వేదకాలము నుండి శ్రీ గణేశారాధన చరిత్ర - History of Sri Ganesha worship from Vedic times

వేదకాలము నుండి శ్రీ గణేశారాధన చరిత్ర - History of Sri Ganesha worship from Vedic times
వేదకాలము నుండి శ్రీ గణేశారాధన అతి పురాతనమైన పూజా పద్ధతిగా వ్యాప్తిలో నున్నది. విఘ్నకారకుడుగా విఘ్న నివారకుడుగా శ్రీ గణేశుని ప్రసిద్ధి మనమందర మెరిగినదే. మొదట శ్రీ గణేశుని స్తుతించిన పిదప మిగితా పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నందున ఈయన ప్రసిద్ది అతి (ప్రాచీనకాలం నుంచి వున్నదని తెలియుచున్నది. ప్రతి మానవుడు ఆయు రారోగ్యెశ్వర్యములను కోరుచుండును. అవి మనము కోరినంతనే ప్రాప్తించెడివి కావు. గత జన్మ సుకృతమునుబట్టేయే ప్రాప్తించుచుండును. ఆ సుకృతము పుణ్యకర్మలచే ప్రాప్తమగును. అందులకనేక అంతరాయములు కలుగుచుండును. అట్టి అంతరాయములు కలుగకుండ మనము ప్రతికార్యారంభమును “అదౌ పూజ్య గణాధిపతమ్' అనుచు గజానునుని పూజించు చుందుము. ఇది లోకవిదితమే.
  • వినాయకునిగూర్చి వ్యాస మహర్షి ఒక ఉప పురాణము రచించియున్నాడు. ఈ గ్రంథము చాలా ప్రాచీనము, మంత్ర శాస్త్రములో గణపతులు ముప్పయి రెండు రూపములుగా చెప్పబడినది. సిద్ధ గణపతి, వర గణపతి, మహాగణపతి, లక్ష్మీగణపతి, చింతామణి గణపతి. ఇట్టు అనేక రూపములతో అనేక కార్య సిద్దుల కొరకు దేవతలు బుషులు ఆరాధించి పూజించిరి.
  • శ్రవణము వల్లను, జప, పూజాధికములవల్లను సకల సంకష్టములు నశించి ఆయురారోగ్యములు చేకూరునని మన నమ్మిక. 
  • వేద వ్యాసమహర్షి పదునెనిమిది పురాణములు రచించి ఆ తర్వాత వాటిలో విశదపడని అనేక నిగూఢ రహస్యములను వివరించుట్లకె మరి పదునెనిమిది ఉప పురాణములను కూడా రచించినాడు.  ఇందు 'గణేశ పురాణము' అతి ముఖ్యమై నది. దేవ గణములకు ఆదిపురుష్నుడె, అధిపుడై ఉద్భవించడంవల్లనే ఈయనకు 'గణనాధు'డని  “గణేశడని “గణపతి” అని పేరు వచ్చినది. గణపతిని ఓంకార స్వరూపుడుగ కూడ “గణపత్య ధర్వ శీర్షము'లో స్పష్టంగా వృర్తించబడింది. వాక్కునకు ఈయన అధిష్టాన దేవతగా వేదములు స్తుతించినవి.
  • “గణానాం త్వా గణపతిం హవామహే కవిం, కవీనాం ఉపమశ్ర వస్తువం... జ్యేష్టరాజం బ్రహ్మణాం, బ్రహ్మణ స్పత అనణృణ్వన్నూతిభిః సీదసాధనం'" సృష్ట్యాదిలో “ఓం" కారంవలె ఉదృవించిననాడు గణపతి, గనక సర్వదేవత లలో ప్రధమంగా ఆయన పూజ్యుడు.
  • గణపతి విష్ణుస్వరూపుడు. ప్రార్ధనలో “శక్షాం భరధరం, విష్ణుం” అని విష్ణ మూర్తిగా గణపతిని గూర్చి చెప్ప బడినందువల్ల స్పష్టంగా ఆయనయొక్క విష్ణత్వము రూఢి యగుచున్నది. యోగా స్త్రంలో దీని నిదర్శనంకూడ కలదు.
  • మన భరతఖండమందేకాక, నేపాల్‌, చైనా, టర్కీ, టిబెట్‌, ఇండోనేషియా, జావా, సుమత్రా, బోర్నియో మరియు జపాను మొదలగు దేశాలలో గణేశారాధనకలదు.
  • విఘ్నాధిపతిగా, గణాధిపతీగా బౌద్దాయన ధర్మ సూత్రములలో శ్రీగణేశుని ప్రసక్తి కలదు.
