నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
జాతీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాతీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2020, గురువారం

హిందుత్వాన్ని, జాతీయతను దూరం చేయడమే.. ‘సెక్యులరిజం’! - Hindutvam Secularism

హిందుత్వాన్ని, జాతీయతను దూరం చేయడమే.. ‘సెక్యులరిజం’!

అధికారం కోసం కన్నతండ్రిని బందీని చేసి, ఆయనకు ప్రీతిపాత్రుడైన తన సొంత అన్నను నరికి - ఆ తలకాయను బహుమతిగా తండ్రికి పంపించిన ‘సెక్యులర్ మహానుభావుడు’ ఔరంగజేబు. 

మొఘల్ చక్రవర్తి అధికారం కోసం ప్రదర్శించిన అసహనం అంతా ఇంతా కాదు. అధికార వారసత్వం కోసం తన తండ్రి షాజహాన్ వృద్ధుడయ్యేవరకో, మరణించే వరకో వేచి చూడకుండా అతణ్ణి జైల్లో బంధించాడు. తనను బంధించి ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు కదా! అని షాజహాన్ ఎంతో చింతించేవాడు. తాను జైల్లో వుండి ఏం చేయాలి? అన్న ప్రశ్న షాజహాన్‌ను వేధించడంతో- అతని మనసులో ఏదో ఆలోచన స్ఫురించి ‘కనీసం 30 మంది ముస్లిం విద్యార్థులను తన వద్దకు పంపే ఏర్పాటు చేస్తే వారికి పవిత్ర ఖురాన్‌ను నేర్పిస్తానని’ తన కొడుకు, రాజు ఔరంగజేబుకు వర్తమానం పంపించాడు షాజహాన్. ఈ విషయంపై ఔరంగజేబు తన ఆస్థాన సభ్యుల ముందు చేసిన వ్యాఖ్యానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం కలిగింది కూడా!

‘ఆ వృద్ధుడు (షాజహాన్) అధికారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అతడేమీ చక్రవర్తి కాదు, కానీ 30మంది విద్యార్థులు కావాలట. ఖురాన్ బోధించే నెపంతో ఆ ముప్పై మంది విద్యార్థులపైన మళ్లీ ఆయనకు అధికారం వస్తుంది’ అంటాడు ఔరంగజేబు. అధికార దాహం ఎంత తీవ్రమైందో ప్రబోధించే ఘట్టం ఇది. సరిగ్గా ఆ ఔరంగజేబు అడుగుజాడల్లో నడిచే ఈ దేశ సెక్యులర్ గ్యాంగ్’ అదే పనిని కొనసాగిస్తోంది. అధికారం పొందడానికి పెట్టుకున్న అందమైన ముద్దుపేరు ‘సెక్యులరిజం’. ఎన్ని అవినీతి పనులు చేసినా, దేశాన్ని ఎంతలా దోచుకున్నా, ఫ్రజాస్వామ్యాన్ని తమ ఇళ్లముందు కావలి కుక్కలా కట్టేసుకున్నా చేతికి ‘సెక్యులరిజం’ అనే ‘పవిత్ర’ కంకణం ఉంటే చాలు.. వాళ్లు మహానుభావులే.

నిజానికి ‘సెక్యులరిజం’ శబ్దం ఐరోపా సమాజంలోని చారిత్రక, సామాజిక, మత విధానాలకు సంబంధించింది. అందుకే ఏ విదేశీయుడైనా భారతదేశానికి వస్తే ఫలానా పార్టీ సెక్యులర్, ఫలానా పార్టీ కమ్యునల్ అంటే అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఐరోపా దేశాల్లో సెక్యులర్ పదం వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. భాషాశాస్త్రంలో అర్థగ్రామ్యత, అర్థనిమ్నత, అర్థ గౌరవం లాంటి సూత్రాలున్నాయి. ఒక పదానికి ఓ కాలంలో ఉన్న అర్థం తదనంతర కాలంలో మారిపోయి వేరే అర్థం వస్తుంది. ఉదాహరణకు ‘చెంబు’ అనే పదానికి ఒకప్పుడు రాగితో చేసిన పాత్ర అని అర్ధం. కానీ పోనుపోను అన్ని లోహాలతో చేసిన నీళ్లు తాగే పాత్రకు ‘చెంబు’ అని అర్థం స్థిరపడింది. అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో పెద్ద నూనె డబ్బాలో నూనె ఖాళీ అయ్యాక, అందులో వేరే వస్తువులు నింపినా దాన్ని ‘నూనె డబ్బా’ అని పిలవడం చూస్తాం. సెక్యులరిజం యూరప్ దేశాల్లో ఓ మత చారిత్రక పరిణామాల నుండి పుట్టిన పదం. అది ఇపుడు మన దేశంలో వికృత రాజకీయ క్రీడకు వేదికైంది. అరుణ్ శౌరి లాంటి మేధావి దానిని ఓ టీవీ చర్చలో ‘సెక్యులరిజం అనే పదం భారత్‌లో ప్రాస్టిట్యూట్‌గా వాడుకున్నారు’ అన్నాడు.

యూరప్ సెక్యులరిజం చరిత్ర:
 • ➧ సెక్యులరిజం పదానికి యూరప్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీశ 5, 6 శతాబ్దాల నుండి 15, 16 శతాబ్దాల వరకు యూరప్ క్రైస్తవ మతాధిపతుల అధీనంలోని ‘చర్చ్’ అధీనంలో ఉండేది.
 • ➧ రాజ్యంపై ‘చర్చ్’కే సర్వాధికారాలు ఉండేవి. క్రీ.శ 4వ శతాబ్దికి చెందిన సెయింట్ ఆగస్టియన్‌ను ‘క్రైస్తవ మత రాజనీతి పిత’గా, సిద్ధాంత కర్తగా భావిస్తారు. ఆయన తన రచనలో చెప్పిన ‘ప్రతివారూ చర్చి అధీనంలో ఉండాలి, చర్చే ప్రజలకు సర్వాధికారి, క్రైస్తవుడు కానివాడు భూమిమీద ఉండకూడదు’- అన్న మాటలు నాటి చర్చి ఆధిపత్యం ఎంత ప్రబలంగా ఉండేదే నిరూపిస్తుంది. 
 • ➧ చర్చ్‌ల పాలనలో దురాగతాలు భరించలేక అనేక తిరుగుబాట్లు వచ్చాయి. 15, 16, 17 శతాబ్దాల్లో అనేకమంది తత్వవేత్తలు, రాజకీయ ఉద్యమకారులు క్రైస్తవ మత పాలన నుండి యూరప్ ఖండాన్ని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసారు. 
 • ➧ వాల్టేర్, రూసో, జాన్‌లాక్, థామస్ హబ్స్ వంటివారు అనేక రచనలు చేసారు. అందులో ముఖ్యంగా థామస్ హబ్స్ రాసిన ‘లెవియాథన్’ పుస్తకంలో సగం వరకూ ‘చర్చి అపరాధాలు’ ఉన్నట్టు చెప్తారు. 
 • ➧ ఆధునిక రాజనీతి శాస్త్రాల్లో మొదటి పుస్తకంగా యూరప్ వారు భావించే జాన్‌లాక్ రచన ‘ట్యూటటైజ్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్’ అనే పుస్తకమంతా ఆనాడు సాగించిన క్రైస్తవ మత దౌష్ట్యాలను ఖండించింది. 
 • ➧ చర్చి పాలనకు వ్యతిరేకంగా సెక్యులరిజం పదం ప్రయోగించబడింది. కానీ మన దేశంలో చర్చి పాలనను మళ్లీ తేవడానికి సెక్యులరిజం అనే పదం వినియోగించడం విడ్డూరం. 
హిందుత్వం:
 • ➧ మతానికి, ధర్మానికి స్పష్టమైన తేడా ఉంది. ‘హిందుత్వం’ మతం కాదు ధర్మం. మతానికి రాజకీయ ప్రయోజనం ఎక్కువ, ఆధ్యాత్మకత తక్కువ. తత్వ భాగానికి అందులో ప్రాముఖ్యం లేదు. కానీ ధర్మానికి జీవన విధానం, ప్రవర్తన చాలా ముఖ్యం. 
 • ➧ ధర్మం ప్రవర్తనపై ఆధారపడితే, మతం విశ్వాసం, అవిశ్వాసం మీద ఆధారపడుతుంది.
 • ➧ ధర్మంలో మనిషి జీవిస్తే, మతంలో అనుసరిస్తాడు. ధర్మానికి విస్తృతి ఎక్కువ. అది సముద్రం లాంటిది. ఎన్ని నదులొచ్చినా తనలో కలుపుకోగలదు సముద్రం. 
 • ➧ అందుకే హిందూ ధర్మంపై ఎన్ని మతాల దాడులు జరిగినా, వాటన్నిటినీ తనలో జీర్ణం చేసుకుంది. మతాల్లో అలౌకికత్వం ఎక్కువ. 
 • ➧ ఆనాడు పాశ్చాత్య దేశాల్లోని ఈ అనవసర అలౌకిక తత్వాలకు వ్యతిరేకంగా అక్కడి మేధావులు సెక్యులరిజం (లౌకికమైన, ఐహికమైన) అనే పద ప్రయోగం చేసారు.
దేశంలోకి సెక్యులరిజం:
మన దేశంలో మతం కింద రాజ్యపాలన ఎప్పుడూ జరగలేదు. కానీ ‘సెక్యులరిజం’ పదాన్ని మన దగ్గరకు దిగుమతి చేసుకున్న మేధావులు దాని చుట్టూ అనేక కథలను అల్లడం కోసమే మన చరిత్రను మొదట ధ్వంసం చేసారు.

హిందూ ధర్మాన్ని ‘మతం’గా దిగజార్చడానికి పాశ్చాత్యులు బాటలు వేస్తే భారతీయ సైద్ధాంతిక మేధావులు దానికి మరింతగా రంగులు అద్దారు. 

వెండిడోనిగర్, రామిల్లా థాపర్, ఎ.కె.రామానుజన్, జెస్సీలేఖికా వంటివారు రామాయణాన్ని, రాముడిని బండబూతులు తిడతారు. అది సాహిత్యం కాబట్టి ‘మేం విమర్శిస్తాం’ అంటారు. అదే సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మనం అడిగితే ‘అదొక మత గ్రంథం’ అంటూ దబాయిస్తారు. ఈ ద్వంద్వ వైఖరి గత యాభై ఏళ్లనుండి కొనసాగిస్తునే ఉన్నారు. ఇదంతా వాళ్ల దృష్టిలో సెక్యులరిజం!

బ్రిటిషుల ఏలుబడి నుంచి: 
 • 1916 తరువాత గాంధీజీ భారత రాజకీయాల్లోకి వచ్చాక ‘సెక్యులరిజం’ అనే పదం విచిత్ర రూపాన్ని పొందింది. ‘సర్వమత సమభావన’ అనే కొత్త అర్థం గాంధీజీ కల్పించాడు. 
 • హిందూ మహాసభ, ముస్లిం లీగ్ లాంటి సంస్థలను వాటి రాజకీయాలను అర్థం చేసుకున్న గాంధీజీ తాత్కాలిక ఉపశమనం కోసం ఈ కొత్త అర్థం సృష్టించాడు.
 •  నెహ్రూ కాలానికి వచ్చేసరికి మరో కొత్త అవతారంలో సెక్యులరిజం రూపుదాల్చింది. 
 • ఒక మతాన్ని సంతృప్తి పరచడమే సెక్యులరిజం అనే భావన నిర్మాణం కావడానికి మన స్వాతంత్రోద్యమంలోని ఓ పుటను మనం తెరిచి చూడాలి. 
 • 1942లో క్రిప్స్ రాయబారం పరిణామాల నేపథ్యంలో 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఇందులో బ్రిటిష్ ఇండియా-గవర్నర్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. 
 • నెహ్రూ, కృపలానీ, పటేల్, డా.సర్వేపల్లి, ఖాన్ అబ్దు గఫార్‌ఖాన్, టాండన్, డా. అంబేద్కర్, శ్రీనివాస అయ్యంగార్ వంటి ప్రముఖులు అందులో ఉన్నారు. 
 • సుమారు 1946 నుండి 1949 వరకు రాజ్యాంగ రచన మొదలైంది. ఈ మధ్యలో దేశవిభజన జరిగింది. రెండుదేశాలు మతాల ఆధారంగా విడిపోకూడదన్న పెద్దల ఆలోచనతో రాజ్యాంగంలో దేశ విభజనకు ముందే ‘మైనార్టీ’ అనే పదం సృష్టించబడింది. 
 • ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనార్టీలకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. అది కూడా దేశ విభజన జరగవద్దన్న సంకల్పంతో రాజ్యాంగవేత్తలు వాటిని చేర్చారు. 
 • అందులో కూడా భాష, జాతి, వంశం (తరం), సంతతి అనే నాలుగు అంశాలు మైనార్టీగా రాజ్యాంగ నిపుణులు చెప్తే నెహ్రూ అనంతర రాజకీయ, సిద్ధాంత వాదులంతా మైనార్టీ పదానికి క్రైస్తవం, ముస్లిం అనే పదాలను మాత్రమే తీసుకున్నారు. అదే క్రమంలో గత డెబ్బై ఏళ్లుగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి.
మైనార్టీలను సంతుష్టీకరణ చేయడమే ‘సెక్యులరిజం’:
ఇప్పుడు మైనార్టీలను సంతుష్టీకరణ చేయడమే ‘సెక్యులరిజం’ అన్నంతగా ఈ పదం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ‘మెజార్టీ’ ఆధారంగా మన దేశంలో రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లేవు. మెజార్టీ ప్రజలు ఎప్పుడూ పౌరులుగానే రాజ్యాంగబద్ధమైన జీవితంలో ఉండాలి. మైనార్టీలకు ఈ 25-30 ప్రకరణల వల్ల ప్రత్యేక అధికారం ఒకవైపు, భారత పౌరునిగా ప్రత్యేక అధికారం ఇంకోవైపు అనుభవించవచ్చు.

‘హిందువు’ కేవలం పౌరునిగా మాత్రమే ఈ దేశంలో తన జీవితం కొనసాగిస్తాడు. హిందువుల సంఖ్య ఎక్కువగా వుండడంతో ‘మెజార్టీ’ అని ముద్రవేసి నోరు మూయిస్తున్నారు. కానీ - రేపు హిందువుల సంఖ్య తగ్గిపోతే రాజ్యాంగపరంగా మెజార్టీ ప్రజల పరిస్థితి అగమ్యగోచరమే. దీని సూక్ష్మరూపం ఇపుడు మనం కాశ్మీర్‌లో చూడవచ్చు.
కాశ్మీరీ పండిట్లపై హింస
కాశ్మీరీ పండిట్లు పై దురాగతాలు:
లక్షలాది కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయనుండి తరిమివేయబడ్డారు. కాశ్మీర్ రాజ్యాంగంలో సెక్యులరిజం శబ్దానికి స్థానం లేదు. అక్కడ మైనార్టీలైన హిందువులకు విలువలేదు. అక్కడ మైనార్టీ-మెజార్టీ వాదం తలకిందులైంది.

ఇప్పుడక్కడ పాక్ ప్రేరిత, మత ప్రేరిత శక్తులు ప్రభుత్వాలకే సవాల్ విసురుతున్నాయి. మెజార్టీ మతం ఆధారంగా ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేనందునే రామకృష్ణ మిషన్ లాంటి హిందూ ధార్మిక సంస్థ ఒకప్పుడు కలకత్తా కోర్టులో తమను హిందూయేతర సంస్థగా గుర్తించమని పిటిషన్ వేసింది. ‘హైందవ ధర్మ శంఖారావం’ ప్రపంచ యవనికపై చేసిన స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ఇలా కోరడం మనల్ని విభ్రాంతుల్ని చేస్తుంది.

