వేసవి దుక్కులు, సత్ఫలితాలు - Vyavasayam, Vesavi Dukki

పైర్లలో తలెత్తే చీడపీడల సమస్యను 'తగ్గించేందుకు వేసవి దుక్కులు తోడ్పడతాయని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

రచీలో సాగు చేసిన వరి పైరు దుబ్బులను నేలమట్టానికి కోయాలి. ఇప్పుడు కురిసే జల్లులను సద్విని యోగం చేసుకోని లోతు దుక్కులు దున్నడం మంచిది. వరి సాగు చేసిన మూగాణుల్లో మొగిపురుగు పొడతేగులుకు కారణమయ్యే పురుగుల కోశస్థ దశలు లోతు దుక్కివల్ల నాశనమవుతాయి.

మొక్కజొన్నను ఆశించే మొగిపురుగు, ఎండు తెగులు, పత్తిలో వచ్చే హీలియోథిస్ పురుగు, గులాబీరంగు, కాయతొతిచే పురుగు, సొయాచిక్కుడుకు సోకె పొగాకు లద్దెపురుగు, ఆకుముడత పురుగుల కోశస్ట దశలు లోతు దుక్కి వల్ల బయటపడి ఎండ వేడిమికి నశిస్తాయి. వేసవి లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతురది, తద్వారా నీటి లభ్యత, పోషక పదారాల అందుబాటు పెరుగుతుంది.

పేసవి దుక్కుల తర్వాత సాగుచేసే ఖరీఫ్ పైర్లపై పురుగుల జెడద గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలో లేలింది.

గమనిక:
పైనుదహరించినవి, వ్యవసాయ సూచనలు,సలహాలు మాత్రమే. మరింత సమాచారం కోసం మీ దగ్గరలోని ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి !

మూలము: తెలుగు భారత్ అంతర్జాల వేదిక

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top