సీఎం ఇల్లు ముట్టడించిన భజరంగదళ్

0
పీలోని ఆలయాలపై దాడులకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఏపీ సీఎం జగన్‌ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. 

సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి 300 మంది పోలీసులు మోహరించారు. భజరంగ్‌ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. 

ఉద్రిక్తతల మధ్య పోలీసులు భజరంగ్‌ దళ్‌ నేతలను అరెస్టుచేసి వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా భజరంగ్‌ దళ్‌ నేతలు మాట్లాడుతూ… హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొడాలి నానిని బర్తరఫ్‌ చేయకపోతే ఆయన మాటలను సీఎం వ్యాఖ్యలుగా భావిస్తామని స్పష్టం చేశారు.

Source: విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top