తులసితో ఆరోగ్యం పదిలం - Health Benefits of Holy Basil - Tulasi

0
తులసితో ఆరోగ్యం పదిలం - Health Benefits of Holy Basil - Tulasi
తులసితో స్వదేశి చికిత్స

తులసి - ( Holy Basil ):
హిందూ ధర్మంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి , పూజా విధానాలు ఉన్నాయి . తులసి తీర్ధం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్ధానాన్ని కల్గి ఉంది. దీనిని సర్వరోగ నివారణిగా భావిస్తారు. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేధంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడు తున్నది. తులసిని చాలా గృహ చికిత్సలలో కూడా వాడుతారు. తులసిలో ముదురు రంగులో  ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండే జాతిని రామ తులసి అనీ అంటారు.

తులసిని వాడే విధానము..
ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం 1 spoon  త్రాగవలెను. 10 - 15 కృష్ణ తులసి ఆకులను మెత్తగారుబ్బి , రసం తీయవలెను , కొద్దిగా వేడి చేసి + బెల్లం లేక తేనెను కలిపి 1 spoon మోతాదులో తీసుకొనవలెను. ( లేదా ) 15 - 20 కృష్ణ తులసి ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి ,1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి + బెల్లంని కలిపి త్రాగవలెను .

ఫలితములు:
  • 1. Typhoid Fever , Viral Fever , Bacterial Fever  మరియు ఎటువంటి జ్వరమైన తగ్గిపోవును . 
  • 2. స్త్రీ లలో వచ్చు leucorrhea ( white discharge ) తగ్గిపోవును. 
  • (బెల్లం బదులు కండ చెక్కరను కలిపి తీసుకొనవలెను ).
  • 3. వృద్దులలో వచ్ఛు బహుమూత్ర రోగం , కొద్ది , కొద్దిగా వచ్చు మూత్ర రోగాలు తగ్గిపోవును . 
  • 4 . స్త్రీలకు నెలసరిలో వచ్ఛే అధిక ఋతుస్రావంని అరికట్టుతుంది . 
  • 5 . పిల్లల కడుపులో వుండే నులి పురుగులు తొలగిపోవును .
  • చుండ్రు నివారణకు:
  • కృష్ణ తులసి ఆకుల రసంని తల ( Scalp ) కు పట్టించి , 1 గంట తర్వాత తలస్నానం చేయవలెను. 
  • శరీరంపై పుండ్లు, మచ్చల నివారణకు:
  • శరీరంలో వ్రణం ఎక్కడైనా వున్నయెడల కృష్ణ తులసి ఆకుల పేష్ట్ ను పూయవలెను .  త్వరలో తగ్గిపోవును.
గమనిక:
పైనుదహనించిన చికిత్స విధానాలు మనిషి అవగాహన కొరకే, మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top