మతమార్పిడులు:
 • ⭄ ఆర్టికల్ 25 ప్రకారం మైనార్టీలకు మత ప్రచారం చేసుకునే హక్కు సంక్రమించింది. ఏ మత దేశంలో కూడా ఇలాంటి ప్రత్యేక విధానం లేదు. దీనివల్ల విస్తృత మత మార్పిడికి అవకాశం లభించింది. ఇది ఉపయోగించుకుని చర్చిలు తమ సామ్రాజ్య విస్తరణ చేస్తున్నాయి. 
 • ⭄ ఈ ఆర్టికల్ వల్లనే ఇటీవల నేరస్తుడిగా దేశం విడిచిపోయిన జకీర్ నాయక్ బహిరంగంగా మత మార్పిడి చేయగలిగాడు. 
 • ⭄ ఈ మతాంతీకరణల్లో ఆధ్యాత్మికత కన్నా రాజ్య విస్తరణ, తమ సంఖ్య పెంచుకోవడమే ప్రధానంగా కనిపిస్తుంది. 
 •  హిందూ ధర్మానికి సంబంధించిన ఏ మఠం, మందిరం వ్యవహారాల్లోనైనా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవచ్చు. 
 • ⭄ కర్నాటకలో ఎన్నోచోట్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ మైనార్టీ మత సంస్థల్లోగానీ, విద్యా సంస్థల్లో గానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. 
 • ⭄ వాళ్ల పాఠశాలల్లో వాళ్లకు ఇష్టం వచ్చిన విద్యను వాళ్లు అభ్యసించవచ్చు. మత గ్రంధాలు చదువుకోవచ్చు. 
హిందూ గ్రంథాలను అభ్యసించలేని హిందువు:
మరి హిందూ గ్రంథాలను వేటినీ ప్రత్యేక పాఠశాలల్లో చదవలేం. ప్రభుత్వ పాఠశాలల్లో అది సాధ్యపడదు. ఇంకెక్కడ హైందవ ప్రాచీనవిద్యను చదివేది? ఇదంతా సెక్యులరిజం అనే గొడుగు కిందనే జరుగుతుంది. సెక్యులరిజం అనే పదాన్ని మత ప్రమేయం లేని రాజ్యం నుండి, అర్థం నుండి దిగజార్చి కొన్ని మతాలను సంతుష్టీకరించి మరి కొన్ని మతాలను ముఖ్యంగా హిందూమతాన్ని విమర్శించాలనే ధోరణి ఈరోజు కొనసాగుతోంది. అంతెందుకు..? నిన్న మొన్నటి వరకు నేపాల్ హిందూ దేశం. మావోయిస్టు ఉద్యమాల వల్ల అక్కడి ప్రభుత్వాలు కూలిపోగా కొత్త రాజ్యాంగ రచన ప్రారంభం అవుతుందంటే ఇక్కడి వామపక్షాలు ఆ రాజ్యాంగం కూడా సెక్యులర్‌గా ఉండాలంటున్నారు. వీళ్లెవరూ మతతత్వ రాజ్యాలకు సుద్దులు చెప్పరు, చెప్పలేరు. ఇదీ వరస..!

బాబాసాహెబ్ అంబేద్కర్:
భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే పవిత్రగ్రంథం. దానిని తుచ తప్పకుండా ఇక్కడ అనుసరిస్తారు. అంతేకాని హిందూ ధర్మం ఏనాడూ పునాదిగా చేసుకోలేదు. సెక్యులరిజం పేరుతో కుహనా లౌకికవాదులు హిందువులకే పాఠాలు ఎక్కువగా చెప్తారు. హిందుత్వాన్ని తిట్టడమే సెక్యులరిజం అనే భ్రమలో, ప్రమాదంలో దేశ ప్రజలను పడేసారు. దేశాన్ని విధ్వంసం చేసే వ్యక్తి అయినాసరే సెక్యులరిస్టు అనే ముద్ర వేసుకుంటే చాలు అతను ఈ దేశంలో రాజకీయవేత్తగా చెలామణి అవుతున్నాడు. ఎంత అవినీతిలో మునిగి తేలినా సరే సెక్యులరిస్టుగా మీడియాలోని ఒక వర్గం వారిని కీర్తిస్తుంది. ప్రజలకు అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, వసతుల కల్పన ఇవన్నీ సెక్యులరిజం ముందు దిగదుడుపే. ఈ పరిస్థితులన్నింటినీ ముందే ఊహించిన మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తన ‘్థట్స్ ఆన్ పాకిస్తాన్’ అనే గ్రంథంలో ఇలాంటి రాజకీయాలకు ఓ అద్భుతమైన పేరుపెట్టారు.

ఆనాటి ముస్లిం లీగ్, జిన్నా రాజకీయాలను గ్రావమిన్ పాలిటిక్స్, ‘దుర్బలత్వం’ పేరుతో రాజకీయాలు చేయడం అని దానికి ఆయనే అర్థం చెప్పాడు. అది డెబ్బై ఏళ్లనుండి జరుగుతూనే ఉంది. దానికి వామపక్ష మేధావులు పెట్టిన అకడమిక్ పేరు ‘సెక్యులరిజం’. దాని అసలర్థం దిలేసి నూతనార్థం వెంబడి వెళ్తున్న మన విధానాలు మారితేనే దేశం అభివృద్ధి పథంలో వెళ్లగలదు. సత్యాన్ని అణచాలనుకుంటే అది సాధ్యం కాదు. అది ఉవ్వెత్తున లేస్తుంది. ఈ డెబ్బై ఏళ్లనుండి జరిగిన అణచివేత ఈరోజు కట్టలు తెంచుకుని హిమోత్తుంగ తరంగంలా దూసుకొస్తోంది. దాన్ని ఆపడం అంత సులభం కాదు. *

మూలము: అంతర్జాలకుడు

16, జూన్ 2020, మంగళవారం

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు? - Bharatiya Muslimluరోనా మహమ్మారి ప్రబలగానే కొన్ని ఇస్లాం దేశాలు ఇలా చేశాయి…

మార్చి 5న సౌదీ అరేబియా ముస్లిములకు అత్యంత పవిత్ర ప్రదేశమైనటువంటి కాబా ని లాక్ డౌన్ చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ తీసుకొని ఈ నిర్ణయాన్ని సంవత్సరం పొడవునా జరిగే ఉమ్రా యాత్రను నిలిపివేసిన మరుసటి రోజునే ప్రకటించడం జరిగింది.  99.99 శాతం ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలో మార్చి 23 నుండి ఉన్న అన్ని మసీదులలో ప్రార్ధనలు నిలిపివేస్తూ 21 రోజుల కర్ఫ్యూ విధించబడింది.  ఏప్రిల్ 2వ తేదీన మక్కా, మదీనాలలో 24 గంటల కర్ఫ్యూ విధిస్తూ సౌదీ ప్రభుత్వం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.

సౌదీ ప్రజలు వీటిని వ్యతిరేకించడం కానీ, అల్లర్లకు దిగడం కానీ చేయలేదు.

ముస్లిములను అధిక సంఖ్యలో కలిగిన రష్యన్ దేశమైన చెచెన్యా ఎవరన్నా కరోనా క్వారంటైన్ ని ధిక్కరించి, ఇతరులకు ఆ వైరస్ ను వ్యాప్తి చేస్తే మరణ శిక్ష విధిస్తామని హెచ్చరించింది. మార్చి 15న చెచెన్యా అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్, ఎవరైనా తమకి తాము సమస్య కలిగేలా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేయాలి. అలాంటి వాళ్ళు తాము జబ్బు పడటమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు, తోబుట్టువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి దానిని అంటిస్తారని అభిప్రాయపడ్డాడు

చెచెన్యా ప్రజలు దీనిని వ్యతిరేకించడం కానీ, అల్లర్లకు దిగడం కానీ చేయలేదు.

ఒకప్పుడు ఇస్లామిక్ ఖలీఫాత్ కి కేంద్రమైన టర్కీ మక్కా నుండి తిరిగివచ్చిన యాత్రీకులను 14 రోజుల క్వారంటైన్ లో ఉంచింది. మర్చి 15 న ఉమ్రా యాత్ర నుండి తిరిగి వచ్చిన 10330 మందిని నిర్బంధంలో ఉంచింది.

టర్కీ ప్రజలు దీనిని వ్యతిరేకించడం కానీ, అల్లర్లకు దిగడం కానీ చేయలేదు.

ఇస్లామిక్ దేశాలు ఇలాంటి ధృడమైన చర్యలు తీసుకుంటే, హిందువులను అధిక సంఖ్యలో కలిగి ఉన్న భారతదేశ ప్రభుత్వం మాత్రం  క్వారంటైన్ని,  స్వీయ నిర్బంధాన్ని వ్యతిరేకించిన ముస్లిములను అల్లరి చేసే చిన్న పిల్లలతో వ్యవహరించే విధంగా వ్యవహరించింది.  తబ్లిగి జమాత్ కి చెందిన తీవ్రవాద భావాలు కలిగిన ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడరాదు అనే ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘించడం, కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి ముస్లిములను ఆహ్వానించడం, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల మీద ఉమ్మి వేయడం, ఐజోలేటేడ్ వార్డులలో మూత్ర విసర్జన చేయడం, మహిళా నర్సింగ్ సిబ్బందికి తమ రహస్యాంగాలను చూపించడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.

పోలీసులు, అధికారులు ఆ బయో-జీహాదీలతో ఉగ్రవాదులతో వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకుండా, తమ మాట వినమని ప్రాధేయపడటం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో భారత ప్రభుత్వ పురాతన మెతక వైఖరి తేటతెల్లమయింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, చెన్నై లోని ఒక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కొంత మంది కరోనా వ్యాధిగ్రస్తులు ‘ఇస్లామిక్ స్టేట్’ అనే తీవ్రవాద సంస్థ ప్రాచుర్యం కల్పించిన ‘చూపుడు వేలును ఆకాశం వైపు చూపించడం’ అనే సంజ్ఞ ను ప్రదర్శించడం. తమ ప్రాణాలకు తెగించి వైద్య సహాయం అందిస్తున్న వైద్యులు, నర్సులు, అధికారులకు కృతజ్ఞతలు తెలపడానికి బదులు, తబ్లిగి జమాత్ సభ్యులు వాళ్ళను అవమానపరచే విధంగా ప్రవర్తించారు.

వామపక్ష-ఉదారవాద మీడియా ఇక ఏమాత్రం వీళ్ళు చేస్తున్న దురాగతాలను దాచలేకపోవడంతో, దేశ వ్యాప్తంగా ముస్లిములు ఇప్పుడు ‘తాము బాధితులం’  అనే వైఖరిని అనుసరిస్తున్నారు.  వాళ్ళ విపరీత ఆలోచనా ధోరణి ప్రకారం అల్లా మాత్రమే ముస్లిములు ఎప్పుడు  మరణించాలో నిర్ణయిస్తాడు కాబట్టి, మసీదుల వద్ద గుమికూడరాదు అనే నిషేదాజ్ఞాలను తాము వ్యతిరేకిస్తామని వాళ్ళు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సౌదీ ప్రజలు, రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు తమ ప్రభుత్వ ఆదేశాలను పాటించడానికి ఎటువంటి అభ్యంతరమూ తెలుపకపోగా, భారత ముస్లిములు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన క్వారంటైన్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నారు.

ముస్లిముల ఆలోచనా ధోరణి…
అవిభాజ్య భారతదేశంలో ఉన్న ప్రముఖ మేధావులలో  న్యాయవేత్త, భారత రాజ్యంగ కమిటీ అధ్యక్షుడు అయిన భీంరావు  రాంజీ అంబేద్కర్ ఒకరు.  వీర సావర్కర్ లాగా అంబేద్కర్ కూడా ముస్లిముల మనస్తత్వం మీద  ఒక నిర్దుష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు.  భారతీయ ముస్లిములలో కొంత మంది ఎందుకు చట్టాని వ్యతిరేకిస్తారు అన్న విషయంలో ఆయన ఒక మంచి వివరణను ఇచ్చారు. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం, ముస్లిం పాలనలో  లేని భూభాగాలలో , ఆ దేశ చట్టాలు ముస్లిం చట్టాలకు విరుద్ధంగా ఉంటె, ముస్లిములు వాటిని ధిక్కరించి, ముస్లిం చట్టాలను అనుసరించడం న్యాయబద్ధమే.

వాళ్ళు CAA ని వ్యతిరేకిస్తూ రైళ్ళను తగలబెట్టడం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడానికి కారణం తమ దిక్కరణకు మతపరమైన అనుమతి ఉంది అన్న విశ్వాసమే.  ఈ కారణం చేతనే వాళ్ళు పోలియో వాక్సిన్ ను వ్యతిరేకిస్తారు, జన గణన కోసం వచ్చిన అధికారులను తరిమికొడతారు.

జనాభాను పూర్తిగా మార్పిడి చేయాలి అని వాదిస్తూ అంబేద్కర్ తన పుస్తకం, ‘ పాకిస్తాన్ లేదా భారత దేశ విభజన (Pakistan or Partition of India) లో …”హిందువులచే నడపబడుతున్న ప్రభుత్వ అధికారాన్ని ముస్లిములు ఎంతవరకు గౌరవిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముస్లిముల దృష్టిలో హిందువులు ‘కాఫీర్లు’.  కాఫీర్లు గౌరవానికి అర్హులు కారు. వాళ్ళు స్థాయి లేని, తక్కువ పుట్టుక కలవారు.  అందువలన కాఫీర్ల చే పాలించాబడుతున్న ప్రభుత్వం ముస్లిముల దృష్టిలో ఒక ‘దార్ ఉల్ హర్బ్’ అంటే ఇస్లాం తో విరోధం ఉన్న దేశము.  కాబట్టి, ముస్లిములు హిందూ ప్రభుత్వాన్ని గౌరవించరు అనే విషయంలో మరే ఇతర ఉదాహరణలు అవసరం లేదు.  ప్రభుత్వ అధికారాన్ని గౌరవించడానికి అవసరమైన అణకువ, కనికరం అనే మౌలిక భావనలు వారిలో ఉండవు.  కానీ, దానికి సాక్షాలు కావాల్సివస్తే, వాటికేమీ కొరత లేదు.  వేటిని అంగీకరించాలి, వేటిని విస్మరించాలి అనేదే సమస్య అనుకునేంత ఎక్కువ సంఖ్యలో అవి అందుబాటులో ఉన్నాయి.

భారత ప్రభుత్వం లాంటి జాతీయ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే మరొక సిద్ధాంతం, ఇస్లాం ప్రాదేశిక అనుబంధాన్ని  గుర్తించకపోవడం. దానివి భూభాగంతో సంబంధం లేని సాంఘిక, మత పరమైన అనుబంధాలు. ‘ఐక్య ఇస్లమిజం’ (Pan-Islamism) కి ఇదే ప్రాతిపదిక అని అంబేద్కరు అభిప్రాయపడ్డారు. ఈ భావనే భారతదేశంలోని ముస్లిముల చేత, ‘నేను ముందు ముస్లిం ను, తరువాత భారతీయుడను’ అని అనిపిస్తుంది. భారతీయ ముస్లిములు ఈ దేశ పురోభివృద్ధిలో చాలా తక్కువ పాత్ర పోషించడానికి, ఇస్లామిక్ దేశాల సమస్యలను గూర్చి అలసిపోయేంతలా ఆలోచించడానికి, వాళ్ళ ఆలోచనలలో ఇస్లామిక్ దేశాలు మొదటి స్థానాన్ని, భారతదేశం రెండవ స్థానాన్ని ఆక్రమించడానికి గల కారణాలను ఈ సిద్ధాంతం మనకు వివరిస్తుంది.

అంబేద్కర్ దృష్టిలో ఇస్లాం లోని మరొక ప్రధాన లోపం ఏమిటంటే, అదొక స్థానిక స్వపరిపాలనకు అనుకూలంగా లేని సాంఘిక స్వపరిపాలనా వ్యవస్థ. ఎందుకంటే, ముస్లీములు తాము నివసిస్తున్న దేశానికి కాక, తమ విశ్వాసానికి విధేయులుగా ఉంటారు. ‘ఎక్కడ ఉపాధి దొరికితే, అదే మన దేశం’ అనే భావన ముస్లిముల ఆలోచనలకు అందని భావన. ఇంకో మాటలో చెప్పాలంటే  ఇస్లాం ఎప్పుడూ నిజమైన ముస్లిముని  భారతదేశం తన మాతృభూమిగా, హిందువులను తన బంధు మిత్రులుగా అంగీకరించడానికి ఒప్పుకోదు.  ప్రసిద్ధ భారతీయుడు, నిజమైన ముస్లిం అయినటువంటి మౌలానా మొహమద్ అలీ తనను భారత దేశంలో కాక జెరుసలేములో ఖననం చేయాలని ప్రకటించడానికి ఇదే కారణం.

