నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, August 10, 2020

ముస్లిం పర్సనల్ బోర్డ్ పై కేంద్రానికి ఎస్సీ సంఘం ఫిర్యాదు - Dalit organisation lodges a complaint with MHA seeking an FIR against AIMPLB for intimidating and hurting the faith of Hindu Dalits

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా  బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న దళిత పాజిటివ్ మూమెంట్ సంస్థ న్యాయమంత్రిత్వ శాఖ, హోమ్ శాఖకు  ఫిర్యాదు చేసింది.

ఆగస్టు 5న అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న సమయంలో… మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ, హిందువులను రెచ్చగొట్టే విధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ కి నిరసనగా దళిత పాజిటివ్ మూవ్ మెంట్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ

రామమందిర నిర్మాణం పై, భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకుండా దిక్కరించే రీతిలో వ్యవహరిస్తున్న ముస్లిం సంస్థ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అలాగే దళిత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎస్సీ/ ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు..

సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ సున్నితమైన అంశాన్ని అనుచిత వ్యాఖ్యల ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.   రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరచడానికి, దేశంలో రాజకీయ సంక్షోభం సృష్టించడానికి ఇస్లామిక్ సంస్థ పెద్ద కుట్ర చేస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దళిత పాజిటివ్ మూవ్ మెంట్ సంస్థ కన్వీనర్ రవి మాట్లాడుతూ “రామమందిర భూమి పూజ సమయంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని అన్నారు. టర్కీ లో ప్రభుత్వమే చర్చ్ ను మసీదుగా మార్చిన వైనాన్ని ప్రస్తావిస్తూ రామమందిరాన్ని కూడా అలాగే చేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.. ఇటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, సంస్థకు అందుతున్న నిధులు పై కూడా దర్యాప్తు చేయాలని కోరారు.

రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా, తీర్పుకు వ్యతిరేకంగా వీరు వ్యవహరించారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు తీర్పును దిక్కరించారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని ముందస్తుగానే వారి కదలికల పై దృష్టి సారించాలని హోం మంత్రిత్వ శాఖ కోరినట్టు తెలిపారు..

మూలము: OpIndia - విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »