నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

23, సెప్టెంబర్ 2020, బుధవారం

బాంగ్లాదేశ్: తన కోరిక తీర్చిలేదని 14 ఏళ్ల హిందూ బాలికను దారుణంగా పొడిచి చంపిన 20 ఏళ్ల మిజానూర్ రెహ్మాన్ - 14-year-old Hindu girl killed by 20-year-old Muslim man for refusing his grooming advances

బాంగ్లాదేశ్: తన కోరిక తీర్చిలేదని 14 ఏళ్ల హిందూ బాలికను దారుణంగా పొడిచి చంపిన 20 ఏళ్ల మిజానూర్ రెహ్మాన్ - 14-year-old Hindu girl killed by 20-year-old Muslim man for refusing his grooming advances

నతో సెక్స్ కు నిరరిస్తోన్నదన్న అక్కసుతో పదవ తరగతిలో చదువుతున్న 14 ఏళ్ల హిందూ మైనర్ బాలిక నీలా రాయ్ (14)ను బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు.

మీడియా నివేదికల ప్రకారం, మణిక్‌గంజ్‌కు చెందిన నారాయణ్ రాయ్ కుమార్తె నీలా రాయ్ (14) ను ఆమె సోదరుడు అలోక్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిందితుడు మిజానూర్ రెహ్మాన్ (20) వారిని ఆపారు.
హిందూ మైనర్ బాలిక నీలా రాయ్ (14) చిత్రం

నీలా రాయ్ సోదరుడు అలోక్ రాయ్ మాట్లాడుతూ "ఆదివారం రాత్రి, నీలా శ్వాస సమస్యతో బాధపడతోందని, ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతున్నాను. మేము ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, మిజాన్ మా రిక్షాను ఆపి, రెండు కత్తులతో బెదిరించి, నా సోదరిని బందీగా తీసుకున్నాడు. మిజాన్ నా సోదరిని చీకటి సందు వద్దకు తీసుకెళ్ళి, ఆమెను విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయాడు, ”అని అలోక్ చెప్పాడు.

అతని సోదరి అరుపులు విన్న అలోక్ మరియు స్థానికులు తీవ్రంగా గాయపడిన నీలాను ఎనామ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

నివేదికల ప్రకారం హత్య చేసిన నిందితుడు అదే ప్రాంతానికి చెందిన మిజానూర్ రెహ్మాన్ చౌదరి,  ఆమెను చాలా కాలంగా వేధిస్తున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. అతను మైనర్ అమ్మాయిని సెక్స్ కోసం పలుమార్లు వేధించాడని , కాని నీలా అతన్ని పలు సందర్భాల్లో తిరస్కరించింది. దీనికి సంబంధించి హత్య కేసు నమోదైందని సావర్ మోడల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పావెల్ మొల్లా తెలిపారు.

" ఈ పాఠశాల విద్యార్థినిని కనీసం ఐదు నుండి ఆరు సార్లు దారుణంగా పొడిచి చంపాడు. ఇది స్పష్టంగా పగతో చేసిన దాడి అని, కేసు ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ”అని సావర్ మోడల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (ఇన్వెస్టిగేషన్) సైఫుల్ ఇస్లాం అన్నారు.
హత్య చేయబడ్డ నీలా రాయ్ పాఠ్యపుస్తకాల ముందు దుక్ఖిస్తున్న ఆమె తల్లి యొక్క హృదయ విదారక వీడియోను మానవ హక్కుల కార్యకర్త పంచుకున్నారు -

Source: HP

« PREV
NEXT »