నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

20, అక్టోబర్ 2020, మంగళవారం

మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్‌ - Two teachers suspended for trying to convert kids

చదువు పేరుతో విద్యార్థులను క్రైసవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసిన ఘటన తమిళనాడులోని కందంపాలయం లో జరిగింది.  

వివరాల్లోకెళ్తే కందంపాలయం పంచాయతీ పరిధిలోని సెల్లతపాలయం గ్రామంలో ఉన్న యూనియన్‌ ప్రమెరీ పాఠశాలకు చెందిన హెడ్మాస్టార్‌ అరుల్మణి, ఉపాధ్యాయురాలు శరణ్య విద్యార్థులను పాఠశాలకు పిలిపించి వారికి క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను పంపిణీ చేశారు. 
       విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో మత ప్రచారానికి సంబంధించిన సామగ్రిని కూడా తల్లిదండ్రులు కనుగొన్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని స్థానిక బీజేపీ నాయకుడు సుందర నారాయణన్‌ కలెక్టర్‌ సి కాతిరవన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు విచారణ చేపట్టి విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం జరిగినట్లు ప్రాధమికంగా తేల్చారు.  హెడ్మాస్టార్‌ అరుల్మణి, ఉపాధ్యాయురాలు శరణ్య లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాథెసన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Source : TOI - విశ్వ సంవాద కేంద్రము 
« PREV
NEXT »