రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

తాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే బాధ కలుగుతోందని ఆయన అన్నారు. ఏపీలో ఏడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పరాకాష్ఠగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోందన్నారు. శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకెళ్లడం పిచ్చివాళ్ల చర్య కాదని మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్య అని మండిపడ్డారు. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అందువల్లే చారిత్రక ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారన్నారు.
పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం
పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో కాల్చివేసిన రథం
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో కాల్చివేసిన రథం
అంతర్వేదిలో కాల్చివేసిన రథం
అంతర్వేదిలో కాల్చివేసిన రథం
ఇప్పటి వరకూ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారిని పట్టుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ విమర్శలు చేశారు. రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతున్న ఈ తరుణంలో ఏపీలో మాత్రం రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలని హితవు పలికారు. హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు. అన్యమత పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరమన్నారు. శ్రీవారి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు, అన్యమత సంబంధ విషయాలు ప్రస్తావించకూడదనే నియమాలను కావాలనే అధికార పార్టీ నాయకులు విస్మరిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వరుస సంఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలో విగ్రహాలను తాజాగా ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలపై 100కి పైగా దాడులు జరిగినట్లు ఎంపీ లేఖలో పేర్కొన్నారు.

__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top