సమస్య ఏమిటంటే, భారతదేశంలోని చాల మంది ముస్లిములు తమని తాము భారతదేశంలో అంతర్భాగమైన ఒక సమూహముగా కాక, ఈ దేశంలో ఉన్న మరొక దేశం గా భావించడం. అంటే ఇక్కడి ముస్లిములు ఇతర మతాల వారితో సహకరించడం కాకుండా, తమకు తాము స్వతంత్రం గా పని చేస్తున్నారు.  వాళ్ళు తాము ‘బాధితులము’ అని భావించడానికి ప్రధాన కారణం, అధిక సంఖ్యాకులైన హిందువులు ఉన్న దేశంలో సామాన్య పౌరులుగా జీవించడాన్ని భరించలేకపోవడం. విబేధాలను పక్కన పెట్టి, తమకు, తమ ప్రత్యర్ధులకు ఒక ఉమ్మడి లక్ష్యాన్ని అంగీకరించే వాళ్ళ సమూహాన్ని ‘సంఘం’ అని  చెప్పవచ్చు.  మిగిలినవాళ్ళకన్నా విభిన్నంగా ఉండటమే కాకుండా , ఇతరుల లక్ష్యాన్ని తమ లక్ష్యంగా అంగీకరించని ప్రజల సమోహాన్ని ‘దేశం’ అని చెప్పవచ్చు అని అంబేద్కర్ వివరిస్తారు.

ముస్లిములు తాము ప్రత్యేక దేశానికి చెందిన వారిమని భావించడానికి కారణం ఉమ్మడి లక్ష్యాన్ని అంగీకరించకపోవడమే. ఈ కారణం చేతనే ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నా భారతీయ ముస్లీములు ‘దేశంలో భాగమైన వేరొక దేశం’ అని భావించాడు. భారతీయ ముస్లిములు ఈ ‘దేశంలో అంతర్భాగమైన దేశాలు’ అనే భావనని పాశ్చాత్య దేశాలకు కూడా ఎగుమతి చేసారు.

తాము ప్రత్యెక దేశానికి చెందిన వాళ్లము అనే భావన ముస్లిములలో కొనసాగితే, అది ఈ రాజ్యాన్ని ఖండాలుగా మార్చే ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశం చీలిపోవడానికి ఆరు సంవత్సారాల పూర్వమే (1941 లో)  దళిత రాజకీయవేత్త ఈ విషయాన్ని చాటిచెప్పారు.

రాజీలేని వైఖరి…
హిందువులకు విధేయత చూపడం మాట అటుంచి, ఇక్కడి ముస్లిములు  వాళ్ళతో గొడవ పడటానికి సిద్ధంగా ఉంటారు. 1761లో జరిగిన పానిపట్టు యుద్ధంలో వాస్తవంగా ఎవరు గెలిచారు అన్న దాని మీద 1926లో ఒక వివాదం చెలరేగింది. ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ ఒక లక్ష మంది సైన్యంతో నాలుగు నుండి ఆరు లక్షల వరకు ఉన్న మరాఠా సైనికుల మీద విజయం సాధించాడు కాబట్టి అతనిది గొప్ప విజయం అని ముస్లిములు వాదించారు. అది ముస్లిముల దురాక్రమణలకు అడ్డుకట్ట వేసింది అని హిందువులు వాదించారు.

వాస్తవమేమిటంటే, పానిపట్టు దగ్గరున్న మరాఠా సైన్యంలో 45 వేల నుండి 60 వేల మధ్య ఉంటే, అబ్దాలీ దగ్గర లక్ష మంది ఉన్నారు. తమ విజయముపై మితిమీరిన విశ్వాసముతో ఉన్న  మరాఠా సైన్యం యుద్ధంలో పాల్గొనని రెండు లక్షల మంది మహిళలను, పిల్లలను, వృద్ధులను తమతో పాటు రావడానికి అంగీకరించారు. యుద్ధము పూర్తయి, మరాఠా సైన్యం విజయం సాధించగానే, గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వచ్చారు వాళ్ళు. కానీ అంతమంది ఉండటం చేత మరాఠా సైన్యం వేగంగా కదలలేక పోయింది. ఓడిపోయినప్పటికీ, చాల మంది ఆఫ్ఘన్ సైనికులను అంతమొందిచారు మరాఠా వీరులు. అంతమంది సైనికులను కోల్పోవడం వలన మరల ఆఫ్ఘన్ సైనికులు భారతదేశం వైపు రావడానికి ధైర్యం చేయలేకపోయారు. ఒక దశాబ్దం గడిచే లోపే మరాఠా సైన్యం మళ్ళీ ఉత్తర భారత దేశంలో తాము కోల్పోయిన భూభాగాలను స్వాధీన పరచుకుని, పానిపట్టు యుద్ధం లో తమను వంచించిన వారిని శిక్షించింది.

ఏది ఏమైనా ఇలాంటి అవాస్తవ ప్రచారం చేయడం భారతదేశం లోని ముస్లిం  నాయకులకు అలవాటే. ఉదాహరణకి ఒక సందర్భంలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, పోలీసులు 15 నిముషాల సేపు వైదొలిగితే, వంద కోట్ల మంది హిందువులను మేము హతమారుస్తాము అన్నాడు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక పాక్ సైనికుడు పది మంది భారత సైనికులతో సమానం అని ఒకసారి , ఆరుగురితో సమానమని ఒక సారి, ముగ్గురితో సమానమని ఒకసారి వదరింది. భరత్ చేతిలో ఓటమి ఎదురైనప్పుడల్లా అది, ఈ నిష్పత్తిని తగ్గిస్తూ  వచ్చింది.

ముస్లిములు హిందువుల చేతిలో ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరని, వాళ్ళు ఎల్లప్పుడూ హిందువుల మీద తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.  ఒకసారి, ఉత్తర ప్రదేశ్ లోని నజిబాబాదు కి చెందినా మౌలానా అక్బర్ షా ఖాన్ హిందువులు ముస్లీములు పానిపట్ వద్ద నాలుగవ యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.

అతను పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకి ఈ విధంగా సవాలు విసిరాడు. “పండిట్ జీ, మీరు పానిపట్టు దగ్గర జరిగిన యుద్ధ ఫలితాన్ని అసత్యమని నిరూపించడానికి ప్రయత్నిస్తుంటే, నేను మీకు ఒక సులభమైన మార్గం చెప్తాను. మీ పలుకుబడిని ఉపయోగించి, అధికారుల నుండి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండే విధంగా  నాలుగవ పానిపట్టు యుద్ధానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోండి.  ముస్లీం, హిందువుల ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యంలో పరీక్ష పెట్టడానికి నేను సిద్ధం. 7 కోట్ల మంది ముస్లీములకు ప్రాతినిద్యం వహిస్తూ 700 మంది ముస్లీములు వస్తారు. అలాగే 22 కోట్ల హిందువుల తరపున మీరు 2200 మంది హిందువులను తీసుకు రండి.  ఫిరంగులు, బాంబులు, తుపాకులు వాడకుండా కేవలం కత్తులు, ఈటెలు, బాణాలు, చురకత్తులు  మాత్రమే ఉపయోగించాలి. మీరు హిందువులకు నాయకత్వం వహించలేకపోతే ఆ అవకాశాన్ని సదాసివ రావు లేదా విశ్వాస్ రావు లాంటి వాళ్ళ వారసులకు ఇవ్వండి. వాళ్ళు 1761 లో తమ పూర్వీకులకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మాత్రం కనీసం ప్రేక్షకునిగా అన్నా రండి. మీకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి, నేను ఆఫ్ఘన్లను లేదా పటానులను తీసుకురాను. నేను షరియత్ ని సక్రమంగా ఆచరించే భారతీయ ముస్లిముల ను మాత్రమే తీసుకు వస్తాను.

ఓర్వలేని విద్వేషం…
1928 లో హిందూ ముస్లిముల సంబందాలు అనే అంశం మీద విడుదల చేసిన ఒక ప్రకటన పత్రంలో చిస్తీ ఇస్లామిక్ ఆర్డర్ కి చెందిన క్వాజ హసన్ నిజామీ అనే ఓ సూఫీ సన్యాసి ఇలా ప్రకటించాడు…’’ముస్లిములు హిందువులకన్నా భిన్నమయినవారు. వారు భారతీయ హిందువులతో మమేకమవ్వలేరు.  ఎన్నో రక్తపాత యుద్ధాల అనంతరం వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వారి నుండి భారతదేశాన్ని తీసుకున్నారు. ముస్లిములు ఒక ఐక్య జాతి, వాళ్ళు మాత్రమే భారత దేశానికి యజమానులు. వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోరు. ముస్లిములు వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించారు కాబట్టి వాళ్ళకి ఈ దేశం మీద హక్కు ఉంటుంది. ప్రపంచంలో హిందువులు అల్ప సంఖ్యాకులు. వాళ్ళు ఎప్పటికీ అంతర్గత కలహాల నుండి బయట పడలేరు. వాళ్ళు గాంధిని విశ్వసిస్తారు, ఆవును పూజిస్తారు. వాళ్ళు ఇతరుల జలాన్ని స్వీకరించి మలినమైనారు. వాళ్ళు స్వపరిపాలనను లక్ష్యపెట్టరు. అందుకోసం వారికీ సమయం కూడా ఉండదు. వాళ్ళని అంతర్గత కలహాలతో సాగిపోనివ్వండి. ప్రజలను పాలించడానికి వాళ్లకి ఏమి అర్హత ఉంది? ముస్లిములు పాలించారు, ముస్లిములు పాలిస్తారు. “

తరువాత మౌలానా ఆజాద్ సోభాని … కాన్పూర్ కి చెందిన ఐక్య ఇస్లాం మత గురువు మరియు ఆల్ ఇండియా ఖలిఫత్ కాన్ఫెరెన్స్ సభ్యుడు అయిన ఇతను ముస్లిం మత గురువుల ఆలోచనా విధానాన్ని బయటపెట్టాడు. 1939 లో సిల్హెట్ లో మాట్లాడుతూ ఇతను, “ భారతదేశం నుండి ఇంగ్లిష్ వాళ్ళను పారద్రోలడానికి మద్దతు ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే, నేనే అటువంటి నాయకుడను. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళతో ముస్లిం లీగ్ కి తగవు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మన పోరాటం అధిక సంఖ్యలో ఉన్న 22 కోట్ల మంది హిందువులతో.  కేవలం నాలుగున్నర కోట్లు ఉన్న బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తాని ఆక్రమించుకున్నారు.  జ్ఞానములో, తెలివిలో, సంపదలో వాళ్ళతో సమానంగా ఉండే హిందువులు అధికారాన్ని చేజిక్కించుకుంటే, వాళ్ళు ముస్లిం ల ఆధీనంలో ఉన్న భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని, తరువాత క్రమ క్రమంగా ఈజిప్ట్, టర్కీ, కాబూల్, మక్కా, మదీనా, ఇంకా ఇతర ముస్లిం భూభాగాలను ఆక్రమిస్తారు.

సోభానికున్న అతి పెద్ద భయం ‘రామ రాజ్యం’…’ఆంగ్లేయులు క్రమంగా బలహీనపడుతున్నారు.  త్వరలో వాళ్ళు భారతదేశాన్ని వదిలిపోతారు.  కాబట్టి, ఇప్పటి నుండి మనకి అతి పెద్ద శత్రువైన హిందువులతో పోరాడి, వాళ్ళని బలహీనపరచకపోతే, వాళ్ళు ఇక్కడ రామ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా క్రమంగా దానిని ప్రపంచమంతా విస్తరిస్తారు.  వాళ్ళను బలవంతులు గా చేయడమా, బలహీనపరచడమా అనేది ఇక్కడున్న 9 కోట్ల ముస్లిముల మీద ఆధారపడి ఉంది. కాబట్టి  ప్రతి ముస్లిం విధిగా ముస్లిం  లీగ్ లో చేరి, హిందువుల మీద పోరాడాలి. అప్పుడు వాళ్ళు తమ అధికారాన్ని ఇక్కడ స్థాపించలేరు. ఆంగ్లేయులు వెళ్ళిపోగానే ఇక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించవచ్చు.

22 కోట్ల హిందూ శత్రువుల చేతిలో ముస్లిం సమాజం ఎప్పుడూ సురక్షితంగా ఉండలేదు” అని అతను ముగించాడు.

ముస్లిం నాయకుల ఈ విద్వేషపూరిత ప్రసంగాలు,  పదే పదే రేగుతున్న మత కలహాల నేపధ్యంలోనే అంబేద్కర్ భారత దేశం లోని ముస్లీములు అందరినీ పాకిస్తాన్ కి తరలించి, అక్కడున్న హిందువులను అందరినీ ఇక్కడకి తీసుకు రావాలని గట్టిగా వాదించారు. ఆయన, “హిందూ, ముస్లిములు వాళ్ళ వాళ్ళ ప్రత్యేక ప్రపంచాలలో జీవిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివసించినా విడి విడిగానే నివసిస్తున్నారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో హిందువులకు, ముస్లిములకు ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. వాళ్లకు ఉమ్మడిగా ఉన్న నిరంతర వ్యాపకం ఏమీ లేదు. వాళ్ళు వ్యాపారం కోసమో, హత్యలు కోసమో కలుస్తారు. వాళ్ళు ఒకరితో ఒకరు స్నేహం చేయడం కోసం కలవరు. వ్యాపార అవకాశం కానీ, హత్య చేసే అవకాశం కానీ లేకపోతే వాళ్ళు కలవరు.  శాంతి నెలకొంటే, హిందూ ప్రదేశాలు, ముస్లిం ప్రదేశాలు రెండు గ్రహాంతర వాసుల నివాసాలు లాగ అనిపిస్తాయి. యుద్ధం ప్రకటించిన మరుక్షణం అవి సైనిక స్థావరాలుగా మారతాయి.  శాంతి నెలకొని ఉన్న కాల వ్యవధి, యుద్ధం జరిగే కాల వ్యవధి స్వల్పంగానే ఉంటాయి. కానీ వాటి మధ్య కాలం నిరంతరం ఆందోళనకరంగానే ఉంటుంది.

ముగింపు
1940లలో లాగా ముస్లిం జనాభా  25 శాతానికి దగ్గర అవుతోంది. అప్పట్లో పాకిస్తాన్ కావాలనే డిమాండ్ గట్టిగా వినిపించినట్టుగా, ఇప్పుడు కూడా రెండవ విభజన కోసం పిలుపులు వినిపిస్తున్నాయి.  “భారతదేశం లో 20-25 కోట్ల మంది ముస్లిములు ఉన్నారు. భారత ప్రభుత్వానికి ధైర్యం ఉంటె పాకిస్తాన్ లాగ ముస్లిములకు ప్రత్యెక దేశం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.  అప్పుడు మీరు ‘హిందూ రాష్ట్రాన్ని’ ప్రకటించుకోవచ్చు.“ అని సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ కి చెందిన అజయ్ వర్మ ప్రకటించాడు. ముస్లిములు, క్రైస్తవులు, వామపక్ష వాదులు, లౌకిక వాదులు మరియు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు హిందువులకు వ్యతిరేకంగా ఉమ్మడి అంశాన్ని కనుగొన్న నేపధ్యంలో ప్రత్యెక ముస్లిం దేశం కోసం అడిగే గొంతులు పెరుగుతాయి .

లౌకిక వాదులు ఎంత పిరికిపందలు అంటే, వాళ్ళు జిహాదీలను ఎదురించాల్సింది పోయి, వాళ్ళను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు.  స్వాతంత్ర్య సమయంలో దేశ విభజనకు దారి తీసినట్టు, బుజ్జగింపులు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అంబేద్కర్ హెచ్చరించినట్టు, కాంగ్రెస్ అర్ధం చేసుకోవడంలో విఫలమైన రెండో అంశం ఏమిటంటే, వాళ్ళ రాయితీల విధానం ముస్లిముల దుడుకుతనాన్ని పెంచడమే కాకుండా ముస్లిములు దానిని హిందువుల ఓటమిగానూ, ఎదురించే సంకల్పం లేకపోవడం గానూ అర్ధం చేసుకున్నారు. రెండవ ప్రపంచ కాలం లో హిట్లర్ పట్ల అవలంబించిన బుజ్జగింపు విధానం వలన మిత్ర రాజ్యాలు ఎంత భయంకర స్థితిని ఎదుర్కొన్నారో, ప్రస్తుతం హిందువులు అదే స్థితిని ఎదుర్కొంటున్నారు.

