AIUDF కు భారీగా విదేశీ నిధులు – దాతల లిస్టు సిద్ధమంటున్న లీగల్ LRO, - Huge foreign funding for AIUDF - Legal LRO preparing list of donors

AIUDF కు భారీగా విదేశీ నిధులు – దాతల లిస్టు సిద్ధమంటున్న లీగల్ LRO - Huge foreign funding for AIUDF - Legal LRO preparing list of donors
దురుద్దీన్ అజ్మల్ యాజమాన్యంలోని అజ్మల్ ఫౌండేషన్ తన విద్యా కార్యక్రమాల కోసం అందుకున్న విదేశీ నిధులను AIUDF యొక్క ‘రాజకీయ కార్యకలాపాలకు’ మళ్లించిందని న్యాయ హక్కుల అబ్జర్వేటరీ (Legal Rights Observatory (LRO)) ఆరోపించింది. అజ్మల్ ఫౌండేషన్ ‌కు రూ .69.55 కోట్లు వచ్చాయని, అయితే కేవలం 2.05 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఎల్‌ఆర్‌ఓ ట్వీట్ చేసింది. మిగిలిన మొత్తాన్ని బంగ్లాదేశ్ ముస్లింలను బహిరంగంగా ఆమోదించే ఇస్లామిక్ పార్టీ AIUDF కి మళ్లించినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా ఉండటానికి, ఎఐయుడిఎఫ్ వారి యంత్రాంగం పనిచేస్తోంది. అలాగే ముస్లిం ఓట్లను చెక్కుచెదరకుండా ఉంచడానికి తన ధనాన్ని ఉపయోగిస్తోంది. అజ్మల్ ఫౌండేషన్ భూమి నియమాన్ని ఉల్లంఘించిందని, దాని FCRA లైసెన్సును‌ రద్దు చేయాల్సిన అవసరం ఉన్దనని LRO కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

AIUDF వివిధ ఇస్లామిక్ మతోన్మాదుల నుంచి నిధులను పొందుతోంది. అజ్మల్ ఫౌండేషన్ యొక్క దాత అల్ ఇమ్దాద్ ఫౌండేషన్ UK ఇజ్రాయల్ ‌పై అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పాపడిన పాలస్తీనా టెర్రర్ గ్రూప్ హమాస్ ‌తో సంబంధాలు కలిగివున్నదనేది బహిరంగ రహస్యం. ఈ ఫౌండేషన్ హలాల్ ధృవీకరణ రుసుమును మిలియన్లలో సేకరిస్తుంది. ఉగ్రవాద ప్రయోజనాల కోసం నిధులను మళ్ళిస్తుంది. ఒక ఆస్ట్రేలియన్ స్టాండింగ్ కమిటీ హమాస్ ను “2 వ పాలస్తీనా ఇంతిఫాదా” గా అభివర్ణించింది. అల్-ఇమ్దాద్ ఫౌండేషన్ – ఒక దక్షిణాఫ్రికా స్వచ్ఛంద సంస్థ, బ్రిటిష్ శాఖ. గతంలో జార్జ్ గాల్లోవే చేత స్థాపించబడిన వివా పాలస్తీనా-హమాస్ అనుకూల స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది. హమాస్ కార్యకర్తలు దాని సిబ్బందిలో ఉన్నారు.”
   మరో దాత, ఉమ్మాహ్ వెల్ఫేర్ ట్రస్ట్, యుకె. దీనిపై టెర్రర్ సంబంధాలు మరియు మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ ఆధారిత వార్తాపత్రిక అల్-అరేబియా “యుకెకు చెందిన ఉమ్మా వెల్ఫేర్ ట్రస్ట్, దీనిని గతంలో యుఎస్ ట్రెజరీ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది.” అజ్మల్ యొక్క టర్కీకి చెందిన దాత- ఇన్సాని యార్డిమ్ వక్ఫీ , అల్-క్వెడా మరియు గ్లోబల్ జిహాద్ నెట్‌ర్కు తో ప్రత్యక్ష సంబంధాలు కలిగియున్న సంగతి కూడా తెలిసిందే. ఫౌండేషన్ యొక్క దాత ముస్లిం ఎయిద్ యుకెకు కాశ్మీర్ ఆధారిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ‌తో సంబంధాలున్నాయి.

అస్సాం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బిజెపి పెరుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ AIUDF తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ఛాందసవాదానికి AIUDF సహాయం చేస్తున్నట్లు మరియు సందేహాస్పద వనరుల నుండి విదేశీ సహాయాలను అందుకున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. అటువంటి సంస్థలు స్వేచ్చగా మనుగడ సాగించటానికి అనుమతించినట్లయితే, దేశ వ్యతిరేక కార్యకలాపాలు శర వేగంగా విస్తరించే ప్రమాదముంది.

Source : Organiser.
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top