నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

21, జులై 2020, మంగళవారం

శ్రీ రామాలయం నిర్మాణ భూమి పూజ శంకుస్థాపనకు విచ్చేయనున్న ప్రధానమంత్రి మోదీ - Ram Mandir construction in Ayodhya set to begin from August, PM Modi invited for laying foundation

శ్రీ రామ మందిరం అచటనే నిర్మిస్తున్నాము హిందువుల 5 వందల సంవత్సరాల పోరాట ఫలితం మా చిన్ననాటి స్వప్నం సాకారం అవుతున్న శుభవేళ. అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం కోసం పోరాటం చేసిన హిందువులు సంఘ పరివార్ సంస్థలు కార్యకర్తలు నాయకులు అందరి పాదాలకు కోటి కోటి వంధనములు.....

అయోధ్య శ్రీ రామజన్మభూమి ఆలయ శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోది గారికి ఆహ్వానం.

అయోధ్యలో భవ్యమైన దివ్యమైన శ్రీ రామాలయం నిర్మాణ భూమి పూజ శంకుస్థాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి శ్రీమాన్యవర్ నరేంద్ర మోదీ గారిని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శనివారం ఆహ్వానించింది. శ్రీ రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేసి పునాది రాయి వేయనున్నట్లు ట్రస్టు అధికార ప్రతినిధి మహంత్‌ కమలనయన్‌ దాస్, అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌ దాస్‌ వెల్లడించారు. నక్షత్రాలు, గ్రహాల కదలికల ఆధారంగా రెండు తేదీలను శుభ ముహూర్తాలుగా నిర్ణయించామని తెలిపారు. వీటిలో ఏదో ఒక తేదీన రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.....

శ్రీ రామమందిర నిర్మాణం కోసం దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. డిజైన్‌ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కొందరు మంత్రులు, ఎంపీలు కూడా భూమి పూజకు హాజరవుతారని సమాచారం. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ శ్రీమాన్ మోహన్ భగవత్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.....

ఈ సందర్భంగా మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు మీడియాతో మాట్లాడుతూ భూమి పూజా కార్యక్రమాన్ని వీడియో కాన్పరెన్సు ద్వారా లేక మరే ఇతర వర్చువల్ మార్గంలో నిర్వహించబోమని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అయోధ్యకు విచ్చేసి రామాలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మార్చి నెలలోనే ప్రారంభం కావలసిన భూమి పూజా కార్యక్రమం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా నిరవధికంగా నిలిపివేయబడింది.....

శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో వచ్చే నెల 5న శ్రీ రామ మందిర నిర్మాణ భూమి పూజకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పవిత్ర నదులు కిృష్ణ గోదావరి ఇతర నదుల నీరు పంపించనున్నారు. దీనిలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో సేకరించిన మట్టి, కిృష్ణ గోదావరి ఇతర నదుల జలాలను RSS పరివార్ సంస్థలు కార్యకర్తలు స్థానిక ఆలయాలలో పూజలు నిర్వహించి అయోధ్యకు పంపిస్తున్నారు...

అనువాదకులు: వెంకటేష్ మద్దికేర
మూలము: Opindia
« PREV
NEXT »