ఉత్తరప్రదేశ్: మతం మారడానికి, వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు హిందూ దళిత అమ్మాయిని, అత్యాచారం ఆపై హత్య చేసిన మొహద్ దిల్షాద్ - Dalit girl, rapes and kills when she refuses to change religion and marry him

ఉత్తరప్రదేశ్: మతం మార్చడానికి, వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు హిందూ దళిత అమ్మాయి, అత్యాచారం ఆపై హత్య చేసిన మొహద్ దిల్షాద్ - Dalit girl, rapes and kills when she refuses to change religion and marry him
ఖింపూర్ ఖేరిలో 18 ఏళ్ల దళిత బాలికపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఒక మొహద్ దిల్షాద్‌ను అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగిందని లఖింపూర్ ఖేరి ఎస్‌ఎస్‌పి సతేందర్ కుమార్ తెలిపారు. నిందితుడు ఈ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

"నిందితుల వాంగ్మూలంమే కాకుండా, వేలిముద్రలు, రక్తపు మరకలు, నేరాన్ని ధృవీకరించిన సిసిటివి ఫుటేజ్ వంటి శాస్త్రీయ ఆధారాల కూడా బలంగా ఉన్నాయి. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు, ”అని ఎస్.ఎస్.పి. తెలిపారు.

ఎబిపి న్యూస్ జర్నలిస్ట్ నివేదిక ప్రకారం, టైలర్ షాపులో పనిచేసిన నిందితుడు మొహద్ దిల్షాద్, 18 ఏళ్ల దళిత హిందూ బాలికతో స్నేహం చేశాడు.  అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న తరువాత, దిల్షాద్ అమ్మాయిని తన మతాన్ని మార్చుకోవాలని, అతనిని వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు.

బాలిక నిరాకరించడంతో, దిల్షాద్ ఆమెను కొట్టాడు, దారుణంగా అత్యాచారం చేసి పదునైన ఆయుధంతో హత్య చేశాడు, తరువాత ఆమె ప్రాణంలేని శరీరాన్ని ముళ్లపొదల్లో పడేసి పారిపోయాడు.

Source: Opindia

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top