విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు - Vidya Bharati Competitions on various topics for students

0
విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు - Vidya Bharati Competitions on various topics under for students
విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి.

మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు.

మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించబడు ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా ఐదువేల రూపాయలు, మూడో బహుమతిగా మూడు వేల రూపాయలు మరియు వెయ్యి రూపాయల చొప్పున పది ప్రత్యేక బహుమతులు అందచేయబడతాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.
మొదటి కేటగిరీ : 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2 నిమిషాల వకృత్వం, 300 పదాలతో వ్యాస రచన, ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం, పోస్టర్ పెయింటింగ్ మరియు మీమ్స్ మేకింగ్ ఈ ఐదు విషయాలలో పోటీలు కలవు. పోటీదారులు వీటిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవచ్చు.

రెండవ కేటగిరీ : యూజీ మరియు పీజీ విద్యార్థులకు షార్ట్ ఫిలిం మేకింగ్, హ్యాండ్ మేడ్ పోస్టర్, డిజిటల్ పోస్టర్, 8 ట్వీట్స్ థ్రెడ్ మరియు మీమ్స్ మేకింగ్ లలో పోటీలు వుంటాయి. వీటిలో ఏదో ఒక అంశాన్ని పోటీదారులు ఎంపిక చేసుకోవచ్చు.

మూడవ కేటగిరీ : యూజీ మరియు పీజీ విద్యార్థులకు నిర్దేశించిన ఏదో ఒక అంశంలో ఇతరులెవరైనా కూడా పాల్గొనవచ్చు.

పై అంశాలలో పాల్గొనేందుకు 4 విషయాలు (అంటే థీమ్స్) ఉంటాయి. వీటిలో ఏదో ఒక విషయం ఆధారంగా పోటీలో పాల్గొనవచ్చు.

నాలుగు థీమ్స్ ఏంటంటే:
  • 1) Bharath centric education - అంటే భారతీయ ఆధారిత విద్య
  • 2) Holistic Education - అంటే సమగ్ర విద్య
  • 3) Knowledge based society - అంటే జ్ఞానాత్మక సమాజం
  • 4) Quality Education - అంటే గుణాత్మక విద్య
ఈ నాలుగు అంశాలలో ఒకదాన్ని ఎంచుకుని పోటీలో పాల్గొనవచ్చు.

పోటీలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ MyNEP.in అనే వెబ్ సైట్ లో చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆఖరి తేదీ 24 సెప్టెంబర్ 2020. పోటీలు 25 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2020 వరకు జరుగుతాయి. విజేతల వివరాలు 5 అక్టోబర్ 2020 న తెలియచేయబడతాయి.

రిజిస్ట్రేషన్ MyNEP.in అనే వెబ్ సైట్ లో చేసుకోవాలి.
ఈ పోటీల తాలూకూ e – poster ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ శ్రీ హేమచంద్రా రెడ్డి, IAS గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు తమ వీడియో సందేశాన్ని కూడా పంపారు.

వీడియో కోసం ఈ క్రింది లింక్ నొక్కండి :
https://drive.google.com/file/d/1hW_cg6DFeTuXykx9mdBu8zBHh7XvutWk/view?usp=sharing

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top