నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

24, సెప్టెంబర్ 2020, గురువారం

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు: అగ్రరాజ్య యుద్ధ మండలం - Superpower or Balkanized WarZone

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు: అగ్రరాజ్య యుద్ధ మండలం - Superpower or Balkanized WarZone
అగ్రరాజ్యం లేదా బాల్కనీకృత యుద్ధ మండలం
నాగరకత అనేది మనకొక అస్తిత్వాన్ని కల్పిస్తుంది. 'మనం' ఎవరమనే భావానికి అది నిశ్చితమైన భావననందిస్తుంది. మనలో గాఢమైన మానసికానుబంధాన్ని సమకూరుస్తుంది. ఈ బంధం లేకుండా, జాతి మనుగడ అసాధ్యం. అందువల్ల ఒక నాగరకతను విచ్ఛిన్నం చేయడం అంటే వ్యక్తి వెన్నెముకను విరగ్గొట్టడం లాంటిదే. విచ్చిన్నమైన నాగరకత, బాల్కనీకృత ప్రాంతాలు, అంధకారంలో కూరుకు పోతాయి.

     భారతీయ నాగరకత, ఆ విధంగా విచ్చిన్నమవుతుందా! విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులేవి? అవి అంతర్గతమైనవా? బాహ్యమైనవా లేదా రెండునా వాటి మూలాలు ఎక్కడ? అవి ఎలా పరిణమిస్తాయి? వంటి ప్రశ్నలకు ఈ గ్రంథం సమాధానం చెబుతుంది. ద్రావిడ దళిత అస్తిత్వాలకు ప్రత్యేకంగా చర్చిస్తూ వాటిని ఉపయోగించుకోవడంలో పాశ్చాత్య దేశాల పాత్రను వివరిస్తుంది.

       ఆర్థికవృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి భారతీయ అభికేంద్ర బలాలు జాతిని సంఘటితం చేస్తాయి. అలాంటి సానుకూల శక్తుల గురించే ఎక్కువగా రాస్తున్నారు. అంతర్గత, బాహ్య అపకేంద్ర శక్తుల గురించి తక్కువగా అధ్యయనాలు జరుగుతున్నాయి. అంతర్గత శక్తులలో మతవాదంతోపాటు వివిధ రకాల సామాజిక - ఆర్థిక అసమానతలు కూడా ఉంటాయి. భారతీయుల మధ్య చీలిక తెచ్చే బాహ్య శక్తులు ఎక్కువ సంక్లిష్టమైనవి.

భారతదేశంలో విద్రోహశక్తులను రేపుతున్నది కేవలం పాకిస్థాన్, మావోయిస్టులతో సంబంధాలున్న చైనా, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే యూరప్, ఉత్తర అమెరికా చర్చ్లు మాత్రమే కాదు. ఇవన్నీ కలిసే రేపుతున్నాయి. అపకేంద్ర శక్తులు, సంక్లిష్టంగా పరస్పరం అల్లుకుపోయి ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని అకడమిక్ కేంద్రాలు భారతదేశంలోని సామాజిక రాజకీయ పరిస్థితుల మీద గట్టిగా ప్రభావం చూపుతున్నాయని ఈ గ్రంథం నిరూపిస్తుంది. ఈ కేంద్రాలు, భారతదేశంలోని అపకేంద్ర శక్తులకు తోడ్పాటునందించే రాజకీయ మేధావి వర్గం, మతవాదం, సామాజిక సంస్థలతో జత కలిశాయి.

బద్దలవడానికి భారతదేశంలో అంతర్నిహితంగా ఉన్న ధోరణులు:
సమస్యలన్నిటికీ బాహ్య శక్తులను నిందించడానికి ముందు, భారతదేశంలోని స్వీయ బలహీనతలతో పాటు శతాబ్దాలనాటి ధోరణులను గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఈ సమస్యపట్ల, నూతన ఆర్థిక వ్యవస్థ విజయాలను ఆనందిస్తున్న వారు అంతగా శ్రద్ధ వహించలేదు.