చట్టాన్ని గౌరవించే హిందువులను భారత దేశంలోని మెతక ప్రభుత్వాలు పదే పద  ఓటమి పాలు చేసాయి. 1940 లలో జీహాదీలు చాలావరకూ పేదవాళ్ళు.  కానీ ఆధునిక జీహాదీలకు  వామపక్ష ఉదారవాదులు మరియు లౌకిక వాదుల మద్దతు ఉంది. తిరిగి ఇస్లామిక్ రాజ్య స్థాపన కల నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు రాజ్యాన్ని బలహీనపరచడానికి ఏమాత్రం వెనుకాడరు.

రైళ్ళను తగలపెట్టడం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం నివారించడం కోసం భారత దేశం పోలీసు, మరియు అనుబంధ సైనిక దళాలలో ఎక్కువమందిని నియమించి, వాళ్లకి ఆయుధాలను సమకూర్చి శక్తివంతం చేయాలి.  సహాయ నిరాకరణ అనేది వలస రాజ్యానికి వ్యతిరేకంగా చేయడం లో అర్ధం ఉంది.  దానిని ఈ భూమికి చెందిన హిందువులు నడుపుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయకూడదు.  ఇక్కడ హిందువుల ఆధిపత్యాన్ని సహించ లేనివారు తమ పూర్వీకుల అడుగుజాడలలో నడవవచ్చు. ఇక్కడ వాళ్లను చేస్తున్న గారాబం, వాళ్ళు కోరుకున్న దేశంలోని (పాకిస్తాన్) భయానక పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్న వాళ్ళు ఈ దేశాని వదిలిపోరు. ఇక్కడి ముస్లిముల భవితవ్యం భారత దేశంతో పెనవేసుకుని ఉంది.  వాళ్ళు ప్రత్యేక  దేశాన్ని, ఇక్కడున్న వనరుల మీద మొదటి హక్కును మర్చిపోవాలి. రైళ్ళను తగలబెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైద్యులకు ప్రమాదకరమైన వైరస్ ని అంటించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ మీద ఉమ్మేయడం లాంటి చేష్టలు అరాచక వాదులు చేసేవి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే, హిందువులు సహనం కోల్పోతున్నారు కాబట్టి, అలాంటి చేష్టలు వాళ్ళకే ముప్పుగా పరిణమిస్తాయి.

ఆంగ్ల మూలం: రాకేశ్ కృష్ణన్ సింహా
తెలుగు అనువాదం: శేషశాయి దీవి.
Source: Indiafacts
వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము

8, జూన్ 2020, సోమవారం

రాజీవ్ మల్హోత్రా గారి 'భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు' పుస్తకం - Rajiv Malhotra's Breaking India

న మీద యుద్ధం, కానీ శత్రువు కనిపించడు. ఆయుధం మన చేతికే ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆయుధాలతో మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాము. తెలిసీతెలియక ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతున్నామనుకునే వాళ్ళు సైతం, విచ్ఛినం చేసే ప్రయత్నాల్లో భాగవమవుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.... ఇప్పుడు చాలామంది పరిస్థితి అలానే ఉంది.

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి.

స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు.

ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది.
Breaking India
Breaking India 
ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా (Rajiv Malhotra) గారు 15 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

ఈ పుస్తకమేదో సంచలనం కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాసింది కాదు. విఛ్ఛినకర శక్తులు సమాజంలో ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన తర్వతా వారెవరో అర్దమవుతుంది. చదవకుండానే ఇదంతా ట్రాష్ అని తీర్పులివ్వకండి. కొంచం ఓప్పిగ్గా ఈ పుస్తకం చదవండి.

ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా విద్యార్ధులు, తల్లులు. స్కూల్లు, కాలేజీలకు వెళ్ళిన మీ పిల్లలు విఛ్ఛినకర శక్తుల మాయమాటలు నమ్మి రోహిత్, కన్నయ్య కూమార్ లాగా బలి కాకుండా ఉండాలంటే ప్రతి తల్లి ఈ పుస్తకం చదివి, తన పిల్లలను జాగృతం చేయాలి.

మరి మనకు కావల్సింది బౌద్ధిక క్షత్రియులు (intellectual kshatiryas). అందుకోసం ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి ఆలోచన. అందుకే బౌద్ధిక క్షత్రియ (intellectual kshatiryas) అనే స్వల్పకాలిక పాఠ్యక్రమాన్ని (షొర్త్ టెర్మ్ ఛౌర్సె) ని రూపొందించారు. ₹ 500/- రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని అందిస్తున్నారు. చివరలో సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

క్రింది పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవచ్చు:
Know what is happening in your own backyard by signing up for it today.

లింకు - https://www.cisindus.org/courses/breaking-india/

4, జూన్ 2020, గురువారం

స్వదేశీ వస్తువులు - భారతదేశానికి నరేంద్ర మోడీ సందేశం - Swadeshi Products, Pm Modi Message

స్వదేశీ వస్తువులు - భారతదేశానికి నరేంద్ర మోడీ సందేశం - Swadeshi Products, Pm Modi Message
భారతదేశానికి నరేంద్ర మోడీ సందేశం ..... భారతదేశంలో 121 కోట్ల మందిలో కేవలం 10% మంది రోజూ ₹ 10 కి జ్యూస్ తాగితే ఒక నెలకు ఇది సుమారు 3600 కోట్లు !!!!!! మేము పెప్సి మరియు కోకాకోలా తాగినప్పుడు, ఈ 3600 కోట్లు మన దేశం నుండి బయటకు వెళ్తాయి.

పెప్సి, కోకాకోలా కంపెనీలు ప్రతిరోజూ 7000 కోట్లకు పైగా పొందుతున్నాయి. చెరకు రసం లేదా లేత కొబ్బరి లేదా తాజా రసాలను తాగాలని, మన దేశంలోని 7000 కోట్లను ఆదా చేసి మా రైతులకు ఇవ్వమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

ఇకపై మన రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. మేము తాజా రసాలను తినేటప్పుడు అది ఒక కోటి మందికి వారి జీవనం కోసం ఆదాయాన్ని ఇస్తుంది. తరువాత ₹ 10 కి లభించే రసం ₹ 5 కి లభిస్తుంది. భారతీయ వస్తువులకు మద్దతు ఇవ్వండి మరియు మన దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయండి. దయచేసి ఈ సందేశం కనీసం ముగ్గురు వ్యక్తులకు చేరిందని నిర్ధారించుకోండి. 

ప్రవాహాన్ని ఆపవద్దు. దయచేసి ఈ సందేశాన్ని మీ అన్ని సమూహాలకు పంపండి.  భారతీయ వస్తువులను కొనండి మరియు మద్దతు ఇవ్వండి మరియు మన దేశాన్ని రక్షించండి.  భారతీయులందరూ 90 రోజుల పాటు విదేశీ ఉత్పత్తుల కొనుగోలును ఆపివేస్తే, భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యంత ధనిక దేశంగా అవతరిస్తుంది. 

కేవలం 90 రోజుల్లో మా ₹ 2 1 డాలర్‌తో సమానం.  మనమందరం కలిసికట్టుగా చేయాలి ఎందుకంటే ఇది మన దేశం.  మన దేశం కోసం మనం నిలబడకపోతే మన సంపదను విదేశాలకు కోల్పోతాము.  మేము చాలా జోకులు మరియు సందేశాలు మరియు శుభాకాంక్షలను ఫార్వార్డ్ చేస్తాము, ఈ సందేశాన్ని భారతీయులందరికీ చేరేలా ఫార్వార్డ్ చేద్దాం.

సంకలనం: కోటేశ్వర్

3, జూన్ 2020, బుధవారం

గొప్ప ధార్మికురాలు.. రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ - Rajamatha Raani Ahilyabai holkarగొప్ప ధార్మికురాలు.. రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ - Rajamatha Raani Ahilyabai holkar

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే ఆంగ్లేయుడు ( 1849 ) లో కీర్తించారు . రాజమాత దేవీ అహల్యాబాయి     18వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు  అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి.

ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయం అయితే, అఖండ భారతదేశంలో ప్రసిద్ది  పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాత దేవీ అహల్యాబాయి జీర్ణోద్దరణ చేయించారనో,  రహదారి బాగుచేయించారనో,  సత్రాలు కట్టించారనో ఉంటుంది. దేశం నలుమూలలా ఈ మహత్కార్యాలు జరిగాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి  జగన్నాథ ఆలయం, బద్రీనాథ్, బేలూరు, నాసిక్  ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మ కార్యాలు లెక్కలేనన్ని. ఇప్పటికి దాదాపు 157పుణ్య తీర్థాలలో, ప్రసిద్ద క్షేత్రాలలో దేవీ అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్ లు ధార్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. కేవలం 70ఏళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . అందుకే ఆ స్త్రీ మూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది.

దేవీ అహల్యాబాయి హోల్కర్ జననం 31 మే నెల 1725 వ సంవత్సరం ప్రస్తుతం అహ్మద్ నగర్ జిల్లా ,  జమ్ఖేడ్ తాలుకాలోని చోండిగ్రామంలో, గ్రామాధికారి మంఖోజి షిండే ఇంట జరిగింది. ఈ గారాలపట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది. తల్లి దగ్గర పురాణఇతిహాసాలు చదువుకుంది. ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ ( మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దార్ ) పేష్వాను దర్శించటానికి పూణే వెళ్ళే మార్గంలో చోండి గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తీ, చిన్న వయస్సులోనే సేవా భావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు. 1733 వ సంవత్సరం ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది.  1745 లో పుత్రుడు మలేరావు జన్మించాడు.  మరో మూడేళ్ళ తరువాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది. మామగారు ఆహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో, యుద్ద వ్యుహాలలోనూ పూర్తి సలహాలు, సంప్రదింపులు జరిపేవారు. ఈ తర్ఫీదు వల్లనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్దాలలో స్వయంగా పాల్గొన్నది. ఆవిడ ఏనుగు అంబారీ నాలుగువైపులా నాలుగు ధనస్సులు బాణాలతోకూడిన తూణీరాలతో ఉండేది. ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు. సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్ధించి విధేయంగా ఉండేది.

ప్రశాంతంగా సాగుతున్న ఆహల్యాబాయి జీవితంలో వరసగా జరిగిన మరణాలు, తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని, త్యాగాన్ని, బాధ్యతాయుతప్రవర్తనకు అద్దంపడతాయి మొదట 1754లో కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి  ఖండేరావు మరణిస్తారు. సహగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు, మామగారు మల్హార్ రావు హోల్కర్ ఖిన్నుడై “కన్నకొడుకు దూరమై ఇప్పటికే నా కుడిబుజం విరిగిపోయింది, ఈ కష్ట సమయంలో నువ్వూ నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏమి కావాలి. ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి, చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా?? ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు. ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యతవహించాలి”అని అన్నారు.  మనస్సు దిటవు చేసుకొన్నఅహల్యాబాయి ‘ సతీ సహగమనం ‘ విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది. ఆ తరువాత దాదాపు పది, పన్నెండు ఏళ్ళ వ్యవధిలో మొదట మామగారు చనిపోవటం, సింహాసనం అధిష్టించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించడం వెంటవెంటనే జరిగి పొయాయి. ఈ విషాద సమయంలో రాజ్యంలో లుకలుకలు మొదలైనాయి. ఒక స్త్రీ చేతిలో ఉన్న  రాజ్యాన్ని సులభంగా గెలవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటివారికి బుద్ధిచెప్పి, అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతిశాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి. అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరటం ద్వారా రాఘోబాను ఒంటరిని చెయ్యడం, పీష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం , ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చెయ్యకుండా సూటిగా హెచ్చరికలు పంపడం. రాఘోబాతో యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యటం వంటి చర్యలన్నీ  ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేసాయి. అది మొదలు దాదాపు 30 సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది.

రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది. సుఖోజి రావు హోల్కర్ ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది. ప్రస్తుతం మనం చూస్తున్న  ఇండోర్ ఒక నగరంగా అభివృద్దిచెందటానికి ముఖ్యకారణం ఆమెనే. తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ది గాంచిన మాహిష్మతీనగరం అనే పేరుగల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్ధికంగా, సాంస్కృతిక పరంగా, ధార్మికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి. భిల్లులు, గోండులు వంటి సంచార  జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటుచేయడమేకాక  వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు .

ఆవిడ ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు. చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు. అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా వుండేది. ప్రజలకు ప్రణాళికబద్దమైన పన్నుల విధానం ఉండేది. వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు , భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలైనాయి. ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు. అది ఇప్పటికీ  మనం గమనించ వచ్చు, స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనిలో ఉన్న జ్యోతిర్లింగస్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ద్వంసం అయిన అనేక ప్రసిద్ద శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు. ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూసమాజం దేవీ అహల్యాబాయి హోల్కర్ కి ఎంత ఋణపడిందో అర్ధమవుతుంది. సరిచేసి, తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవీ అహల్యాబాయి హోల్కర్ కు  ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మూలము: విశ్వ సంవాద కేంద్రము

27, మే 2020, బుధవారం

సామాజిక రూపశిల్పి దాక్టర్ హెడ్గేవార్ జీ - Samajika Roopa Silpi, Dr. K.B. Hedgewar ji

సామాజిక రూపశిల్పి

భారతదేశంలో జాతీయభావాలు ప్రతి ఒక్కరిలో జాగృతం అవుతున్నాయి. అదే సమయంలో జాతి వ్యతిరేక శక్తుల స్వరం కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయతకు ప్రతిరూపం "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కనుకనే కొన్ని శక్తులు సంఘాన్ని కూడా విమర్శిస్తున్నాయి. సంఘానికి మూలం దాక్టర్ హెగ్డేవార్ , ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా సంఘాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.

డాక్టర్ హెడ్గేవార్ ప్రఖరమైన దేశభక్తులు. శ్రేష్టమైన సంఘటనకర్త. ఒక ద్రష్ట (Visionary) సాధారణ వ్యక్తి. కానీ అసాధారణ ప్రతిభాపాటవాలు ఆయన సొంతం. He was deeply rooted in the philosophy culture and history of Bharat and simultaneously had a farsighted vision for future. కనుకనే ఆయన ఒక ద్రష్ట అని చెప్పవచ్చు.

      ఆంగ్ల సామ్రాజ్యం పట్ల ఆయన మనసులో ఎలాంటి వ్యతిరేకభావాలు ఉన్నాయో తెలిపేందుకు ఆయన బాల్యంలో అనేక సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. స్వాతంత్ర సముపార్జన కోసం జరుగుతోన్న అహింసాయుత సత్యాగ్రహం మొదలు, సాయుధ విప్లవవీరుల పోరాటం వరకు. అన్ని కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలంగా పనిచేశారు. దానితో పాటు స్వాతంత్య్ర సాధన కోసం అవసరమైన మానసిక సంసిద్ధత, ధార్మిక, సామాజిక రంగాల్లో ప్రజలను జాగృతం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా డాక్టర్టీకి బాగా తెలుసు. కనుకనే ఆయన స్వాతంత్య్ర సముపార్థన కోసం సంపూర్ణ సమాజాన్ని ఐక్య పరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1921లో జరిగిన ప్రథమ సత్యాగ్రహంలో పాల్గొంటూ "జైలుకు వెళ్లడం మాత్రమే దేశభక్తి కాదు. వెలుపల ఉంటూ సమాజాన్ని జాగృతం చేయడం కూడా కారాగారవాసంతో సమానమైన కార్యం" అని అన్నారు. అప్పుడు డాక్టర్జీ వయసు 31 ఏండ్లు మాత్రమే.
ఏ దేశ రాజకీయ స్వాతంత్రయ్యానికైనా ప్రారంభంలో తప్పనిసరిగా ఆ దేశానికి చెందిన మనసు, ఆత్మను మేల్కొలపాలి. అందుకే స్వాతంత్ర్యోద్యమం బలోపేతమై, విజయం సాధించేందుకు డాక్టర్ హెడ్డేవార్ ఈ దేశ ఆత్మను, మనసును మేల్కొలిపే కార్యక్రమాన్ని సమాజాన్ని ఐక్యం చేసే పనిని మొదలుపెట్టారు.
        స్వామి వివేకానంద రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పర్యటించారు. కర్వాత 1893లో అమెరికా, యూరోప్ దేశాలు పర్యటించారు. నాలుగు సంవత్సరాల అనంతరం 1897లో పశ్చిమదేశాల పర్యటన పూర్తి చేసి, భారతదేశంలో అడుగుపెట్టారు. 
వివేకానందుడు
ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తూ మనం ఐకమత్యంగా ఎలా మెలగాలో పశ్చిమదేశాల నుండి నేర్చుకోవాలి. అలాగే వ్యక్తులను నిర్మాణం చేయడానికి ఒక పద్దతి, ప్రక్రియను అవలంబించేందుకు ఏదో ఒక విధానం అమలు పర్చాలి.

