ప్రజల కోసం శివారు గ్రామంలో వెదురు వంతెన నిర్మించిన సేవాభారతి కార్యకర్తలు - RSS Seva

గ్రామస్థుల సమస్యను తీర్చేందుకు సేవాభారతి కార్యకర్తలు వంతెన నిర్మించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని అరప్పుజలం పంచాయితీలో మూలమట్టం అనే గ్రామం ఉంది.  ఇక్కడి గ్రామస్తులు ప్రతి ఏడాది విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో గ్రామ శివారు ప్రాంతంలో ఉండే నివాసితులకు తాము ఉన్న చోటునుండి  బయటకి రావడానికి నడక మార్గం ఉండదు. దీంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లలకు నడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల కోసం కూడా బయటికి వచ్చే పరిస్థితులు లేవు.

ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా మూలమట్టం శివారు ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ ప్రాంతంగా ఉండే ఈ గ్రామంలో కొండలు గుట్టలపై నడవడం చాలా ఇబ్బందికరం. గుట్టపై నడిచేటప్పుడు జారిపడే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి  పరిస్థితులు దయనీయంగా మారాయి.

ఎన్నో ఏళ్లుగా ఏర్పడుతున్న ఈ ఇబ్బందిని గుర్తించిన సేవాభారతి కార్యకర్తలు, అక్కడ ఒక వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సేవాభారతికి చెందిన  బృందం మూలమట్టం గ్రామాన్ని సందర్శించి తాత్కాలిక వెదురు వంతెన నిర్మించడానికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వెదురు వంతెన నిర్మించారు. దీంతో ఇప్పుడు శివారులో ఉన్న ప్రజలు సమీప పట్టణానికి చేరుకోవడానికి ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతోంది.

ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడుతూ కనీసం నిత్యావసరాల కూడా సమీప పట్టణాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో సేవా భారతి ఆధ్వర్యంలో వంతెన నిర్మించడం పట్ల గ్రామ శివారు ప్రాంత వాసులు హర్షాన్ని వ్యక్తం చేశారు.  సేవభారతి కార్యకర్తలు చేసిన సేవను మూలమట్టం ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అభినందించారు.

మూలము: ఆర్గనైజర్ - విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top