నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

10, అక్టోబర్ 2020, శనివారం

అవును నేను హిందూవాదిని, సనాతన ధర్మ సైనికుడిని: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్ -చీఫ్ అర్నాబ్ గోస్వామి - I am a true soldier of Sanatana Dharma,’ Arnab Goswami

అవును నేను హిందూవాదిని, సనాతన ధర్మ సైనికుడిని: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్ -చీఫ్ అర్నాబ్ గోస్వామి - I am a true soldier of Sanatana Dharma,’ Arnab Goswami
రిపబ్లిక్ భారత్‌ టీవీ ఛానెల్లో గురువారం జరిగిన ‘పుచ్తా హై భారత్’ ప్రత్యక్ష ప్రసారంలో రిపబ్లిక్ టీవీ అధినేత, జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి మాట్లాడూతూ శివసేన, కాంగ్రెస్ పార్టీ, ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్‌ తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్టున్నారని, ఇలాంటి హిందూ జాతి వ్యతిరేక రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలని ఆయన దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

భావోద్వేగతో కూడిన విజ్ఞప్తితో అర్నాబ్ గోస్వామి ప్రసంగంలో, తాను కష్టపడి దేశంకోసంకోసం  పనిచేస్తున్నానని, జాతీయవాదం కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అయితే ఇప్పుడు దేశ ప్రజల మద్దతు తనకు అవసరమని అన్నారు.

"ఈ ఏడాదిలో, జరిగిన షాహీన్ బాగ్ మరియు షార్జీల్ ఇమామ్ల యొక్క కుట్రను బహిర్గతం చేసాము .. పాల్ఘర్ వద్ద సాధువులను దారుణంగా హత్య చేసినప్పుడు, పోలీసులు సాధువులను చంపడానికి అనుమతించినప్పుడు, మేము వారిని ప్రశ్నించాము మరియు మేము వారిని ప్రశ్నిస్తూనే ఉంటాము" అని రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్ -చీఫ్ అన్నారు.


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు కవరేజ్ చేస్తూ మరియు పాల్ఘర్ సాధువుల హత్య పై నిరంతరం పోరాటం చేస్తుంన్నందుకు కక్షతో రిపబ్లిక్ టీవీని సెక్యూలర్ శివసేన మరియు కాంగ్రెస్ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నామని అర్నాబ్ గోస్వామి తెలిపారు. హత్రాస్ కేసు మరియు ఇతర ప్రసారాలను ఆపేందుకు చేస్తున్న కుట్ర చేస్తున్నారు. దమ్ముంటే ఆపాలని అతను తన ప్రత్యర్థులను సవాలు చేశాడు, "రోక్ సాకో తో రోక్లో (మీకు వీలైతే మమ్మల్ని ఆపండి)." అంటూ సత్యానికి అండగా నిలుస్తానని శపథం చేశాడు.

అవును నేను హిందూవాదిని 
తనను లక్ష్యంగా చేసుకున్న వారిని హిందూఫోబియాలుగా అభివర్ణించారు. "సోనియా సేన, అగర్ ఆప్కో సనాటన్ ధర్మ సే నఫ్రత్ హై, తోహ్ మె హాన్ సనాటన్ ధర్మ కా సచ్చా సిపాహి హూన్ (మీరు సనాతన ధర్మాన్ని ద్వేషిస్తే, నేను సనాతన ధర్మానికి నిజమైన సైనికుడిని)" అంటూ అర్నాబ్ గోస్వామి గర్వంగా ప్రకటించాడు.

"రిపబ్లిక్ టివిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, సోనియా సేన సనాతన్ సమాజానికి వ్యతిరేకంగా చేసిన కుట్రను దాచడానికి ప్రయత్నిస్తున్నారా?" అని ప్రశ్నించారు.

Source: Opindia

« PREV
NEXT »