పాకిస్థాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ కు కాకపోతే ఎక్కడికెళతారు? – VHP

స్లామాబాద్‌లో శ్రీ కృష్ణ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, హిందువుల పట్ల చూపుతున్న హింసాత్మక ద్వేషం, పాకిస్తాన్‌లో హిందువుల దయనీయ దుస్థితి మరియు హింసను విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పత్రికా సమావేశంలో వివరించింది. 

విహెచ్‌పి కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాకిస్తాన్‌లో ఆలయ నిర్మాణం రాజ్యాంగ విరుద్ధమని, అది షరియత్ కు వ్యతిరేకమని పాకిస్తాన్ మాజీ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చినప్పుడు, స్పష్టంగా పాకిస్తాన్‌లో హిందూ సమాజం మనుగడ సాగించే అవకాశాలు సహజంగానే తొలగిపోతాయని అన్నారు. , మరియు మాజీ న్యాయమూర్తి యొక్క ఈ వ్రాత పూర్వక ప్రకటన భారత్‌లోని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ను సమర్ధించినట్లే అవుతుంది అని పేర్కొన్నారు.

కర్ణావతి (అహ్మదాబాద్) లో జరిగిన ఉత్తర గుజరాత్ ప్రాంత (ప్రావిన్స్) సమావేశం ముగింపు సమావేశంలో ప్రసంగించిన ఆయన, పాకిస్థాన్ లోని 5 సంవత్సరాల పిల్లల నుండి ముల్లా-మౌల్వీల వరకు, దేవాలయం నిర్మిస్తే హిందువులను చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. హిందూ బాలికలను కిడ్నాప్ చేయడం, హిందూ అబ్బాయిలకు బలవంతంగా సున్తీ చేయడం, హిందువులను బహిరంగంగా అవమానించడం పాకిస్తాన్లో నిత్య కృత్యాలు. ఈ పరిస్థితులలో ఆ బాధితులు వారి గౌరవం, జీవితం మరియు ధర్మం యొక్క రక్షణ కోసం భారత్ కు రాకపోతే ఎక్కడికి వెళతారు?

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకించిన వారు అణగారిన హిందువులతో పాటు భారతదేశానికి ఇస్లామిక్ అణచివేతదారులను కూడా పిలవాలనుకుంటున్నారా అని డాక్టర్ జైన్ అడిగారు. బాధితురాలైన గ్రంథి కుమార్తెతో పాటు ఆమెను అపహరించి బలాత్కరించిన రేపిస్టులను కూడా భారత్ కు పిలవాలని వారు అనుకుంటున్నారా? సిఎఎ ను వ్యతిరేకించడం అంటే నిజానికి మానవత్వాన్ని వ్యతిరేకించడమే అని డాక్టర్ జైన్ అన్నారు.

అహ్మదాబాద్‌లోని డాక్టర్ వానిక్కర్ భవన్‌లో జరిగిన ఉత్తర-గుజరాత్ ప్రాంత సమావేశంలో, ప్రాంతంలోని 750 ప్రదేశాలలో 3 వేల మంది కార్యకర్తలు ఆహారం, ముసుగులు, కాదా (ఆయుర్వేద కషాయాలు) మొదలైనవి పంపిణీ చేసినట్లు తెలిసింది, దీనివల్ల 1.25 లక్షల మందికి పైగా ప్రయోజనం పొందారు. . కార్యకర్తలందరూ ఇప్పుడు ఉత్తర గుజరాత్‌లోని అన్ని బ్లాకుల్లో వీహెచ్‌పీ కమిటీలను ఏర్పాటు చేస్తామని, రక్షాబంధన్‌ సందర్భంగా రక్షా-సూత్రాలను అన్ని చోట్ల కరోనా యోధులకు పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశానికి విహెచ్‌పి జోనల్ ప్రెసిడెంట్ అడ్వకేట్ దిలీప్ భాయ్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆఫీసు బేరర్లు అశోక్ భాయ్ రావల్, రాజు భాయ్ వాసవ, గోపాల్ భాయ్, అశ్విన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

__విశ్వ హిందూ పరిషద్ - VHP - ప్రెస్ నోట్
Source : Organiser - విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top