పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు

రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
   పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. “బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి” పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఏవిధంగా కోట్లాది రూపాయల ధనం సంపాదించాడో వివరిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు నివేదిక అందజేసింది.
   ఈ నివేదిక ప్రకారం.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కాకినాడలో బాలబాలికల కోసం అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. వీటిని ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ అనే సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాడు. ఫారిన్ కంట్రిబ్యూషన్ లైసెన్సు కలిగిన సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థకు అమెరికాలోని రెండు సంస్థలు “సెట్ ఫ్రీ అలయన్స్’, “వాటర్ ఆఫ్ లైఫ్” ద్వారా  2013 నుండి 2018 (5 ఏళ్లలో) వరకు 93.67 కోట్లు ధనం నిధుల రూపంలో అందాయి. ఏయే సంవత్సరం ఎంత ధనం విదేశాల నుండి ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ సంస్థకు అందాయో ఈ దిగువన ఇవ్వబడింది:
పై రెండు అమెరికన్ సంస్థలు సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థకు నిధులివ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం క్రైస్తవ మతమార్పిళ్లు. మార్గం మాత్రం “వాటర్ ఆఫ్ లైఫ్” నిధుల ద్వారా  గ్రామాల్లో తాగునీటి బోరుపంపులు ఏర్పాటు, “సెట్ ఫ్రీ అలయన్స్” అందించే నిధుల ద్వారా బానిసలుగా మారి గనులు, క్వారీల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి, సంక్షేమం. ఈ రెండు మార్గాల ద్వారా మతమార్పిళ్లు చేయడం అమెరికన్ సంస్థలు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి అప్పగించిన కర్తవ్యం. తమ మతమార్పిడి ఎజెండా ఏవిధంగా ప్రవీణ్ చక్రవర్తి అమలు చేస్తున్నాడో “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ ప్రకటించిన తీరు ఈ క్రింది ఫోటో చుస్తే అర్ధమవుతుంది.
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తమ దేశంలో ఏయే సంవత్సరం ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికార వెబ్సైటులో ఉంచిన డేటా ఇది. 2019 డిసెంబర్ 5న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి, ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’కు విదేశీ నిధులు రాకుండా ఆ సంస్థ FCRA లైసెన్సు రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మరుక్షణం “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికారిక వెబ్సైట్ www.givefreshwater.org మూసివేసింది. అంతే కాదు “వాటర్ ఆఫ్ లైఫ్” వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే సంబంధిత లింక్ “సెట్ ఫ్రీ అలయన్స్” వెబ్సైటుకు (www.setfreealliance.org) రీ-డైరెక్ట్ అయ్యే విధంగా సెట్టింగులు మార్చివేయబడ్డాయి.
   ఇక ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ విదేశీ నిధుల కోసం భారతదేశ పరువును సైతం ఫణంగా పెట్టి తమకు నిధులు అందిస్తున్న సెట్ ఫ్రీ అలయన్స్ కు భారతదేశం విషయంలో తప్పుడు గణాంకాలు అందించింది. దీంతో ఇవే తప్పుడు గణాంకాలను ‘సెట్ ఫ్రీ అలయన్స్’ తమ అధికారిక వెబ్సైట్ లో ప్రదర్శనకు ఉంచి, భారతదేశంపై దుష్ప్రచారానికి తెరదీసింది. ఈ వెబ్సైట్ ఇస్తున్న తప్పుడు గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యధిక బానిసలున్న దేశం. అంతేకాకుండా ఆ బానిసల్లో ఎక్కువ శాతం 7నుండి 14 ఏళ్ల వయసున్న మైనర్ బాలబాలికలు!!
ఇంతటితో ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ అధినేత ప్రవీణ్ చక్రవర్తి ధనదాహం తీరలేదు. ఎక్కడెక్కడి నుండో చిన్నపిల్లలను తీసుకువచ్చి, వారిని బానిస బాలకార్మికులూ చూపిస్తూ, గ్రానైట్ క్వారీల్లో వారు పనిచేస్తున్నట్టుగా కృత్రిమ వీడియోలు సృష్టించి, వాటిని విదేశాలకు పంపి నిధులు సంపాదించడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా బానిసలుగా ఉన్న బాలికలు లైంగిక దాడులకు గురైనట్టు కథలు సృష్టించాడు. బాధితులుగా పేర్కొన్న బాలబాలికల ఫోటోలు వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి, వారి దీనగాధలను ప్రచారం చేస్తూ దాతల మనసు కరిగేలా చేయడం ద్వారా భారీ మొత్తంలో విదేశీ నిధులు పొందాడు.