  • యాజ్జ్ఞవల్క్యనృతిననుసరించి బ్రహ్మ, రుద్రులు శ్రీ గణేశుని, గణాధిపతిగ నియమించినట్టు తెలియు"చున్నది.
ఆంధ్ర మరియు తెలంగాణలో గణేశుడు
   శాతవాహన మహారాజుకాలంలో హాలునిగాధా సప్తసతి ననుసరించి శ్రీ, గణేశునిపూజ దక్కనులో వ్యాపించినట్లు తెలియుచున్నది. అమరావతి శిల్పాకృతి ననుసరించి రెండు చేతులు. ఏనుగు శిరముగల గణేశుడు పూలహారమును చేతనుంచు కొన్నట్లు కనుగొనబడింది. ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు శ్రీ, కుమారస్వామి శ్రీ, గణేశుని పూజ అతి ప్రాచీనమైనదని క్రీపూ.. పూర్వమే ప్రఖ్యాతిగాంచినదని తదుపరి ఈ ప్రాచీన గణేశమూర్తి అనేక రూపములతో వ్యాప్తిచెందినదని అభిప్రాయ పడినారు.
   బిర్లా పురాశిల్పవస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లాలోని కృష్ణాభవనాశి నదుల సంగమ స్థలములో జరిపిన త్రవ్వకాలలో బయలుపడిన జేగురుమట్టి (టెర్ర కోటా) శ్రీ, గణేశుని విగ్రహం వలన క్రీపూ.. పూర్వం పది శతాద్దిముల ముందు నుంచి శ్రీ గణేశమూర్తిని పూజించడం కలదని అందుచే కృష్ణ, తుంగభద్ర నదీ పరీవాహక ప్రదేశములో గణేశుడు పూజలందుకున్నట్లు తెలియుచున్నది. ఈ కనుగొన్న విగ్రహం లలితాశనము రెండు చేతులు బానకడుపు, ఏనుగుతల, కుడ్డివెపు పొడ్డవెన తొండము ఆభరణములతో కిరీటముగల రః గణేశ మూర్తి ఆంధ్ర రాష్ట్రలో అతి ప్రాచీనమై నదిగా గుర్తింపబడినది. కీసరగుట్టలో బయలుపడిన జేగురుమట్టే గణేశ విగ్రహము విష్ణుకుండినుల కాలమునాటిదని తెలియుచున్నది.
  వేల్పూరు శిలాశాసనము ననుసరించి విష్ణుకుండినుల కాలమందు శ్రీ, గణేశపూజ బహుళ ప్రచారములో నుండెడిదని తెలియుచున్నది. అనేక త్రవ్వకాలలో బయలుపడిన గణేశమూర్తి ఆంధ్ర దేశములో అతి ప్రాచీన కాలం నుంచి వ్యాప్తిలో నున్నట్లు తెలియుచున్నది. ఈ త్రవ్వకాల ననుసరించి ఆంధ్రదేశములో శ్రీ, గణేశపూజ (క్రీపు.. నుంచి వ్యాప్తిలో కలదని, చాళక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర కాలములో బహుళవ్యాప్తి నందినదని తెలియుచున్నది.
   ఏ కవి కలంపట్టేనా ముందుగా ఇష్టదేవతను స్తుతించి గణేశుని స్మరింపకమానడు. తొలి వేలుపు ఎవ్వరెనా తొలిపూజ అందుకునే వేలుపు వినాయకుడే ప్రతికర్మకు విఘ్నములు లేక పరిసమాప్తి కోరుచు శ్రీ విఘ్నేశ్వర పూజ అవసరమని పద్మపురాణం చెప్పుచున్నది.
శ్లో: నార్చితో హి గణాద్యక్షో యజ్ఞాదేయ త్సు  రోత్తమాః |
తస్మాద్విఘ్నం సముత్పన్నం తత్క్రోధజ విదంఖలు | 
ఇంకను వివరముగా గణేశుని గూర్చి గణేశపురాణం లీలాఖడం పరిశీలించిన వారికి తెలియగలదు.
     గణేశుడు ముందు కూర్చుని వ్రాయగా వ్యాసమహర్షి అశువుగా మహాభారతము చెప్పి యున్నాడని ప్రతీతి, ధారాపాతంగా రచనసాగాలని ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించవలెనని అట్టే అనుగ్రహము ఇచ్చుటవల్లనే గణపతి “నిర్విఘ్న కార్యసిద్ధిక' అనుగ్రహ ప్రదాతయై అనాదిగా, ఈనాటికి పూజింపబడు చున్నాడు.

రచన: శ్రీ పొడుగుపాటి కృష్ణమూర్తి బి.ఎ
ప్రకాశకులు: సూర్యమిత్ర ధార్మిక నిధి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top