కఠినమైన వాస్తవాలలో కొన్ని కింది విధంగా ఉన్నాయి:
 • 🕃 ప్రపంచం మొత్తం మీద, భారతదేశంలోనే పేదవారు, పాఠశాలకు వెళ్లని పిలలు అత్యధికంగా ఉన్నారు. భారతదేశంలో నీటికొరత పెరిగిపోతూ ఉంది. దేశంలోని వివిధ వర్గాల మధ్య సంఘర్షణలు తలెత్తుతున్నాయి.
 • 🕃 సామాజిక అన్యాయాలున్నాయి. ఇవి, పాక్షికంగా చారిత్రకమైనవి, పాక్షికంగా ఆధునికమైనవి. వీటిలో కొన్నిటికి భారత సమాజంలోనే మూలాలుండగా మరికొన్నిటికి విదేశీ ప్రభావాలు కారణం.
 • 🕃 భారతదేశం సాధించిన ఆర్థిక విజయాలు, అట్టడుగు స్థాయి వారికి తగినంతగా అందడం లేదు. భారతీయులలో లక్షలాది మంది, సాంకేతిక విద్య ప్రాతిపదిక మీద మంచి మంచి ఉద్యోగాలు అనుభవిస్తూ ఉండగా అత్యధిక సంఖ్యాకులకు ప్రాథమిక విద్యకూడా అందడంలేదు. మధ్యతరగతి ప్రజలకు ఆవశ్యకమైన వ్యవసాయ, జల సదుపాయాల విషయంలో పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నాయి. భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఘోరంగా ఉంది.
 • 🕃 దేశంలోని అనేక రాష్ట్రాలు, గ్రామ మావోయిస్ట్ ఉగ్రవాదంతో బాధలనుభవిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచుగా ఇస్లామిక్ ఉగ్రవాద దాడులు, హిందూ- ముస్లిమ్ల మధ్య హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. ద్రావిడులు, దళితులు లేవదీసిన వేర్పాటువాడ ఉద్యమాలు దక్షిణాదిన హింసకు కారణమవుతున్నాయి.
 • 🕃 సైబర్ స్పేస్ సైతం భారతదేశాన్ని బలహీనపరుస్తూ ఉంది. సైబర్ గూఢచర్యల మీద ఇటీవల జరిపిన అధ్యయనం, భారతదేశాన్ని 'అత్యంత పీడితులరాజ్యం'గా ప్రకటించింది. భారతదేశంతో పాటు, పరిసర ప్రపంచంలోని సున్నితమైన రక్షణ వ్యవస్థలు, రాయబార కమ్యూనికేషన్లు చైనా గూఢచార ఏజెంట్లతో ఎక్కువగా రాజీధోరణిని అవలంబించాయి. చైనీయులు, ఆ విధంగా సంపాదించిన కీలకమైన సమాచారాన్ని, భారతదేశంలో ఖనిజసంపద సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో మావోయిస్టు తిరుగుబాటుదారులకు అందజేసి, మావోయిస్ట్ ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు.
 • 🕃 భారతదేశం చుట్టూ అస్థిరమైన, విప్లవధోరణులు గల దేశాలున్నాయి. భారతదేశంలోకి సీమాంతర ఉగ్రవాదం దిగుమతి అవుతూ ఉంది. భారత ప్రజాస్వామ్యంలో అత్యధిక సంఖ్యలో రాజకీయపార్టీలున్నాయి. ఫలితంగా సమాజంలో ఓటు బాంకులు, అభిప్రాయాలు భిన్నమవుతున్నాయి. అవకాశవాదం పెరిగిపోయింది. దూరదృష్టి తరిగిపోయింది.
బాహ్య శక్తులు
ఇతర శక్తులతో వ్యవహరించడంలో జాతిరాజ్యం తీవ్రంగా బలహీనపడినప్పుడు విదేశీదాడులకు అవకాశం ఏర్పడుతుంది. వలసరాజ్య స్థాపన, సాంస్కృతిక, మానసిక సామ్రాజ్యవాదంతో పాటు ఇతర అవాంఛిత జోక్యాలు కూడా వెల్లువెత్తుతాయి. భారతదేశ చరిత్రలో ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఉదాహరణకు, అనేకమంది భారతీయ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు మానవహక్కుల కేసులను ఉపయోగించడం.

