నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, September 27, 2020

నిందితుల మతం ఆధారాంగా ప్రాసిక్యూషన్ ఎలా ఉపసంహరించుకుంటారు?: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖలు - Withdrawing prosecution based on religion highly objectionable: High Court

తం ఆధారంగా ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన పిల్ పై చేసిన విచారణ సమయంలో స్పష్టం చేసింది.

మే 2018 లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కొందరు ముస్లిం యువత దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు నమోదైన 6 ఎఫ్ఐఆర్ లపై విచారణ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 12న జీవో జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ  లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థకి చెందిన సభ్యుడు పసుపులేటి గణేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం  దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఈ జీవోపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హోం శాఖ జారీ చేసిన జీవో 776 ను సవాలు చేస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది జె.వి ఫణిదత్ చాణక్య తన వాదనలు వినిపించారు. పోలీస్ స్టేషన్ పై చేసిన దాడి ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడమే అని, మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముస్లిం యువకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై రెండు వేల మందికి పైగా ముస్లిం యువకులు దాడి చేశారని, ఆయుధాలను ఉపయోగించడంతో పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, ప్రజల అసౌకర్యానికి కారణమైయ్యారని న్యాయవాది వివరించారు.

 ప్రభుత్వం జారీ చేసిన జీవో ను పరిశీలించిన ధర్మాసనం అందులో “ముస్లిం యూత్” అని ఉండటాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. సామాజిక వర్గం వివరాలను జీవోలో పేర్కొనడం రాజ్యాంగ పీఠికకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఆ జీవో ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం ఇచ్చినట్టు లేదని కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు జారీ చేసినట్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓట్లు పొందే ఉద్దేశంతో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించడానికి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. హోం శాఖ జారీ చేసిన 776 ను రద్దు చేసింది. ఎఫ్ఐఆర్ ల విషయంలో యథాతథ స్థితిని పాటించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ, గుంటూరు ఎస్పీ, పాత గుంటూరు ఎస్ హెచ్ వో లకు నోటీసులు జారీ చేసింది. వాజ్యంలో ఇప్పటికే సీబీఐ ప్రతివాదిగా ఉండగా, జాతీయ దర్యాప్తు సంస్థను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కు మౌలికంగా సూచించింది. విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్, జస్టిస్ ఉమా దేవి లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

soure : HansIndia
అనువాదము: విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »