ
మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాధ ఈ హరికథ ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది.

శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. ధర్మరాజు కంకుభట్టుగాను, భీముడు వంటలవాడు వలలునిగాను చేరుతారు. 'పేడివి కమ్మ'ని మేనక ఇచ్చిన శాపం అజ్ఞాతవాసములొ వరంగా వినియోగించుకొని అర్జునుడు బృహన్నలగా విరాటరాజు కుమార్తె ఉత్తరకు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు.నకులుడు సాలగ్రంధి అనే పేరుతో అశ్వపాలకుడిగా సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో గోసంరక్షకుడిగా చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.

పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, అతడిని హతం చేస్తాడు.

సుమారు 50 నిముషాల హరికథ ఇది...

➲ "నర్తనశాల" హరికథ - మొదటి భాగంవినండి 🎵డౌన్లోడ్🔽

___మాగంటి వంశీ గారి సౌజన్యంతో

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top