   దురదృష్టకరంగా, భారతీయులను అనాగరకులుగా చిత్రించడానికి అట్రాసిటీ సాహిత్యాన్ని సంకలనం చేయడం ద్వారా తమను సమర్థించుకొంటూ ఆంగ్లేయులు స్వయంగా ఎన్నో క్రూర కర్మలకు పాల్పడ్డారు. భారతీయులకు నాగరకత నేర్పడానికి తామలాంటి చర్యలను రూపొందించామని వారు చెప్పుకున్నారు. 
ఉదాహరణకు...
 • ➣ భారతీయ తెగలలో కొన్నిటిని హతమార్చడానికి 1871లో నేర సంబంధమైన తెగల చట్టాన్ని చేసింది. ఈ తెగల జాబితాలోని ప్రతి సభ్యుడినీ పుట్టినప్పటి నుంచీ నేరస్థుడుగా భావించింది. తమ అడవులనూ ఆవాస స్థానాలనూ ధ్వంసం చేస్తున్న ఆంగ్లేయులపై పోరాటం చేస్తున్న తెగలను కూడా నేరస్థుల జాబితాలో చేర్చింది.
 • ➣ ఈ విధంగా ఆంగ్లేయుల చేతుల్లో హింసకు గురయిన వారిలో థగ్గులు కూడా ఉన్నారు.
 •  మహిళా హక్కులని అణగ తొక్కడంలో ఈ అట్రాసిటీ సాహిత్యం తనవంతు పాత్ర పోషించింది. వీణా ఓల్డన్ బర్గ్ 'డౌరీమర్డర్' స్థానిక సంస్కృతిని నిందిస్తూ ఆంగ్లేయులు ప్రోత్సహించిన అకృత్యాలను వివరిస్తుంది. సాధారణ పౌరుల హక్కులను తగ్గించడానికి వారు చట్టాలు చేశారు. ఏవో మెలికలు పెట్టిన తర్కం ద్వారా ఆంగ్లేయులు మహిళలకు సాంప్రదాయికంగా ఉన్న ఆస్తి హక్కులు లేకుండా చేసినప్పటి నుంచే వాస్తవానికి బలవంతపు వరకట్నాలు సర్వసాధారణంగా మారాయని ఈ గ్రంథం పేర్కొంటుంది.
 • ➣ జోక్యం చేసుకొని సమస్యలను 'పరిష్కరించే' నెపంతో ఆంగ్లేయులు జాతుల మధ్య సంఘర్షణలను రెచ్చగొట్టడానికి అట్రాసిటీ సాహిత్యాన్ని ఏ విధంగా ఉపయోగించారో చూపిన అనేకమంది విద్వాంసులలో నికోలస్డర్క్స్ ఒకరు భారతదేశంలో మరింత అధికారాన్ని సంపదనూ సంపాదించుకోడానికి ఈ జోక్య విధానం ఆంగ్లేయులకు తోడ్పడింది.
 • ➣ కార్మికులపై అత్యాచారాల నెపంతో ఆంగ్లేయుల పరిశ్రమల కంటె మెరుగయిన రీతిలో ఉన్న భారతీయ పరిశ్రమలను చట్ట వ్యతిరేకమని ప్రకటించారు. వీటిలో జాళి మిల్లులు, ఉక్కు తయారీ పరిశ్రమలూ ఉన్నాయి. ఈ పరిశ్రమలు తయారుచేసే వస్తువులను సరఫరా చేయడానికి ఆంగ్లేయులు, సొంత పారిశ్రామిక విప్లవం ప్రారంభించారు. ఆ విధంగా 1757-1812 మధ్యకాలంలో భారతదేశం నుంచి బ్రిటిన్ కు అందే లాభాల ప్రవాహం 500 మిలియన్ పౌండ్ల నుంచి బిలియన్ పౌండ్ల వరకు ఉండేదని బ్రిటిషు రచయిత విలియమ్ డిగ్నీ తెలిపారు. భారతదేశం నుంచి ఆంగ్లేయులు పొందిన లాభం ప్రస్తుత జి.డి.పి.లో అయిదు నుంచి ఆరు శాతానికి సమానంగా ఉండేదని అమియా బాగ్నీ జరిపిన ఇటీవలి సర్వేలో తేలింది (1984).
