తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం, దర్శనాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి - Vaishno Devi Temple opened after 5 months

తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం, దర్శనాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి - Vaishno Devi Temple opened after 5 months
మ్మూలోని వైష్ణో దేవాలయం దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. కరోనా ప్రబలుతుండటంతో మార్చి 18న ఆలయాన్ని మూసివేశారు.

కాగా, ఆదివారం నుంచి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలతో భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి వారంలో 2000 మందికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో జమ్మూ కశ్మీర్‌ నుంచి 1900 మంది, ఇతర ప్రాంతాల నుంచి కేవలం 100 మందికే అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దర్శనాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేశారు.
‘ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందడుగు వేసింది. భక్తులు వారి ఆరోగ్యంతోపాటు ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విధించిన నియమాలు పాటించాలి’ అని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈఓ రమేష్‌కుమార్‌ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలిపారు. రెడ్‌ జోన్‌ నుంచి వచ్చేవారు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకొని, నెగెటివ్‌ పత్రాలను అందించాల్సిందిగా స్పష్టం చేశారు. యాత్రికులకు మాస్కులు తప్పనిసరి అని, యాత్రకు వచ్చేముందు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందిగా సీఈఓ కోరారు.

__విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top