భారతీయులందరూ రాబోవు కొన్ని సంవత్సరాల పాటు తాము ఆరాధించే దేవీదేవతలను పక్కన పెట్టి, కేవలం ఒకే ఒక దేవతను పూజించాలి. 'అమె భారతమాత అని అన్నారు. ఈ మూడు అంశాలకు ప్రతిరూపమే 'సంఘ శాఖ', 'సంఘపని'. కులభేదాలు - నిర్మూలన పుస్తకంలో దాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజకీయ విప్లవం ఎల్లప్పుడు సామాజిక, ధార్మిక జాగృతి తర్వాతే జరిగినట్లు చరిత్ర చెబుతోందని స్పష్టంగా రాసారు. 

లూథర్ ద్వారా ప్రారంభమైన 'మత ప్రక్షాళన' ఉద్యమం యూరోప్ ప్రజలు సాధించిన రాజకీయ స్వాతంత్య్రానికి పునాది వంటిది. Purtanism (తమదే శుద్ధమైన సిద్ధాంతమని చెప్పడం ఇంగ్లాడ్, అమెరికా దేశాల స్వాతంత్ర్యానికి మూలాధారమైంది. ముస్లిం సామ్రాజ్యానికి కూడా అదే కారణమైంది. అరబ్బుల చేతికి రాజ్యాధికారం రావడం కంటే ముందు హజరత్ మహమ్మద్ ద్వారా జరిగిన ధార్మిక ఉద్యమ మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది. 
 • ➣ భారత్లో చరిత్ర ఇదే సత్యాన్ని నిరూపిస్తోంది. చంద్రగుప్తని ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ ఉద్యమం కంటే ముందే బుద్ధుని ద్వారా ధార్మిక - సామజిక ఉద్యమం జరిగింది. 
 • ➣ మహారాష్ట్రలో కూడా సాధువురుషుల ధార్మిక, సామాజిక ఉద్యమాల ఫలితంగానే శివాణీ నేతృత్వంలో అక్కడ రాజకీయ స్థిరత్వం సాధ్యమైంది.
 • ➣ గురునానక్ దేవ్ ధార్మిక - సామజిక తర్వాతనే సిక్కుల రాజ్యాధికార ఉద్యమం రూపు
 • ➣ దాల్చింది. ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు ప్రస్తావించవలసిన అవసరం లేదు. 
 • ➣ ఏ దేశానికి సంబంధించిన రాజకీయ స్వాతంత్ర్యానికైనా ప్రారంభంలో తప్పనిసరిగా ఆ దేశానికి చెందిన మనసు, ఆత్మను మేల్కొలపవలసిన అవసరం ఉంటుంది. 
అందుకే స్వాతంత్య్ర ఉద్యమం బలోపేతమై విజయం సాధించేందుకు డాక్టర్ హెడ్డేవార్ ఈ దేశ
ఆత్మను, మనసును మేల్కొలిపే కార్యక్రమాన్ని, సమాజాన్ని ఐక్యం చేసే పనిని మొదలుపెట్టారు.

      రవీంద్రనాథ్ టాగూర్ 'స్వదేశీ - సమాజం' అనే పుస్తకం రాసారు. అందులో సంక్షేమ రాష్ట్రం (Welfare State) భారతీయ పరంపర కాదు అన్నారు. 
 • ➣ భారతదేశంలో సమాజానికి సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. కొన్ని విభాగాలు మాత్రమే ప్రభుత్వ కనుసన్నలలో ఉంటాయి, భోజనం, మంచినీరు, ఆరోగ్యం, విద్యా తదితర అంశాలు సమాజమే నిర్వహించేది.
 • ➣ ఉదాహరణకు మనదేశంలో పందిరి వేయడం గమనించే ఉంటారు. అయితే ఎక్కడా కూడా ఒకే స్తంభంపై వెదురు బొంగులు పేర్చి పందిరి వేయరు.
 • ➣ ఆ స్తంభం కూలితే పందిరి మొత్తం పడిపోతుంది. అలా కాకుండా నాలుగు స్తంభాలతో పందిరి వేసినట్లయితే ఒక స్తంభం కూలినా మిగిలినవి దాన్ని నిలిపి ఉంచుతాయి. క్రమంగా మరమ్మత్తులు చేయడం కూడా సులువు అవుతుంది. 
 • ➣ మహమ్మదీయులు, క్రైస్తవులు ఎక్కడెక్కడైతే పాలించారో ఆయా దేశాల్లో ఈ విభాగాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచారు. ఫలితంగా అక్కడ ఇస్లాం, క్రైస్తవంలోకి మతమార్పిడిలు విపరీతంగా జరిగాయి. 
కానీ భారత్ లో 850 ఏళ్లు ముస్లిం రాజులు, 150 ఏళ్లు క్రైస్తవ పాలకులు పరిపాలించినప్పటికి 15శాతం. ముస్లింలుగా, 3శాతం క్రైస్తవులుగా మాత్రమే బలవంతంగా మతం మార్చుకొన్నారు. ఇది భారత్ కు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ఇక్కడ సమాజ నిర్మాణం ఒకే స్తంభంపై నిలబడి లేదు. ప్రభుత్వాల ఆధీనంలోనూ లేదు. పలు అంశాలని స్వతంత్రంగా సమాజమే నిర్వహించే స్థాయిలో ఉండేది.  "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" ఇదే రకంగా రూపుదిద్దుకుంది.

సంఘకార్యం కూడా సంపూర్ణ స్వావలంబనతో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలపై ఆధారపడి పనిచేసేది కాదు.  స్వయంసేవకులు ఒక లక్షా ముప్పైవేలకు పైగా సేవాకార్యక్రమాలను సమాజంలోని వివిధ రంగాల్లో నిర్వహిస్తున్నారు అందులో తొంభైశాతం సేవాకార్యక్రమాలకు ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయసహకారాలు ఆశించకుండా జరుగుతున్నాయి.

       నేను గుజరాత్ ప్రాంత ప్రచారక్ గా ఉన్న సమయంలో కేశూభాయ్ పటేల్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం (బీజేపీ-BJP) అధికారంలో ఉంది. ఆ సమయంలో గిరిజన తెగల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని భాజపా నేతలు భావించారు. వనవాసీ కల్యాణాశ్రమం గిరిజన తెగల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ ఆశ్రమ కార్యకర్తలు ప్రభుత్వం నుండి నిధులు స్వీకరించడానికి నిరాకరించారు. 

కొన్నేళ్ల కిందట ఒక సంఘకార్యకర్త కల్యాణాశ్రమం ప్రభుత్వ సహకారం ఎందుకు తీసుకోవడం లేదని నన్ను ప్రశ్నించారు. నేను అతనికి వినాబా భావే శైలిలో సమాధానం చెప్పాను. “ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి? సమాజమే పన్ను రూపంలో చెల్లిస్తోంది. అంటే ప్రభుత్వం ఉద్యోగి, సమాజం యజమాని అనే కదా అర్థం. అట్లాయితే మనం ఉద్యోగులను యాచించడం దేనికి? మనం నేరుగా యజమానులను అడుగుతున్నాం'. వాళ్లు ఆనందంగా ఇస్తున్నారు.

            ది స్టార్ ఫిష్ అండ్ స్పైడర్ అనే పుస్తకంలో సంస్థ లేదా సమాజ పాలనా వ్యవస్థ రూపురేఖలు ఎలా ఉంటాయో వివరించారు. ఇందులో రెండు ఉదాహరణలు ప్రస్తావించారు. ఒకటి స్పైడర్ (సాలె పురుగు), ఈ కీటకానికి అనేక కాళ్లు ఉంటాయి. ఒకటి, రెండు విరిగిపోయినా దాని ప్రాణాలకు ఢోకా లేదు. సాలెపురుగు జీవనశక్తి దాని చిన్న తలపై కేంద్రీకృతమై ఉంటుంది. తల నష్టపోతే ఆ పురుగు చనిపోతుంది.

రెండవది స్టార్ ఫిష్, ఇది విచిత్రమైన చేప. దాని జీవనాడి ఒక్కచోట కేంద్రీకృతమై ఉండదు శరీరంలోని అన్ని భాగాల్లో విస్తరించి ఉంటుంది. కనుక ఈ చేపను ఏదో ఒక అవయవంపై దాడి చేసి చంపడం సాధ్యం కాదు. (It is very difficult to kill a starfish). దాన్ని రెండు ముక్కలుగా నరికినట్లయితే అది రెండు స్టార్ ఫిష్లుగా రూపొందుతుంది.  ఈ విషయం గురించి అవగాహన కల్పించేందుకు రచయిత ఈ పుస్తకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. లాటిన్ అమెరికా చరిత్రకారులలో ప్రత్యేకంగా చెప్పుకోతగిన ఆచార్య నేవిన్ తన పుస్తకంలో ఒక సంఘటన పరిణామక్రమాన్నితెలిపారు. 

16వ శతాబ్దంలో యూరోప్, స్పెయిన్ నుండి అనేకమంది తమ సైన్యాన్ని వెంట తీసుకోని ధనవంతులు అయ్యేందుకు, దోపిడీలు చేయడానికి బంగారం నిక్షేపాలు అన్వేషించేందుకు నౌకల్లో బయలుదేరారు. ఈ ప్రయాణానికి “ సి ఎక్స్పిడిషన్" అనే పేరు ఉన్నట్లు జ్ఞాపకం. అదే విధంగా స్పెయిన్ నుండి మరో సైనికుల బృందం నావను తీసుకోని లాటిన్ అమెరికా భూభాగం వైపు వెళ్లింది. ఎక్కడ ఖాళీ భూభాగం కనిపిస్తే అక్కడ ఆక్రమణ చేయడమే వారి లక్ష్యం. 

1519లో స్పానిష్ సైనిక బృందం ఒకటి అజ్ టెక్ అనే గిరిజన రాజ్యంలోకి ప్రవేశించింది. అక్కడి రాజ్యాధినేత తలపై తుపాకి గురిపెట్టి “మొత్తం సైన్యాన్ని అప్పగించు. లేదా చంపేస్తాం" అని బెదిరించారు. ఆ రాజ్యాధినేత ఇలాంటి దోపిడి దారులను ఎదుర్కోవలసి వస్తుందని బహుశా కలలో కూడా ఊహించి ఉండడు. అతను సహజంగానే తన ప్రాణాలు రక్షించుకొనే క్రమంలో మొత్తం సైన్యాన్ని వాళ్లకు అప్పగించారు. వాళ్లు సైన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నప్పటికి మాటపై నిలబడకుండా రాజ్యాధినేతను కాల్చి చంపేశారు. రెండు సంవత్సరాల్లో, 1521 వరకు మొత్తం అజ్టెక్ రాజ్యం స్పానిష్ జాతి ఆధీనంలోకి వచ్చేసింది. 1534లో ఇలాంటి మరో సైనిక బృందం లాటిన్ అమెరికాలోని 'ఇన్ కా' పేరుతో పిలిచే గిరిజన రాజ్యంలోకి వెళ్లింది అక్కడ కూడా ఇలాంటి చరిత్ర పునరావృతం అయింది. రెండుసంవత్సరాల్లోనే అంటే 1536 వరకు ఇన్ కా రాజ్యం స్పానిష్ సైనికుల చేతిల్లో చిక్కింది. ఇదే విధంగా ఒకదాని తర్వాత మరొక గిరిజన రాజ్యాలన్నిటిని స్పెయిన్ కబళించింది.

కానీ 1618లో అనూహ్యంగా ఒక సంఘటన జరిగింది. స్పెయిన్ నుండి ఒక సైనిక బృందం 8లో 'అపేచీ' అనే గిరిజన రాజ్యానికి చేరుకుంది. అక్కడ కూడా ఆ రాజ్యాధినేతను చంపేశారు ఆ తెగల వద్ద దోచుకునే స్థాయిలో పెద్దగా ధనసంపదలు లేవు. అందువల్ల స్పానిష్ ప్రజలు వాళ్లను మతాంతరీకరణ చేసి పంట పొలాల్లో పని చేయించడం ప్రారంభించారు. కానీ నెమ్మది నెమ్మదిగా వారికి అర్ధమైందేమంటే అక్కడి రాజ్యాధినేతను చంపినప్పట నుండి స్థానిక సమాజంలో వ్యతిరేకత నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మిగతా రాజ్యాలు రెండు, మూడు ఏళ్లలోనే వాళ్ల వశమయ్యేవి. కానీ అపేచీలో అలాంటి పరిస్థితి లేదు.  200 ఏళ్లు సంఘర్షణ జరిగింది చివరకు స్పానిష్ సైన్యం అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయింది.

    ఈ వృత్తాంతం వివరిస్తూ ఆచార్య నేవిన్ ఇలా రాసారు, అజ్టెక్, ఇన్ కా ఈ రెండు రాజ్యాలతో పోలిస్తే అపేచీ వద్ద ఉన్న సైన్యం బలమైందేమి కాదు అలాగే రెండు రాజ్యాలను ఆక్రమించిన సైన్యాలతో పోలిస్తే ఈ స్పానిష్ సైన్యం కూడా బలహీనమైందేమి కాదు. కానీ ఇది ఎలా జరిగింది? అని ప్రశ్నిస్తూ ఆయన ఇంకా ఇలా అన్నారు. 

ఈ గిరిజన సమాజ నిర్మాణం రాజ్యం ఆధారంగా జరగలేదు (They were differently organised) ఆక్కడి సామాజిక శక్తులన్నీ ఒక రాజ్యాధినేత నియంత్రణలో లేవు సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక వ్యవస్థ ఉంది అది రాజ్యాధికారం పరిధిలో కాకుండా స్వతంత్రంగా నిర్వహించుకునేవి, అందువల్లే రాజులు పరాజయం పాలైనప్పటికి సమాజం ఓటమిని అంగీకరించలేదు. పైగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ విధమైన సమాజ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అవసరం.

కనుకనే డాక్టర్ అంబేడ్కర్ "ఏదైనా రాజకీయ విప్లవం కంటే ముందు ఆ దేశ మనస్సు, ఆత్మలను మేల్కోల్బడం అవసరం" అని అన్నారు.  స్వామి వివేకానంద "మనమంతా ఒకే దేశవాసులుగా ఐక్యంకావాలని” పిలుపునిచ్చారనేది గుర్తించుకోవాలి.

సమాజాధిపతి, సమాజ నాయకుని ద్వారా స్వదేశీ సమాజ నిర్మాణం చేయాలి. దాన్ని కొనసాగించాలి.  ఇది ఎంతో మహత్తరమైన (Vitally Important) మౌలిక కార్యంగా భావించాలి. స్వాతంత్య్ర సాధన కోసం ఇలాంటి కార్యక్రమం అవసరమని, అది తప్పనిసరి అని భావించడం వల్లనే డాక్టర్ హెడ్డేవార్ సమస్త సమాజాన్ని ఒకే దేశవాసులుగా జాగృతం చేసేందుకు, క్రియాశీలం చేసేందుకు, సంపూర్ణ సమాజంలో ఐకమత్యం తీసుకోచ్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ప్రారంభించడాన్ని గొప్ప విషయంగా అర్థం చేసుకోవాలి. కనుకనే డాక్టర్ హెడ్డేవార్ ఒక మహాద్రష్ట, నైపుణ్యం కలిగిన సమాజ నిర్మాతగా అందరికి చిరపరిచితులు.

