నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

19, అక్టోబర్ 2020, సోమవారం

పాడి రైతులకు ఆర్ధిక చేయూత: దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు - Financial assistance to dairy farmers by cow dung diyas

పాడి రైతులకు ఆర్ధిక చేయూత: దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు 

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 'రాష్ట్రీయ కామధేను ఆయోగ్'‌ ఒక వినూత్ నకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 
     ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశ వ్యాప్తంగా ఈవిధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయదియా’గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పాడి రైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారు చేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయకామధేనుఆయోగ్‌ ‌పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని, గోసంతతి వృద్ధితోపాటు వాటిపై ఆధారపడేవారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా 'రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌' ‌లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్‌ ‌కటారియా పేర్కొన్నారు.
« PREV
NEXT »