స‌మాజ సేవ పేరుతో మ‌త మార్పిళ్లు… రూ.31 కోట్ల దుర్వినియోగం చేసిన క్రైస్త‌వ సంస్థ‌ - Mass Dead conversions in the name of social service ‌ Rs 31 crore misappropriated Christian organization

స‌మాజ సేవ పేరుతో మ‌త మార్పిళ్లు… రూ.31 కోట్ల దుర్వినియోగం చేసిన క్రైస్త‌వ సంస్థ‌ - Mass Dead conversions in the name of social service ‌ Rs 31 crore misappropriated Christian organization
సామాజిక సేవ అనేది అత్యంత ప్రశంసనీయమైన కార్యకలాపాలలో ఒకటి. భారతదేశంలోని చాలా ఎన్జీఓలు సమాజానికి ఎదో ఒక విధంగా త‌మ వంతు సహాయపడటానికి సామాజిక కార్యక్ర‌మాలు చేప‌డుతున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో ఈ సామాజిక సేవలు కొన్నిసార్లు ఒక రహస్య ఎజెండాతో పనిచేస్తాయని చెప్ప‌డానికి అనేక ఉదాహరణలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మన సమాజంలో ఇలాంటి కార్య‌క‌లాపాలు నడిపించడంలో క్రైస్తవ మిషనరీలు ముందంజలో ఉన్నాయి.
   అలాంటి ఒక విష‌యం ఇటీవ‌ల గౌహ‌తిలో వెలుగులోకి వ‌చ్చింది. గౌహ‌తిలోని ‘స్నేహాలయ’ అనే క్రైస్త‌వ మిష‌న‌రీ సంస్థ అనాథాశ్రమానికి వ‌చ్చిన నిధుల‌తో పిల్ల‌ల‌ను మ‌తం మార్చ‌డానికి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ సంస్థ ఫారెన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యూలేష‌న్ యాక్ట్ (ఎఫ్‌.సి.ఆర్.‌ఎ) నిబంధనలను ఉల్లంఘించి అనాథాశ్ర‌మానికి రూ.38.8 కోట్లు అందుకుంది. కానీ నిధులను పిల్ల‌ల మ‌తం మార్చ‌డానికి ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ ప్రోటెక్ష‌న్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌.సి.పి.సి.ఆర్‌) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అనాథాశ్ర‌మాల అభివృద్ధి కోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి ‘స్నేహాల‌య’ సంస్థ‌కు మెంబ‌ర్ ఆఫ్ పార్ల‌మెంట్ లోక‌ల్ ఏరియా డెవ‌ల‌ప్ మెంట్ (ఎం.పి.ఎల్.‌ఎ.డి) ప‌థ‌కం కింద‌ నిధులు వచ్చాయని, కానీ ఆ నిధుల‌తో సంస్థ మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిపింది. నిధులు దుర్వినియోగం చేస్తున్న స్నేహ‌ల‌య లైసెన్స్‌ను రద్దు చేయాలని ఎన్‌.సి.పి.సి.ఆర్ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ విష‌యంపై స్నేహ‌ల‌య అనాథ‌శ్ర‌మాన్ని సంప్ర‌దించి మ‌రిన్ని విష‌యాల‌ను వెలుగులోకి తీసుకురానున్న‌ట్టు ఎన్‌.సి.పి.సి.ఆర్ వెల్ల‌డించింది.
Source : ONE  
__ విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top