వ్యాసకర్త : ఆర్ఎస్ఎస్ సహసర్ కార్యవాహ - డా. మన్మోహన్ వైద్య

26, ఏప్రిల్ 2020, ఆదివారం

స్వావలంబనే భవ్యభారతానికి ఆధారం – డా. మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ - Swavalabane Bhavya Bhaaratavaniki Aadhsram - Dr. Mohan Bhagwat‘130 కోట్ల మంది భారతీయులందరూ మనవారేననే స్నేహ, ప్రేమ, గౌరవపూర్వక భావంతో కరోన బాధితులకు సేవ చేద్దాం. భయం, క్రోధం వంటి అవలక్షణాలకు లోనుకాకుండా అందరితో కలిసి, అందరి కోసం పనిచేయడమే నేటి ఆవశ్యకత’ అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. 

కరోన మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు, వాటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా స్వావలంబన, స్వదేశీ విధానాన్ని అవలంబించి నూతన భారతాన్ని నిర్మించుకోవాలని ఆయన దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అటువంటి భారతదేశం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. దేశప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ఆన్ లైన్  ప్రసార మాధ్యమాల 26-ఏప్రిల్ నాడు ప్రసంగించారు.

కరోన వైరస్ వ్యాప్తి మూలంగా సంఘ నిత్య కార్యక్రమాలు జరగకపోయినా స్వయంసేవకులు పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కీర్తిప్రతిష్టలు ఆశించకుండా, ఎలాంటి స్వార్ధం లేకుండా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఈ సేవాకార్యక్రమాల ఉద్దేశ్యం. అలాగే అలసిపోకుండా, నిరంతరంగా సేవ చేయడానికి స్వయంసేవకులు సంసిద్ధులై ఉంటారు. తన పర భేదం లేకుండా బాధితులందరిని ఆదుకోవడం భారతీయుల తత్వమని, అందుకే మన దేశం ఎగుమతి ఆంక్షలను పక్కన పెట్టి అన్నీ దేశాలకు అత్యవసర మందులు పంపిందని డా. మోహన్ భాగవత్ అన్నారు.

ఆలస్యం చేయకుండా, తగిన సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్లనే కరోనా వ్యాప్తిని సమర్ధంగా అరికట్టగలిగామని, ప్రజలు కూడా సకారాత్మక దృష్టితో, క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని ఆయన అన్నారు. నకారాత్మక దృక్పధం, కొందరికి కీడు చేయాలనే ఆలోచన వల్లనే ఈ వైరస్ వ్యాప్తి జరిగిందని, ఇటువంటి ఆలోచనకు అందరూ దూరంగా ఉండాలని అన్నారు. `భారత్ తెరే తుక్దే హోంగే’ అంటూ స్వార్ధప్రయోజనాలకోసం కలతలు రేపేవారు, సమాజంలో భయాన్ని, క్రోధాన్ని పెంచేవాళ్లు ఎప్పుడు ఉంటారని వారి వల్ల ప్రభావితం కాకుండా మనం మన పని చేసుకుపోవాలని ఉద్బోధించారు. మహారాష్ట్రలో సమాజహితం కోసం జీవించే ఇద్దరు సాధువుల హత్యను అంతా ఖండించవలసిందేనని, అయితే ఇలాంటి సంఘటనలు మనలో భయాన్నిగాని, క్రోధాన్నిగాని కలిగించకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ రెండు స్థితుల్లోనూ మనం సంతులనం కోల్పోయి తప్పులు చేసే అవకాశం ఎక్కువని, అలా మన చేత తప్పులు చేయించి వాటిని తమ స్వార్ధం కోసం వాడుకోవాలనుకునే శక్తులు చాలా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు మనకు అనేక పాఠాలు కూడా నేర్పాయని, వాటిని గుర్తుపెట్టుకుని మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోవాలని డా. మోహన్ భాగవత్ సూచించారు. స్వావలంబన, స్వదేశీ విధానాలు మనకు అత్యవసరమని ఈ కష్టకాలం మనకు చెప్పిందని, కనుక నీరు, గాలి, మట్టిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, గో ఆధారిత వ్యవసాయాన్ని పెంపొందించడం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలని అన్నారు. దేశభక్తి అంటే ఇదేనని సోదరి నివేదిత వంటివారు చెప్పారని నాగరికమైన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకుని మనం భావ్యమైన భారతాన్ని నిర్మించుకోవాలని డా. మోహన్ భాగవత్ తన ప్రసంగాన్ని ముగించారు.మూలము: విశ్వ సంవాద కేంద్రము

19, ఏప్రిల్ 2020, ఆదివారం

బెంగాలీ బ్రాహ్మణుడు విప్లవ యోధుడు "ఉలస్కర్దత్త" - The Revolutionary Brahmin Bomb Maker Ullaskar Dutta. #VandeMataram #వందేమాతరం


బెంగాలీ బ్రాహ్మణుడు విప్లవ యోధుడు "ఉలస్కర్దత్త" - The Revolutionary Brahmin Bomb Maker Ullaskar Dutta. #VandeMataram #వందేమాతరం
బెంగాల్ విప్లవ యోధుడు బాంబ్ తయారు చేయడం లో దిట్ట ఐన బెంగాలీ బ్రాహ్మణుడు. ఆయన జయంతి రోజున అలాంటి ఎప్పుడో మర్చిపోయిన మన హీరో ను గుర్తుచేసుకుందామ్.

స్వాతంత్య్ర సమర యోధుడు "ఉల్లాసకర్ దత్తా", 1885 ఏప్రిల్ 16 న జన్మించి 1965 మే 17 న అస్తమించిన మహనీయుడు)ఒక మధ్య తరగతి బైధ్య బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన తండ్రి గారు ద్విజదాస్ దత్త ఒక వ్యవసాయ డిగ్రీ, లండన్ లో పట్టా పొందిన వ్యక్తి.

1903 లో ప్రవేశ పరీక్ష పూర్తి కాగానే,ప్రెసిడెన్సీ కాలేజ్, కోల్కత్త లో అడ్మిషన్ తీసుకున్నాడు,ఏమైతేనేమీ ఆయనను కాలేజీ నుండి ప్రొఫెసర్ రస్సెల్ ను బెంగాలీలను అసభ్యం గా మాట్లాడినందుకు కొట్టాడాని తీసివేయడం జరిగింది.ఈ చర్యను చూసి అర్థం చేసుకొని ఆయన అనుశిలన్ సమితి కో చేరి తరువాత జుగంటర్ పార్టీ లో చేరి బాంబ్ లు తయారు చేయడం లో సిద్ధహస్తుడు అయ్యాడు.ఖుదిరాం బోస్ గారు వాడిన బాంబ్ ఉలస్కర్ తయారు చేసిందే కావడం గమనార్హం.
అండమాన్ సెల్యులార్ జైలు
అండమాన్ సెల్యులార్ జైలు
ఏదైతేనేం పోలీస్ లు ఎంతో మందిని జుగంధర్ గ్రూప్ సభ్యులను పట్టుకున్నారు,అందులో ఉలస్కర్ తో సహా భరింద్ర ఘోష్, ఖుదిరామ్ లు కూడా పట్టుబడ్డారు.బర్లిన్ ఘోష్ గార్డెన్ నుండి అదుపులోకి తీసుకున్న 37 మంది అలిపోర్ బాంబ్ కేస్ కు సంబందించిన వాళ్లే కావడం గమనార్హం.ఉల్లస్కర్ 2 మే ,1908 లో అరెస్ట్ అయ్యాడు,1909 లో ఆయనకు ఉరిశిక్ష ఖరారు అయింది. తరువాత, అప్పీల్ చేసుకుంటే దానిని జీవితఖైదు గా మార్చేసి అండమాన్ సెల్యులార్ జైల్ లో ఉంచారు. (సరిగ్గా చదవండి, అప్పీల్ కు వెళ్ళింది అందరి విషయం లో , ఒక వీర్ సావర్కర్ గురించే కాదు)

భయంకర శిక్షలతో టార్చర్ చేశారు ఆ జైల్ లోఅధి ఎంతలా అంటే ఆయన మానాసికస్థితి తప్పిపోయేటంత గా టార్చర్ చేశారు.

తరువాత 1920 లో విడుదలయి కోల్కత్త కు తిరిగి వెళ్లిపోయారు.మళ్లీ 1931 లో తిరిగి అరెస్ట్ చేసి 18 నెలల కారాగార శిక్ష విధించారు.1947,బ్రిటీష్ వాళ్ళు.వెళ్ళిపోయాక తిరిగి విడుదల ఐ తన స్వగ్రామం అయిన కలికచ్చ కు వెళ్లిపోయారు.10 సంవత్సరాల ఒంటరి జీవితం తరువాత 72 ఏండ్ల వయసులో మళ్లీ కోల్కాతా కు వచ్చి ,బిపిన్ చంద్ర పాల్ కూతురు,తన చిన్ననాటి స్నేహితురాలు, విధవరాలు,పైగా శారీరక వికలాంగురాలు అయిన లీలా ను పెళ్లి చేసుకొని సిల్చర్ లో స్థిరపడ్డాడు.చివరగా 1965 మే 17 న కన్నుమూశారు.ఈయన ఎన్నో పుస్తకాలు ఆయన పడిన కష్టాల గురించి,అండమాన్ లో అనుభవాల గురించి రాశారు.అమర్ కరాజిబన్ (నా జైల్ జీవితం) 12 సంవత్సరాల తరువాత 1924 లో దీనిని ఇంగ్లీష్ లోకి అనువదించడం జరిగింది.

The Revolutionary Brahmin Bomb Maker of Bengal.
On his janma divas, a humble tribute for another long forgotten hero. Ullaskar Dutta (16 April 1885 – 17 May 1965) was born in present day Bangladesh for an affluent Baidya Brahmin family.

His father Dwijadas Dutta was a BrahmoSamaji & had an Agricultural Degree from University of London. After passing entrance examination in 1903, he took admission in the Presidency College, Kolkata. However, he was rusticated from the college for hitting his British
Professor Russell, for making derogatory comment about Bengalis.

Undeterred by this incident, Ullaskar joined Anushilan Samiti & later for Jugantar party and he became expert in bomb-making. Khudiram Bose used a bomb manufactured by Ullaskar in an attempt to murder the hideous magistrate, Kingsford.

However, police caught many members of the Jugantar group including Ullaskar Dutta, Barindra Ghosh and Khudiram. This case is known as The Alipore Bomb Case which saw the arrests of 37 Nationalists from Barin Ghosh's Garden

In the famous Alipore bomb case, Ullaskar was arrested on 2 May 1908 and he was sentenced to death by hanging in 1909. Later, on appeal, the verdict was reduced to transportation for life and he was deported to the Cellular Jail in Andaman.
(Read again, Appealing was done by
Image every nationalist, not just Veer Savarkar)
.
Ullaskar was subjected to brutal torture in the Cellular Jail and is said have lost his mental balance. He was set free in 1920 and he returned to Kolkata. Ullaskar was again arrested in 1931 and sentenced to 18 months imprisonment.

He returned to his home village Kalikachha when British left in 1947. After a lonely life of 10 years, at his 72nd year he returned to Kolkata in 1957, married his childhood friend Leela, the daughter of Bipin Chandra Pal at that time she was a physically challenged widow and settled at Silchar.

The legend Ullaskar Dutta attained Mukti on 17th May 1965. He wrote a book about his struggles and experience in Andamans Cellular Jail. Amar Karajiban (My Prison Life) (translated into English as Twelve Years of Prison Life in 1924).

అనువాదము: రేణుకా పరశురామ్

16, ఏప్రిల్ 2020, గురువారం

కరోనా వైరస్ లాక్ డౌన్ నేవథ్యంలో ప్రజాసేవకై అందరికంటే ముందు ఆర్.స్.స్ - Praja Sevalo RSS

కరోనా వైరస్ లాక్ డౌన్ నేవథ్యంలో ప్రజాసేవకై అందరికంటే ముందు ఆర్.స్.స్ - Praja Sevalo RSS
నసంక్షేమ సమితి, సేవాభారతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు, వివిధ అత్యవసర సమయాల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19) ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్  ప్రకటించిన నేవథ్యంలో ఎందరో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం, పోలీసుల సూచనలు, అనుమతులు పొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తలు పాటిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు బాధితుల సహాయార్థం హుటావుటిన రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో మున్సిపల్ అధికారుల సూచన మేరకు ముఖ్యమైన సేవలందించిన సిబ్బందికి గస్తీ చేసే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి మాస్కులు వితరణ చేసారు. రోజువారీ కూలీలకు ఆహారం అందచేశారు.

    ప్రకాశం జిల్లా గుడూరులో 30 యానాదుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. విజయవాడ, సింగ్ నగర్, ఉడాకాలనీలోని వృద్ధులు మాత్రమే ఉన్న 30 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు అందించారు. రాజమండ్రిలో ఆర్.స్.స్  కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆస్ఎస్ఎస్., సేవాఖారతి కార్యకర్తలు తమ సేవలను అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జన సంక్షేమ సమితి సేవాభారతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని కలిసి అన్ని రకాల సేవలకు తాము సిద్దంగా ఉన్నామని ఎటువంటి ప్రజావసరాలకైనా తమ సేవలను వినియోగించుకోవచ్చునని విజ్ఞప్తి చేశారు.

       దేశమంతా సంపూర్ణంగా లాక్ డౌన్ లో ఉన్న దరిమిలా రాబోవు రోజుల్లో వివిధ రకాల సేవా అవసరాలు రావచ్చు. స్వయంసేవకులు అవసరమైన వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసుల నియమాలు పాటి స్తూ సహాయ కార్యక్రమాలు చేయడానికి సన్నద్ధంగా ఉండాలని జన సంక్షేమ సమితి అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘచాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు కార్యకర్తలను కోరారు.
సేవా కార్యక్రమాలు
సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు:
 • గుంటూరు జిల్లా: సేవాభారతి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 500 మంది పేషెంట్లకు, వారి సహాయకులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంటున్న వృద్ధులకు ప్రతిరోజు 450 మందికి రెండు పూటల భోజనం అందిస్తున్నారు. అలాగే మిజోరాం నుండి వచ్చి గుంటూరులో చదువుకుంటున్న విద్యార్థులకు భోజన ప్యాకెట్స్ లను వితరణ చేశారు.
 • విశాఖపట్నం: సేవాభారతి ఆధ్వర్యంలో నిరాశ్రిత కుటుంబాలకు 800 మందికి భోజన వితరణ, సీతమ్మధారనగర్ హెచ్.బి.కాలనీలో భవన నిర్మాణ కార్మికులు, కంచరపాలెం నగర్, మర్రిపాలెం బస్తీలలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులను అందించారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు పోలీస్ యంత్రాంగానికి, ఆరోగ్య సిబ్బందికి 5000 మాస్కులు, 2000 శానిటైజర్లు అందజేశారు.
  సికింద్రాబాద్
  సికింద్రాబాద్
 • సికింద్రాబాద్: సేవాభారతి - తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో కరోనా క్రిమిసంహారక సొరంగం ఏప్రిల్ 13న ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ డా| శ్రావణ్ కుమార్, సీనియర్ డాక్టర్లు, సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
 • సరూరనగర్: మీర్ పేట కార్పోరేషన్లోని 500 పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామభారతి ప్రాంత అధ్యక్షులు స్తంభాద్రి రెడ్డి, సలహాదారు విశ్వమిత్ర, కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల అంజిరెడ్డి, దిల్సుఖ్నగర్ భాగ్ సేవాప్రముఖ్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
 • శంషాబాద్: సేవాభారతి ఆధ్వర్యంలో శంషాబాద్ నగరంలో 200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యకర్తలు కె. జనార్ధన్, కె. శ్రీనివాస్, టి. జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
 • హైదరాబాద్: కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పిలుపు మేరకు 'శంకర సేవా సమితి' తరఫున నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగ, సిబ్బందికి 2000 మాస్క్లు, 100 లీటర్ల శానిటైజర్ను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
 • ఇందూర్ జిల్లా: ఆర్మూర్ నగరంలోని ఏడు బస్తీలలో రేషన్ కార్డు లేని నిరుపేద 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు- పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ పోల్కం నారాయణ, నగర కార్యవాహ రుద్ర మధు తదితరులు పాల్గొన్నారు.
 • నల్గొండ జిల్లా: సేవాభారతి ఆధ్వర్యంలో హాలియా (అహల్య) గ్రామంలో 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖండ శారీరక ప్రముఖ్ బొమ్మపాల కోటేష్ సహా శారీరక ప్రముఖ్ కె.వెంకట్, భాజపా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నువెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 • జగిత్యాల జిల్లా: సేవాభారతి అర్వర్యంలో ఇ్రహీంపట్నం మండలం చేములకుర్తి గ్రామంలో 23 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు (బియ్యం, నూనె, వప్పులు) అందించారు. ఈ కార్యక్రమంలో వర్పంచ్, యం.వి.టి.సి, సేవాళారతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 • భాగ్యనగర్ : సేవాభారతి ఆధ్వర్యంలో బర్కత్పురా భాగ్లోని లింగాలగడ్డ, మాణికేశ్వర్నగర్, బతుకమ్మకుంట, డి.డి. కాలనీ, గోల్నాక, మధురానగర్ తిలకనగర్, శాంతినగర్, గంగాబౌలి, వినాయక్నగర్ 20 బస్తీలలో నిత్యావసర వస్తువులను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్ కార్యవాహ దిలీప్ సహని, సహకార్యవాహ శివాజీ, పురుషోత్తం, సంపర్క్ ప్రముఖ్ కస్తూరీ రంగన్, భాగ్ కార్యకారిణీ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మూలము: జాగృతి వారపత్రిక

4, ఏప్రిల్ 2020, శనివారం

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.స్.స్ పాత్ర - Swathantrya Udyamamlo RSS - Rashtriya Swayamsevak Sangh

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశేకార్యంలో ఆర్.ఎస్.ఎస్ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు.

