అయోధ్య రామ్ మందిరాన్ని పడగొట్టడానికి హింసను ప్రేరేపిస్తుంన్నాడన్న అభియోగంతో మౌలానా సాజిద్ రషీద్‌పై ఫిర్యాదు - Complaint filed against Maulana Sajid Rashid for inciting Muslims to demolish Ram Mandir at Ayodhya

హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు మరియు అయోధ్యలో నిర్మించాల్సిన రామ మందిరాన్ని పడగొడతామని బెదిరించినందుకు గాను ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇస్లామిక్ మతాధికారి మౌలానా సాజిద్ రషీదిపై ఫిర్యాదు చేశారు.

బిజెపి నాయకుడు తాజిందర్ పాల్ బగ్గా ఇచ్చిన ఫిర్యాదులో, ఇస్లామిక్ మతాధికారి మౌలానా రషీద్‌పై మత విద్వేషాలు, హింసను మరియు అల్లర్లను రేకెత్తిస్తున్నందుకు బిజెపి నాయకుడు తాజిందర్ పాల్ బగ్గా గురువారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కోర్టు ధిక్కారణ అని ఇస్లామిక్ మతాధికారిపై ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశారు.
Image Source: Tajinder Bagga
Image Source: Tajinder Bagga
మతపరమైన అల్లర్లు మరియు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో సమాజం యొక్క శాంతి మరియు సామరస్యాన్ని భంగపరిచే మత విద్వేషాలను మరియు ప్రతికూల మత భావాలను ప్రేరేపించడానికి ప్రయత్నించడం ద్వారా సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టలను అతిక్రమిస్తూన్నాడని అందులో పేర్కొన్నాడు.

"భారత సుప్రీంకోర్టు యొక్క 5-న్యాయమూర్తుల బెంచ్ నిర్ణయాన్ని అణగదొక్కడానికి తాను ప్రయత్నిస్తున్నానని సాజిద్ రషీది చేసిన ప్రకటన నుండి స్పష్టంగా తెలుస్తుంది, అదే సమయంలో అయోధ్యలోని ఆలయ నిర్మాణానికి నష్టం కలిగించడానికి హింసను ప్రేరేపిస్తాన్నాడని ”అని ఫిర్యాదులో పేర్కొంది.

భారతీయ శిక్షాస్మృతిలోని 153 ఎ, 153 బి, 295 ఎ, 298, 504, 505 సెక్షన్ల కింద ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశారు.

మూలము: Opindia
అనువాదము: తెలుగు భారత్ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top