ఒక శతాబ్దం క్రితం రచించిన హింద్ స్వరాజ్ అనే మోనోగ్రాఫ్ లో గాంధీజీ బ్రిటిష్ సామ్రాజ్యం కోసం భారతీయులు ఎలా శ్రమిస్తున్నారో చర్చించారు. భారతీయులకు ఆంగ్లేయుల లక్ష్యాలు తెలియపోవడం వల్ల, తమను తాము దేశభక్తులుగా ఊహించుకున్నారు. వంద సంవత్సరాల తరువాత గాంధీజీ, వలసపాలనలో ఉన్న భారతీయులకు సంబంధించి మనం నిశితంగా సమీక్షించుకోవలసి ఉంటుందని ఈ విధంగా రాశారు.
 • ➣ ఆంగ్లేయులు భారతీయ సిపాయిలను ఉపయోగించుకున్న దానికంటే పాశ్చాత్య దేశాలిప్పుడు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయా? పాశ్చాత్యులు భారతదేశంలో కింది స్థాయిలో సమాచార సేకర్తలు మొదలుకొని, మధ్యస్థాయి విజ్ఞానవేత్తల నుండి ప్రపంచస్థాయి బహుమతి విజేతల వరకు విస్తారంగా వాడుకుంటున్నారు.
 • ➣ పాశ్చాత్య చర్చ్లకు పౌర సమాజానికీ ప్రభుత్వానికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
 • ➣ రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి 'అయిదో స్తంభం'గా మానవహక్కు 'పరిశ్రమ' పాత్ర?
 • ➣ ఫోర్డ్ ఫౌండేషన్, కార్నెగి ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, లూసె ఫౌండేషన్ ప్యూ ట్రస్ట్, టెంపుల్ టన్ ఫౌండేషన్ వంటి ప్రముఖ ఫౌండేషన్లు, యు.ఎస్ ప్రభుత్వానికీ బిలియనీర్లకూ ఏ విధంగా సహకరిస్తున్నాయి.
భారతీయ అపకేంద్ర శక్తులకు అంతర్జాతీయ సంబంధాలుండటమే కాకుండా స్వయంగా తమలో తాము పరస్పరం అల్లుకుపోయాయి. అలాంటప్పుడు, ప్రస్తుతం మైనారిటీ వర్గం, విశ్వవ్యాప్తమైన మెజారిటీలో అంతర్భాగంగా ఉన్న ఈ సమయంలో ఈ వర్గానికి సరయిన నిర్వచనం ఏమిటి? ముఖ్యంగా, దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ద్రావిడ, దళిత అస్తిత్వాల ఏర్పాటును పాశ్చాత్యశక్తులు పోషించిన పాత్రనూ ఈ గ్రంథం వెల్లడిస్తుంది.

రచన: రాజీవ్ మల్హోత్రా & అరవిందన్ నీలకందం 
గ్రంథ మూలము: Breaking India
« PREV
NEXT »