1885లో కాంగ్రెస్ స్థాపన జరిగింది. అంటే ఆర్.ఎస్.ఎస్. 1925లో ప్రారంభంకావడానికి బాగా ముందే కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమపు నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఇ.వి రామస్వామి జస్టిస్ పార్టీ, అంబేడ్కర్ ఐఎల్ఫీ, ముస్లిం-లీగ్, కమ్యూనిస్ట్లు మొదలైనవారు కాంగ్రెస్తో అనేక విషయాలలో విభేదించినా ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్ కే  వదిలిపెట్టారు. బ్రిటిష్ వారితో నేరుగా తలపడితే తమ ఉద్యమం బలహీన పడుతుందనే భయం వీరిలో ఉండడం దీనికి కారణం కావచ్చును. అప్పటికే అనేక పార్టీలు, వాటిలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలను చూసిన డా. హెడ్జేవార్ మరో రాజకీయ పార్టీని ప్రారంభించాలనుకోలేదు. హిందూ సంఘటన లక్ష్యంగా ఆయన ఆర్.ఎస్.ఎస్ను ప్రారంభించారు. హిందూ సంఘటన వల్ల సాంస్కృతిక / భౌగోళిక ఐక్యత స్వాతంత్య్రం మొదలైనవి సాధ్యపడతాయని ఆయన విశ్వసించారు.

    హిందువుల ప్రయోజనాల కోసం పనిచేసే, పోరాడే (1921లో మోప్లా తిరుగుబాటు సందర్భంగా అనేకమంది హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఈ ఆలోచనకు దారితీసింది) సమూహం లేదా సంస్థ ఒకటి ఉండాలని డా. హెడ్డేవార్ భావించారు. కాంగ్రెస్ పై పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయి. బ్రిటిష్ వారి 'విభజించి పాలించు' వలలో కాంగ్రెస్ కూడా పడిపోయిందని అర్థమైంది. కాంగ్రెస్ సాగిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఆయన చేసిన హెచ్చరిక ఎంత సరైనదో ఈనాడు మనం ప్రత్యక్షంగా చాస్తూనే ఉన్నాం. సంతుష్టీకరణను వ్యతిరేకించిన డా. హెడ్డవార్ ముస్లిం వ్యతిరేకి మాత్రం కాదు. నిజానికి ముస్లిములు జాతీయ జీవన స్రవంతిలో కలిసి బ్రిటిషు వారిని వెళ్లగొట్టేందుకు హిందువులతో కలిసి పనిచేయాలని ఆయన కోరుకున్నారు.

   డా. హెడ్డేవార్ స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త. లోకమాన్య తిలక్ వంటి శ్రేష్ట నాయకులతో కలిసి చాలాకాలం పనిచేశారు. విప్లవ కార్యకలాపాలలో పాల్గొని 1921లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు కూడా. ఆ సందర్భంగా సాగిన కోర్టు విచారణలో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గురించి గట్టిగా వాదించడమే కాక తన చర్యలను సమర్థించు కున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. 1931లో జరిగిన అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన రెండవసారి జైలుకు వెళ్లారు. అలాగే ఉప్పు సత్యాగ్రహంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. కనుక ఆర్.ఎస్. ఎస్ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అసలు పాల్గొనలేదన్నది సత్యదూరమైన వాదన.

       నిజానికి డా. హెడ్జేవార్ స్వయంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.. అలాగే ఎప్పుడు స్వయం సేవకులు ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అందువల్ల సగానికి పైగా స్వయంసేవకులు స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కానీ సంఘ ప్రచారానికి దూరంగా ఉండడం వల్ల ఈ విషయం ఎక్కువగా ఎవరికి తెలియలేదు.

     ప్రారంభమైననాటి నుండి ఆర్.ఎస్.ఎస్. సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరుకుంటే కాంగ్రెస్ 44. ఏళ్ల తరువాత, అంటే 1944లో పూర్ణ స్వరాజ్య నినాదం చేసింది. (1920 నాగపూర్ కాంగ్రెస్స మావేశాలలోనే డా. హెడ్డవార్ సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ తీర్మానం ఆమోదించాలని ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ మాత్రం 10 ఏళ్ల తరువాత 1929లోగానీ ఆ పని చేయలేక పోయింది) 1929 లాహోర్ సమావేశాలలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించినప్పుడు స్వయంసేవకులంతా ఆ తీర్మానానికి మద్దతుగా ప్రతి శాఖలో కార్యక్రమం నిర్వహించాలని డా. హెడ్డవార్ పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే 26 జనవరి, 1930న శాఖలన్నిటిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

     తమ పాలనపట్ల ఆర్.ఎస్.ఎస్ కు ఉన్న వ్యతిరేకతను బ్రిటిష్ పాలకులు గుర్తించారు. తమ కార్యకర్తలను వివిధ ప్రభుత్వ విభాగాల (సైన్యం పోస్టల్, రైల్వే మొదలైనవి)లోకి పంపిన ఆర్.ఎస్.ఎస్ వాటిని తగిన సమయంలో పూర్తిగా తన చేతిలోకి తీసుకునే ప్రమాదం ఉందంటూ బ్రిటిష్ ప్రభుత్వంలో ఏకంగా ఒక ప్రకటన చేసింది.

     దేశ విభజన తరువాత ప్రజలకు సహాయ పడటంలో ఆర్.ఎస్. ఎస్ అద్వితీయమైన పాత్ర పోషించింది. విభజన సమయంలో కూడా పశ్చిమ పంజాబ్ నుండి హిందూ శరణార్డులను సురక్షితంగా తరలించడంలో ముందు ఉంది. పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వారికి ప్రాణాలకు తెగించి స్వయంసేవకులు రక్షణ కల్పించారు. ఆ తరువాత దాద్రా, నాగర్ హవేలి, గోవా వంటివి స్వతంత్ర భారతంలో విలీనం కావడంలో స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. హైదరబాద్ విమోచనోద్యమంలో వారి పాత్ర ప్రశంసనీయం.

     మన దేశంలో ఆర్.ఎస్.ఎస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు ఒకే సారి (1925లో) ప్రారంభమయ్యాయి. కానీ ఆర్.ఎస్.ఎస్ దేశ స్వతంత్రం కోసం హిందూ సమాజాన్ని సమాయత్తం చేయడానికి ప్రయత్నిస్తే, కమ్యూనిస్టులు మాత్రం బ్రిటిష్ వారికి మద్దతుగా, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా సంకీర్ణ సేనల పక్షంలో చేరనంత వరకు కమ్యూనిస్టులు బ్రిటన్, అమెరికాలను విమర్శించారు, వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే స్టాలిన్ సంకీర్ణ సేనల పక్షం చేరాలని నిర్ణయించుకున్నాడో ఇక్కడ కమ్యూనిస్టులు ప్లేటు ఫిరాయించారు. అప్పటివరకూ అమెరికా, బ్రిటన్లను సామ్రాజ్యవాద శక్తులు' అని తిట్టిపోసిన వాళ్లే ఆ తరువాత ఆ దేశాలను పొగడటం ప్రారంభించారు దేశ విభజన విషయంలో కూడా కమ్యూనిస్టులు ముస్లిం లీగ్ ను  సమర్థించారు, మద్దతునిచ్చారు.

కొస మెరుపు:
 • 1. కఠినమైన కారాగార శిక్ష అనుభవించిన స్వతంత్ర వీర సావర్కర్ తన 17 ఏటనే ( 1900లో) సంపూర్ణ స్వతంత్ర నినాదాన్ని ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు ఆయనను హిందుత్వవాదిగా ముద్ర వేసి దుష్ప్రచారం చేశారు.
 • 2. 1929 వరకు రాజ్య హోదాతో సంతోష పడిన తమ నాయకులు అనేకమంది (1880, 90 దశకాల్లో) బ్రిటిష్ పాలనను సమర్ధిస్తూ వచ్చారన్నది కాంగ్రెస్ వారు మరచి పోకూడదు.

రచన: రామ మూర్తి ప్రభల
మూలము: లోకహితం

భారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedithaభారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedita
నదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

స్వామీ వివేకానంద స్ఫూర్తి
1895 సంవత్సరంలో మార్గరెట్‌ జీవితం అసాధారణమైన మలుపుతిరిగింది. ఆమె స్నేహితు రాలు ఆమెకు ఒక భారతీయ సన్యాసిని పరిచయం చేయటానికి తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ సన్యాసి ఎవరో కాదు స్వామి వివేకానంద. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాశ్చాత్య జనుల హృదయాలను జయించిన ఆ యుగ పురుషుని వ్యక్తిత్వం, తేజస్సు, ఆయన వాక్కు ఆమెను ఆకట్టు కున్నాయి. ఆయన ఉపదేశాలు, ప్రవచనాలు ఆమె ఆత్మను మేలుకొలిపాయి. భారతదేశానికి సేవ చేసే విధంగా ప్రేరేపించాయి.

మహిళా విద్యకు ప్రాధాన్యత
భారతదేశ స్థితిని గురించి స్వామిజీ ఆమెతో ఇలా అన్నారు ‘మా మహిళలు విద్యావంతులయ్యే వరకూ మా దేశం ప్రగతి సాధించదు. మా దేశపు మహిళల విద్య, అభివృద్ధి కొరకు, వారిని ఆ పనిలో నిమగ్నం చేయటానికి నువ్వు నాకు సహాయం చేస్తావా’. తనపట్ల స్వామిజీకి ఉన్న విశ్వాసానికి ప్రభావితురాలై స్వామీజీ దేశమే తన దేశంగా భావించి భారతదేశానికి రావటానికి నిర్ణయించుకొని 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. ఆమెను స్వాగతించేందుకు స్వయంగా స్వామీజీ అక్కడికి వెళ్ళారు. త్వరలోనే ఆమె అక్కడ ప్రజలలో కలిసి పోయింది. బెంగాలీ భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసింది. స్వామీజీ శిష్యులు అమెరికా నుండి ఇద్దరు వచ్చారు. ముగ్గురూ కలసి ఒక తమ నివాసాన్నే ఆశ్రమంగా మార్చేశారు. వారికి స్వామిజీ స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. ”ఈ దేశాన్ని ప్రేమించండి. పూజించండి. ఇదే ప్రార్థన. ఇదే పూజ.” 1898 మార్చి 25న స్వామిజీ మార్గరెట్‌తో శివపూజ చేయించి ”నివేదిత” నామ కరణం చేశారు. నివేదిత అంటే నివేదించబడినది (సమర్పితమైనది) అని అర్ధం. ఆమెను భగవంతునికి తద్వారా భారతదేశానికి సమర్పించారు.

మహిళలకు, బాలికలకు విద్యనేర్పటానికి నివేదిత ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్ళి బాలికలను బడికి పంపవల సిందిగా ప్రజలను కోరింది. వారినుండి ఎంత ప్రతికూలత వచ్చినా, వారికి నచ్చజెప్పి కొందరి బాలికలకు వ్రాయటం, చదవ టమే కాకుండా చిత్రకళ, శిల్పకళ కూడా నేర్పింది. అలా తన నిస్వార్ధ సేవా, సహయాలతో కలకత్తా ప్రజల హృదయాలలో స్థానం పొందింది.

బాధితుల సేవలో
1899 మార్చిలో కలకత్తాలో ”ప్లేగ్‌” వ్యాధి వ్యాపించింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పో యారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే సంకల్పం తీసుకుని మురికి వాడలను శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఆమె సేవాకార్యక్రమాల ప్రభావంతో మిగతా మహిళలు కూడా ముందుకు వచ్చారు. శుభ్రపరచడమేకాక రోగగ్రస్తులకు సేవచేయటం కూడా ఆమె ఆచరణ ద్వారా నేర్పింది.

పాఠశాలకు నిధులు సమకూర్చేందుకు ఆమె యూరప్‌కు ప్రయాణమైంది. నిధులకోసమేకాక క్రైస్తవ మిషనరీలు పాశ్చాత్య దేశాలలో మనదేశం గురించి ప్రచారం చేసే అసత్యాలను ఖండించి ఇక్కడి మ¬న్నత సంస్కృతిని గూర్చి వారికి సరియైన అవగాహన కల్పించేందుకు కూడా ఆమె తన యాత్రను ఉపయోగించుకున్నారు.

జనజాగృతి…
1902లో స్వామిజీ మహాసమాధి చెందారు. అంతకుముందు మన దేశ స్వాతంత్రంకోసం సంఘర్షణ చేయాలనే మరో కార్యాన్ని కూడా ‘నివేదిత’కు అప్పగించారు. అలా ఆమె భారత స్వాతంత్య్ర సాధనే తన జీవన కార్యంగా స్వీకరిం చింది. దేశమంతా పర్యటించి ప్రజలను స్వతంత్ర పోరాటానికి సమాయత్తం చేసే విధంగా ప్రేరణ దాయకమైన ప్రసంగాలు చేసింది.
అలా ఆమె మానసిక బానిసత్వం నుండి బయటపడే విధంగా ప్రజలకు ప్రేరణ కల్గించింది.

రచన: రమేష్‌ చంద్ర
మూలము: సమాచార భారతి

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

పరమ పూజనీయ, గొప్ప దేశభక్తుడు "డాక్టర్. కె బి హెడ్గేవార్ - Sarsanghchalak of the Rashtriya Swayamsevak Sangh. Dr. K. B. Hedgewar

పరమ పూజనీయ, గొప్ప దేశభక్తుడు "డాక్టర్. కె బి హెడ్గేవార్ - Sarsanghchalak of the Rashtriya Swayamsevak Sangh. Dr. K. B. Hedgewar


రమ పూజనీయ డాక్టర్ జీ ఒక గొప్ప దేశభక్తుడు, భారతమాత సంతానంలో అగ్రగణ్యుడు. భావితరాలకు ఒక ఆదర్శమూర్తి గా వెలుగొందిన నాయకుడు. కళ్ళకు కనిపించే దృశ్యంను చూడడాన్ని దృష్టీ అంటారు. భవిష్యత్తులో జరగబొయ్యే దాన్ని ఊహించి పని ప్రారంభించే వారిని ద్రష్ట అంటారు. అలా డాక్టర్జీ భవిష్యత్తులో జరుగబొయే దానిని ఊహించిన గొప్పవారు అందుకే డాక్టర్ జీని యుగద్రష్ట అంటారు .
ఒక  వ్యక్తి గొప్పదనాన్ని ఎలా గుర్తించగలము అంటే ఆ వ్యక్తి జీవితం భావితరాల మీద ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో దానిని బట్టి ఆవ్యక్తి గొప్పతనాన్ని మనం గుర్తిస్ధాము.
జవహరలాల్ నెహ్రు, డాక్టర్ జీ ఒకే సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 1889 లో జన్మించారు. స్వతంత్రం వచ్చేనాటికి డాక్టర్జీ  జన్మించి లేరు కాని ఆ  సమయానికి పండిట్ జవహర్ లాల్  ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు వున్న నేత 1989 సంవత్సరం లో నెహ్రు, డాక్టర్ జి  జన్మశతాబ్ది ఉత్సవాలు జరిగాయి, నెహ్రు గారివి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించింది, డాక్టర్ జి జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవానిధి గా 1౦౦ కోట్ల నిధిని సేకరించడం జరిగింది, అదే విధంగా ఆ సమయానికి నెహ్రు సిద్ధతాలను కాని వారి అడుగు జాడలలో నడిచే వారి సంఖ్య బహుతక్కువ కాని డాక్టర్ జి ని ఆదర్శముగా తీసుకుని జీవించే వారి సంఖ్య కొన్ని వేల మంది వున్నారు, అందులో కొద్ది మందికి అసలు డాక్టర్ జి రూపం కూడా సరిగా తెలువదు కాని వారు స్థాపించిన సంఘ సిద్ధాంతం కోసం తమ జీవితాలను త్యాగం చేసేవారు కొన్ని వేలమంది వున్నారు. ఇది డాక్టర్ జి గొప్పతనం.  

