నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

18, జులై 2020, శనివారం

వేప ఆధారిత వ్యవసాయం, రైతుకు ఎంతో లాభదాయకం - Vepa Aadharita Vyavasayam

ప్రస్తుత ఆధునిక యుగంలో విచక్షణ రహితంగా క్రిమిసంహరక మందులను వాడటం పల్ల ఏర్పడుతున్న దృష్పరిణానూలును ఆరికట్టేందుకు వేప సంబంధిత రసాయనాల వాడకంతో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చను.

వేపాకులు, గింజలు, వేపనూనె, వేపగింజల కషాయం, వేప పిండి, తదితర పదార్ధథాలు చీడపీడలనివారణకు ఎరువుగానూ ఉపయోగపడతాయి. వేప పెండిలో 2శాతం సత్రజని, ఒక శాతం భాస్వరం, 14 శాతం పొటాష్, పోషకాలుంటాయి.

నేలరాలిన పేపపండ్లను సేకరించి, గంజల్నీ వేరు చేసి, ఎండబెట్టి నిల్వ చేసుకొని, కషాయం తీసి తర్వాత పైర్లవైవాడుకోవచ్చు. శుద్ధిచేసిన వేపనూనె బూజాలేని వేపపిండిని సస్యరక్షణలో వాడాలి. నూనెలో ఉన్న వేపపిండి బాగా పనిచేస్తుంది.

వేప పదార్థాల వాడకం-ప్రయోజనాలు 
వేప పిండి: దీనివాడకంవల్ల వేరుపురుగు అదుపులో ఉంటుంది. 150-200 కిలోల వేవ పిండి ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండంతాలిచే పురుగు, ఉల్లికోడు రావడంలేదని పరిశీలనలో తేలింది, వేపమందు చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు ఆకలితో శుష్కించి చనిపోతాయి. వేప మందులు వికర్షకాలుగా షనిచేస్తాయి. లార్యా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది. పురుగు సంతతి పెరగదు. మేలుచేసే సహజక్రిములకు, పరాన్నజీవులు వేప మందులు ఎలాంటి హానిచేయవు. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లాలి.
వేప నూనె
వేప నూనె
వేపగింజల కషాయం: మంచి వేపకాయలను సేకరించి, కొయలపై పొట్టుతీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి. 10 కిలోల వేప గింజలను నలగగొట్టి లేదాగ్రయిండర్లో రుబ్బి 12 గంటల సేపు నానబెట్టి వస్త్రంతో వడకట్టి 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారి చేయాలి.

వేపమానె నీటిలో కరగాలంటే.: వేపనూనె నేరుగా నీటిలో కరగదు. లీటరు నీటికి 1గ్రాము సర్ఫును కలిపి గిలకొడితే కరిగి నురుగు వస్తుంది, అప్పుడు వేప నూనె కలిపితే బాగా కలిసిపోతుంది.. సబ్బుపొడి కలపకుండా వేపనూనెను నేరుగా నీటిలో కలిపి పైరుపై చల్లితే పైరు మాడిపోతుంది.


« PREV
NEXT »