హిందువులలో ఐక్యత కోసం కృషి చేసిన 'హిందూ మున్నాని' వ్యవస్థాపకుడు 'వీరా తురవి రామగోపాలన్ జీ' - 'Veera Thuravi Ramagopalan ji', founder of 'Hindu Munnani'


శ్రీరామగోపాలన్ పుట్టిన తేదీ 19/09/1927, తండ్రి శ్రీ రామసామి, తల్లి శ్రీమతి చెల్లమ్మల్, స్వస్థలం సిర్కాజి.

సిర్కాజీలోని లూథరన్ మిషన్ స్కూల్ నుండి రామగోపాలన్ గారి పాఠశాల జీవితం ప్రారంభమైంది. ఆయన బి.ఇ. చదవాలనుకున్నారు కానీ అందులో ప్రవేశం లభించలేదు. బి. ఇ కి  సమానమైన డిప్లొమా అధ్యయనం చేయాలనే ఆలోచనతో ఆయన AMIE లో చేరారు. శ్రీ రామగోపాలన్ 1944 లో చెన్నై పురసైవక్కం-చెంగల్వరాయన్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చేరి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చదివారు.

ఒకసారి ఆయన తన స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు, అతని స్నేహితుడు ముత్తురామన్ సాయంత్రం 5 గంటలకు అకస్మాత్తుగా ఆటను విడిచిపెట్టాడు. గోపాల్జీ ఆశ్చర్యంగా అతనిని అడిగారు. నువ్వు అకస్మాత్తుగా ఆటను విడచి ఎక్కడికి వెళ్తున్నావు? అని. అప్పుడు ముత్తురామన్ ” నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళుతున్నాను” అని చెప్పారు. అప్పుడు “RSS అంటే ఏమిటి?” అని అడిగారు రాం గోపాల్జీ. అప్పుడు ముత్తురామన్ రాం గోపాల్జీని చెన్నైలోని గోపాలపురం మునిసిపల్ గ్రౌండ్స్‌లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు తీసుకువెళ్ళారు. అప్పటి నుండి సంస్థతో రాం గోపాల్జీ ప్రయాణం ప్రారంభమైంది. చెన్నైలోని అవడి వద్ద ఉన్న సింధ్ ప్రావిన్స్ నుండి బహిష్కరించబడిన హిందూ కుటుంబాలను ఆయన సందర్శించారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ అవసరం ఉందని భావించారు. తద్వారా హిందువులు మరెక్కడా ప్రభావితం కాకుండా ఉండగలరని అభిప్రాయపడ్డారు. తన పూర్తి సమయాన్ని సంఘ కార్యానికే  కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకవైపు సంఘ పనిలో నిమగ్నమైయుండి కూడా కాలేజీ చదువు పూర్తి చేశారు.

కళాశాల నుండి పట్టా పొందిన తరువాత, సంఘ కార్యంలో పూర్తి సమయ కార్యకర్తగా కొనసాగాలని  నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని సంఘ పెద్దల వద్ద ప్రస్తావించినప్పుడు, సంఘ పెద్దలు మొదట తనను ఉద్యోగం చేసి సంపాదించాలని, తరువాత రాజీనామా చేసి సంఘ్ పనికి తిరిగి రావాలని ఆదేశించారు.

ఆ ప్రకారం శ్రీ రాం గోపాల్జీ  చెన్నై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడియాథంలోని ఒక ప్రైవేట్ విద్యుత్ కేంద్రంలో పనిచేశారు. ప్రతి రోజూ ఇంట్లో పోరాటం ఉండేది. 1947 లో ప్రచారక్‌గా పనిచేయడానికి సంఘ్ నుండి అనుమతి పొందారు. మొదట సంఘ్ పని కుంబకోణం వద్ద ప్ర్రారంభించి ఒక వారం తర్వాత తిరునెల్వేలిలో సంఘ పని ప్రారంభించారు.

ఐక్య తమిళనాడులో పాలక్కాడ్ తాలూకా యొక్క ప్రచారక్ గా పని చేశారు. మదురైలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సందోహం మధ్య పరమ పూజ్యనీయ గురూజీ పాల్గొన్న 51 వ గురు పూజా కార్యక్రమం   జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పసుంపన్ తేవర్ తిరుమగన్ అధ్యక్షత వహించారు. పరమ పూజినియ గురుజీ తమిళనాడు పర్యటన సందర్భంగా, గురూజీ ప్రసంగాలను రాం గోపాల్జీ అనువదించారు. ఈ సందర్భంగా శ్రీ గురూజీని బాగా అర్థం చేసుకున్నారు.

అవిభక్త తమిళనాడుకు ప్రాంత్ ప్రచారక్‌ గానూ ఇతర అనేక బాధ్యతల్లోనూ పనిచేశారు. జూన్ 1980 లో, సంఘం యొక్క రాష్ట్ర కమిటీ సమావేశం కరూర్‌లో జరిగింది. ఆ కాలంలో మీనాక్షిపురంలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న వార్తలతో తమిళనాడులో గొప్ప గందరగోళం నెలకొంది.  అదే సమయంలో, కన్యాకుమారి జిల్లాను “కన్నిమరి” జిల్లాగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా, రామనాథపురంలో లక్ష మంది మతం మార్చబోతున్నారు అని వారి పేర్లతో సహా విడుదల చేయబడ్డాయి, ఇవన్నీ బహిరంగంగానే జరిగాయి.

కరూర్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఈ కార్యకలాపాలను నిలువరించే బాధ్యత శ్రీ రాం గోపల్ల్జీకి అప్పగించబడింది. అప్పటి నుండి హిందూ దేవాలయ సంరక్షణ కోసం ఆయన చాలా పోరాడుతున్నారు. హిందూ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థను నడిపాడు. గోపాల్ జీకి రూ .35 చేతికిచ్చికన్యాకుమారిలో ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించి అక్కడికి పంపారు సంఘ పెద్దలు.

హిందూ ధర్మ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన అనేక కుట్రలను ఆయన చేదించారు. అనేక చర్చిల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అన్యాక్రాంతమైన  ఆలయ భూములనెన్నింటినో రికవరీ చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణోద్యమాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారు. తమిళనాడులోని ద్రావిడ సంఘాలు విసిరే సవాళ్ళకు సమర్థవంతంగా సమాధానం చెప్పడం తోపాటుగా, వారు వేసే అపవాదులకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతూ ఉండేవారు.

అప్పటి నుండి ఈ రోజు వరకు, 94 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన అవిశ్రాంతంగా పర్యటించి, హిందువులలో ఐక్యత కోసం, జాగృతి కోసం కృషి చేశారు.

__విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top