డాక్టర్జీ తన వ్యక్తిత్వపు బలంతో సకారాత్మకంగా సమాజము మీద ప్రభావాన్ని చూపించిన వ్యక్తి అందుకే డాక్టర్జీ ప్రేరణతో తరువాత అనేక మంది డాక్టర్ జీ లు అయినారు. డాక్టర్జి ఒక వ్యక్తిగా కాకుండా ఒక తత్వచింతనకు ప్రతిరూపంగా, ఆదర్శమూర్తిగా నిలిచారు.

డాక్టర్ జి సామ్రాజ్యవాదంతో రాజీపడడం కాని, ఒప్పందం కుదూర్చోకొవడం కాని వాళ్ళ తో  మెత్తగా వ్యవహిరించడం గాని సహించేవారు కాదు వారు దానిని జాతీయవాదం పట్ల అన్యాయంగా భావించేవారు .

ప పూ డాక్టర్ జి చిన్న వయస్సు లోనే దేశం స్థితి గురుంచి ఆనాడు మన దేశ బానిసత్వం గూర్చి ఆలోచించేవారు స్కూల్ చదువుకునే వయస్సు లోనే డాక్టర్ జి బ్రిటిష్  వాళ్ళకు వ్యతిరేఖంగా పాఠశాలలో వందేమాతర  ఉద్యమాన్ని నిర్మాణం చేసారు. విక్టోరియా రాణి పట్టాభిషేక వజ్రోత్సవాల సందర్భంగా మిఠాయి తీసుకోకుకుండా విసిరి వేసాడు, ఆ వేడుకులను బహిరంగంగా వ్యతిరేఖించాడు.

డాక్టర్ జి ఎంబిబిఎస్ చదవడం కోసం కలకత్తా కు వెళ్ళాడు, ఆ రోజుల్లో కలకత్తా దేశానికి రాజధానిగా వుండేది. అదేవిధంగా అనేకమంది సామజిక సంస్కర్తలకు మరియు విప్లవకారులకు కలకత్తా ప్రముఖ యాత్రాస్థలంగా వుండేది అందుకే దేశభక్తి హృదయం కల డాక్టర్ జి సహజంగానే  చదువుకోసం అనే నెపం మీద
కలకత్తా మెడికల్ కాలేజి లో సీటు పొంది, తన భావిజీవితానికి కావాల్సిన పునాదిని ఏర్పరచుకున్నాడు. దీనిని బట్టి డాక్టర్ జి దూరదృష్టి ఎలా ఉండేదో మనం అర్ధం చేసుకోవచ్చు. స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న విప్లవసంస్థ అయిన అనుశీలనా సమితిలో సభ్యుడు అయ్యాడు, వాళ్ళతో పాటు విప్లవ కార్యకలాపాలలో పాలుపంచుకునే వాడు .

వైద్య విద్య అయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యకుండా తన జీవితాన్ని దేశం కోసం అకింతం చెయ్యాలనే సంకల్పం తీసుకున్నాడు. డాక్టర్ జి నాగపూర్ కు వచ్చిన తరువాత కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ రోజుల్లోనే డాక్టర్ జీ మధ్యపరగణాల ప్రాంతంలో కాంగ్రెస్ లో ఒక ముఖ్యమైన నాయకుడిగా పని చేశారు. గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ఉప్పు సత్యా గ్రహం చేసి  9 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. బిపిన్ చంద్ర అనే ప్రముఖ మార్కిస్టు చరిత్రకారుడు ‘కమ్యూనిజం ఇన్ ఇండియా’ అనే పుస్తకం పేజీ నం 332 లో రాయడం జరిగింది.

డాక్టర్ జీ ఒక వైపు స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొంటూనే అసలు ఈ దేశం ఎందుకు పరాధీనం అయినది, అసలు ఈ దేశ వారసులు ఎవరు? యజమానులు ఎవరు? అనే ఆలోచన వీరి మదిలో ప్రారంభం అయినది, బ్రిటిష్ వారు ఈ దేశం ఒక సత్రం లాంటిది ఇంతకుముందు అనేకమంది వచ్చారు ఇప్పుడు మేము వున్నాము రేపు వేరొకరు వస్తారు ,ఈ దేశం ఒక జాతి కాదు, బిన్న జాతు ల సముదాయం అనే వాదనను తెరపైకి తీసుకచ్చారు. ఒక రోజు  పుణె నగరం లో జరిగిన పెద్దల సమావేశం లో డాక్టర్ జీ ఇది హిందు దేశం అని గట్టిగా  చెప్పారు, ఈ దేశము లో ఒక్క హిందువు మిగిలి వున్నా సరే ఇది హిందు దేశం అని చెప్పారు. అసలు ఈ దేశ సమస్యలన్నిటికి కారణం హిందువులలో  సంఘటన లేకపోవడమే అని గ్రహించారు.

డాక్టర్ జీ 1915 – 1924 వరకు దేశం లో ప్రారంబించబడిన అనేక రకాలైన సాంఘీక సంస్కరణ సాంస్కృతిక పరివర్తనల ద్వార  హిందు సమాజాన్ని ధర్మాన్ని సంఘటితం చేసే ప్రయత్నాలు, వివిధ ఉద్యమాలను డాక్టర్ జీ నిశితంగా  పరిశీలించారు

ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న ముస్లిం సంతుస్టీకరణ కారణంగా ఆ రోజులలో వున్న హిందు సంస్థల దృష్టిలో హిందుత్వం అనేది అధిక జనాభా సంఖ్య కల వాళ్ళ రాజకీయ అంశంగా మారిపోయింది .బెంగాల్ కి చెందిన యు ఎన్ ముఖర్జీ అనే నాయకుడు హిందు సమాజం మృత్యు ముఖంలో వున్నా జాతి అని చెప్పారు. పంజాబ్ లో ఆర్య సమాజ నాయకుడు లాల్ చంద్ రాజకీయాలకు విముఖంగా ఉండడమే హిందువుల పతనానికి ముఖ్య కారణం అని అన్నారు. హిందువులలో చైతన్యాన్ని రగిల్చే ప్రయత్నాలలో  ఉన్నటువంటి ఆ నాటి నాయకులు మాలవ్య, భాయి పరమానంద, డాక్టర్ ముంజే , సావర్కర్ లాంటి వారు ముస్లింల నుండి ఎదురయ్యే ప్రతిఘటన ఆధారంగా హిందువులో అభద్రత భావం వలన హిందువులు  ఒక రాజకీయ శక్తి గా తయారు కావాలనే ఆలోచన చేసారు. కానీ డాక్టర్జీ దృష్టి చాలా విశాలంగా వుండేది హిందు సమాజంలో వున్నమౌలిక లోపాలయిన అస్ప్రుశ్యత, కులాల మధ్య ఉచ్చ నీచ  బేధాలు, సంఘటన లేకపోవడం, వ్యక్తివాదంల వంటి మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. అప్పుడు భారతదేశ జనాభా 35 కోట్ల మంది జనాభాలో 25 కోట్ల మంది హిందువులు మిగిలిన 10 కోట్ల మంది ఒకప్పుడు హిందువులే కదా, ఎందుకు వీరు మన నుండి విడిపొయ్యారు అని డాక్టర్ జీ ఆలోచించారు. 

హిందు సమాజ బలం ఈ బలహీనత ల మీదనే ఆధారపడి వున్నది, అందుకే డాక్టర్ జీ ఈ లోపాలని సరిచేస్తే గాని ఈ దేశం శక్తి వంతం కాదు అని గ్రహించారు. ఒక జాతి బలం మీదనే ఆధారపడి ఆ జాతి నాగరికత కాల ప్రవాహం లో సుదీర్గంగా నిలబడుతుంది. డాక్టర్జి ఈ లోపాలను సరిచేసి ఒక సంఘటితమైన సమాజాన్నినిర్మించాలని ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు

డాక్టర్ జీ హిందు రాష్టం అనే కల్పనను ఏదో కొత్త గా తీసుక రాలేదు మన ప్రాచీన కాల చారిత్రక చైతన్యాన్ని సంస్కృతి రూపంలో ప్రసరింప చేసేదే  హిందూరాష్ట్రం అని అన్నారు. జాతి పునర్జీవనానికి ఆధారం హిందు సంఘటన అందుకే హిందువులను సంఘటితం చెయ్యడం రాష్ట్ర కార్యం, దీనిని డాక్టర్ జీ కొత్తగా  తయారు చేసాను అని చెప్పలేదు. డాక్టర్ జీ హిందూ సంఘటన కు ఆధారంగా వ్యక్తిని ఆధారంగా గ్రహించారు ప్రతి హిందువు లో వ్యక్తి గత, జాతీయశీలాలను, అనుశాసనాన్నినిర్మాణం చెయ్యడం ద్వారం వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణ కార్యంను  ప్రారంభం చేశారు.

డాక్టర్ జీ సంఘ నిర్మాణం లో చాలా సూక్ష్మ దృష్టి తో చేసారు, ఆనాడు డాక్టర్ జీ మధ్య పరగణాల ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడు. తాను పిలిస్తే అనేకమంది ప్రతిష్టిత వ్యక్తు లు ఆర్ఎస్ఎస్ శాఖ లో చేరుతారు కాని వాళ్ళు అందరు ఎదో ఒక సిద్ధాంతంతో ప్రభావితం అయిన వారు అందుకే డాక్టర్ జీ కిషోర వయుస్కులు అయిన వారితో  శాఖను ప్రారంబించారు. అనేక మంది ప్రతిష్టిత వ్యక్తులు అందరికి శాఖను దగ్గరిగా చూపించేవారు. గాంధీజి ని 1934 లో వార్ధలో జరిగిన సంఘ శిబిరానికి వారిని తీసుకవచ్చారు, శిబిరంలో ఉన్న క్రమశిక్షణను, నిరాడంభారతను, సమానత్వంను చూసి ముగ్ధుడు అయ్యారు. ఈ విషయాన్ని 13 సంవత్సరాల తరువాత 16 సెప్టెంబర్ 1947 లో ఢిల్లీలో ని ఒక భంగి కాలనీలో జరిగిన సమావేశంలో సంఘ శిబిరంలో ఉన్న క్రమశిక్షణను, నిరాడంబరతను, సమానత్వంను ప్రశసింస్తూ మాట్లాడారు.

డాక్టర్ జీ శాఖకి రావడం, కార్యక్రమాలలో పాల్గొనడం స్వేచ్చతో జరగాలి అని ఒక సంస్థ నిర్మాణంలో వుండే సభ్యత్వం, రుసుం తీసుకోవడంలాంటి వాటిని ఆర్ఎస్ఎస్ లో ప్రవేశ పెట్టలేదు. సంఘంలో ఒక కుటుంబాన్ని పోలిన వాతావరణాన్ని నెలకొల్పారు. వ్యక్తి వాదంకు తావు లేకుండా సంఘంలో గురువుగా భగవధ్వజాన్ని పెట్టడం జరిగింది, అందుకే డాక్టర్ జి పరమపదించిన  తరువాత కూడా సంఘం  అవిచ్చిన్నం గా కొనసాగుతూ వస్తుంది. డాక్టర్ జి పరమపదించన తరువాత కూడా సంఘం ఇంకా ధృడంగా  ఎదుగుతుందని ఆనాటి మరాఠా ఆంగ్ల దినపత్రిక లో ప్రముఖ శీర్షికగా ప్రచురించారు.

సంఘంలో నేడు రూపు దిద్దుకున్న కార్యపద్దతి ,సంస్థాగతంగా నిర్మాణం అంతా డాక్టర్జీ కల్పన ఆధారంగా జరిగిందే. నేడు  సంఘ ప్రేరణతో నడుస్తున్న అనేక సంస్థల పనిని డాక్టర్ జి బీజరూపం లో తన జీవితంలో ఎదో ఒక సందర్బంగా చేసినవే. డాక్టర్ జి ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడు దామోదర్ నదికి  వరదలు  వచ్చి అక్కడి ప్రజా జీవితం అతలాకుతలం ఐతే డాక్టర్ జీ తన మిత్ర బృందం తో కలిసి వాళ్లందరికీ మందులు, ఆహారం అందించారు. నేడు దేశం లో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే స్వయంసేవకులు అక్కడికి వెళ్లి సేవలు అందిస్తుంటారు.

డాక్టర్ జీ 1922 లో నాగపూర్ లో ఒక ఆనాద విద్యా గృహాన్ని స్థాపించినారు అందులో అన్ని కులాలనుండి విద్యార్థులు ఉండేవారు. నేడు స్వయంసేవకులు డాక్టర్జీ ప్రేరణతో దేశంలో అనేక అనాధ విద్యాలయ గృహాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ జీ 1932 అక్టోబర్ 23న పూణా లో ఉన్న న్యూ ఇంగ్లీష్ స్కూల్ లో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆ రోజు విద్యార్థులకు అస్ప్రుశ్యత తొలగించాలి అని పిలుపునిచ్చారు.డాక్టర్ జీ అస్ప్రుశ్యత కులబేదాల సమస్యలపై డాక్టర్జీ ఏనాడు రాజీపడలేదు వారు ఒక గొప్ప సమగ్రతావాది.
డాక్టర్ జీ మన సంస్కృతిలో ఉన్న ఉదాత్తమైన భావనలను తీసుకుని హిందూత్వ ఆలోచనలను ముందుపెడుతు సమాజంలో ఉన్న మూఢాచారాలను తొలగించడం కోసం కృషి చేసారు.
సంఘం ఈ రోజు దేశంలోనే కాదు, అనేక దేశాలలో ఉన్న హిందువులను సంఘటితం చెయ్యడం కొరకు పని చేస్తోంది. అక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతుంది. నేడు దేశంలో సంఘం ఒక నిర్ణయాత్మక శక్తి గా ఉంది. డాక్టర్ జీ ఆ రోజుల్లో ఏ ఆలోచనతో పనిని ప్రారంభంచేశారో ఆ ఆలోచనతో, అదేప్రేరణతో నేడు లక్షలాది మంది డాక్టర్జీలు దేశం అంతటా పని చేస్తున్నారు, నేడు దేశంలో ఒక లక్షా యాబై వేలకు పైగా సేవా కార్యక్రమాలు స్వయంసేవకుల ద్వారా జరుగుతున్నాయి. సేవాఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ప్రంపంచవ్యాప్తంగా సేవల కార్యక్రమాలు జరుగుతున్నాయి .సంపూర్ణ సమాజ పరివర్తన ఏదైతే ఉందొ ఆ దిశ లో సంఘం చేస్తున్న ప్రయత్నం ముందుకు వెళ్తుంది. ఇంకా కొద్ది సంవత్సరాలలో డాక్టర్ జీ కన్నకలల సాకారాన్ని చూడబోతున్నాము.

Reference Books
1. Doctorji -The Epoch Maker by Rakesh Sinha.
2 .Communism In India by Bipin Chandra.
3. Gandhiji Collected works.
4. 17th September 1947 Hindu paper

సంకలనం: - కట్టా రాజగోపాల్
మూలము: విశ్వ సంవాద కేంద్ర