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా  41,765 మంది బానిసలుగా పనిచేస్తున్న బాల కార్మికులను విముక్తం చేసి, వారికి పునరావాసం కల్పించినట్టు  సెట్ ఫ్రీ అలయన్స్ సంస్థ అధికారిక సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా 5,541 మంది బాప్టిజం పొందినట్టు కూడా అదే సంస్థ పేర్కొంటోంది.
వీరికి నిధులిచ్చిన అమెరికా సంస్థలు Set Free Alliance మరియు Water of Life తమ అమెరికన్ ప్రభుత్వానికి సమర్పించిన ఐటీ రిటర్న్లలో మాత్రం 2017 నాటికి 22,000 మంది బానిస బాల కార్మికులను రక్షించినట్టు స్పష్టంగా తెలియజేసింది.
   నిజానికి భారతదేశపు చరిత్రలో బానిస వ్యవస్థ లేనేలేదు. అటువంటిది ప్రపంచంలో కెల్లా అత్యధికంగా 1. 84 కోట్ల బానిసలు భారతదేశంలో ఉన్నట్టు, అందులో ఎక్కువ శాతం 7 నుండి 14 ఏళ్ల వయసువారని, వీరందరూ కూడా కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గనులు, క్వారీల యజమానులకు అప్పులు తీర్చేందుకు అమ్మివేయబడ్డారని పేర్కొనడం వంటి కల్పిత దీనగాధలతో అమెరికన్ దాతల హృదయాలు కరిగించి, వారి నుండి చందాలు వసూలు చేశారు.  ఈ చర్యల కారణంగా పాస్టర్ ప్రవీణ్ సంస్థలకు కోట్ల రూపాయల విదేశీ నిధులు వచ్చినా, భారతదేశానికి ప్రతిష్టకు మాత్రం తీవ్ర నష్టం కలిగింది.
చట్టప్రకారం మన దేశంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థకు లేదా వ్యక్తులకు ఎవరికైనా బాలకార్మికులు కనిపిస్తే, ముందుగా ప్రభుత్వానికి (అంటే పోలీసులకు, రెవెన్యూ యంత్రంగానికి) సమాచారం అందించాలి. కానీ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆలా చేయకపోవటం వల్ల ఈ 41 వేల మంది బానిస బాలబాలికలను బందీగా చేసుకుని,పనిలోకి పెట్టుకున్న నిందితులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకున్నారు.
   అంతే కాకుండా కోవిద్ లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తమ హాస్టల్లో 1500 మంది బాలబాలికలు ఉన్నట్టు, వారిలో 318 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ చందాలు వసూలు చేశారు. కాకినాడ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’కు చెందిన హాస్టల్లో నిజంగా 318 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిఉంటే ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి కనిపించలేదా? ఇది నిజం అయితే చట్టవిరుద్ధం, కోవిద్ నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుంది.
అంతే కాకుండా 2018 సంవత్సరంలో భారతదేశంలో 200 మంది క్రైస్తవ పాస్టర్లను హతమార్చినట్టు తమకు నిధులు అందించే సంస్థతో దుష్ప్రచారం చేయించాడు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి.
   తమ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ‘సెట్ ఫ్రీ అలయన్స్’ సంస్థ తమ అధికారిక వెబ్సైట్ కేవలం భారతదేశంలో అందుబాటులో లేకుండా సెట్టింగ్స్ మార్చివేసింది.
తన అవసరాల కోసం భారతదేశానికి కళంకం అంటించి సంపాదించిన 93.67 కోట్లు విదేశీ నిధులను ఏవిధంగా వినియోగించారు అనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను కోరింది.

Source: Inputs from Legal Rights Protection Forum
మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top