మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించిన ABVP

0
మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించిన ABVP
విజయనగరంలోని మహారాజా కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయనగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు.

వివరాలివీ….

విజయనగరం లోని మహారాజా ఎయిడెడ్ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.  1879లో మహారాజా ఉన్నత పాఠశాలగా దీనిని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఎయిడెడ్ విభాగంలో 26 మంది,  అన్ ఎయిడెడ్ లో 100 మంది అధ్యాపకులు ఉన్నారు. బోధనేతర సిబ్బందిలో పదిమంది  ఎయిడెడ్,  25 మంది అన్ ఎయిడెడ్ సిబ్బంది ఉన్నారు. సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థలో విద్యార్జన చేస్తున్నారు. UGC  నిధులతోనే విద్యా సంస్థకు మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల నిర్వహణ సాగుతోంది.

ప్రైవేటీకరణ యత్నాలు
అయితే ప్రస్తుతం ఈ కళాశాలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మన్సాస్ యాజమాన్యం ప్రభుత్వానికి అభ్యర్థన కూడా పంపింది. మన్సాస్ కమిటీ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా ఆదేశిస్తూ ప్రాంతీయ సంయుక్త సంచాలకునికి (ఆర్జేడీ)  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ ఎం ఎం నాయక్ లేఖ వ్రాశారు కూడా. విద్యాసంస్థను ప్రైవేటీకరిస్తే  తమకు రక్షణ లేకుండా పోతుందని విద్యా సంస్థలో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ABVP ఉద్యమం….

ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిఉండి, వేలాది మందికి విద్యా భిక్ష పెట్టిన విద్యా సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ABVP తీవ్రంగా ఖండిస్తోంది. మహారాజా ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటీకరిస్తే అటు సిబ్బందితో పాటు ఇటు విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారమైపోతుందని, మన్సాస్ కమిటీ, ప్రభుత్వము వెన్వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమాలలో భాగంగా ABVP కార్యకర్తలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఇంటిని ముట్టడించారు.

__విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top