ఉత్తరప్రదేశ్: ఫేస్‌బుక్‌లో మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముస్లిం యువకులను అరెస్టు చేయాలని హిందువులు డిమాండ్

వివిధ హిందు సంస్థలకు చెందిన కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరి జిల్లాలో వీధుల్లోకి వచ్చారు, అయోధ్య రామ్ మందిర్ భూమి పూజన్ రోజున ఫేస్‌బుక్‌లో మతపరంగారెచ్చగొడుతూ హిందూమతాన్ని అవమానపరుస్తూ పోస్టులు పెట్టినందుకు ముస్లిం యువకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందుకు నిరసన తెలుపుతూ నిరసనకారులు ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్-బరేలీ NH 370A,  లఖింపూర్ ఖేరి లోని మొహమ్మది పట్టణంలో రాకపోకలను అడ్డుకున్నారు.

మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ షాదాబ్ మరియు మరో నలుగురు అయోధ్య రామ్ మందిర్ భూమి పూజన్ రోజున ఫేస్బుక్లో హిందూ మత వ్యతిరేక పోస్ట్ రాసినందుకు గాను పోలీసుల వారిని అదుపులోకి తీసుకోగా వారిలో కొందరు తప్పించుకున్నాడు.

నిరసనకారులను శాంతింపజేయడానికి ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్, ఎస్‌డిఎం స్వాతి శుక్లా, సిఐ ప్రదీప్ యాదవ్ ఎన్‌హెచ్ 370 ఎకు చేరుకున్నారు. పరిస్థితిని నియంత్రించడానికి అదనపు పోలీసు బలగాలను మొహమ్మది పట్టణంలో మోహరించారు.

ముజఫర్ నగర్ మునిసిపల్ పరిధిలో ఉన్న బజార్ గంజ్ పట్టణ నివాసి సాగర్ కపూర్, మహమ్మద్ ఫయాజ్ మన్సూరి కుమారుడు బన్నే పై తన ఫేస్ బుక్ పేజీలో మతపరంగా హిందూ మతానికి వెతిరేకంగా పోస్ట్ లను పోస్ట్ లు పెట్టినందుకు గాను, ఆగస్టు 5న ఫిర్యాదు చేశారు.

వీరిలో మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ షాదాబ్, మరో ముగ్గురు-నలుగురు కూడా బన్నేకు మద్దతు పోస్టులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ ఏదో విధంగా నిందితులు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోగలిగారు.

మూలము: Opindia
అనువాదము: తెలుగు భారత్

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top