నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
సంస్కృతి Culture లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంస్కృతి Culture లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

పండుగలు ఎందుకు జరుపుకోవాలి? - Pandugalu yenduku jarupukovali

పండుగలు ఎందుకు జరుపుకోవాలి? - Pandugalu yenduku jarupukovali

విత్రమైన దినాలలో పండుగలు జరుపుకోవడం అన్ని మతాలలోనూ ఉంది. తత్త్వ బోధలను వినడం ద్వారా, పురాణాది కథల ద్వారా సామాన్య జనులు కూడా ఎంతోకొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించినా, పూజాపునస్కారాలు, కొంత కర్మకాండ లేకుండా వారికి తృప్తి, మనశ్శాంతి కలుగవు. నోములు, దీక్షలు, వ్రతాలను పాటించటం వల్ల, పూజలు, పండుగ దినాల వల్ల ఇటువంటి తృప్తి వారికి దొరుకుతుంది. వీటిని అచరించిన ఫలితంగా ఇంద్రియ నిగ్రహం, మనశ్శాంతి ఆనందం లభించటయే కాక సమాజంలో ఐకమత్యం పెంపొంది పరస్పర సహాయసహకారాలు, మతసంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ కూడా జరుగుతుంది. మనస్సును నిరంతరం తత్త్వవిచారణలో నిమగ్నం చేయడం ఆందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి సమయాల్లో మనస్సు విషయసుఖాలపైకి పోకుండా నిరోధించటానికి కూడా పూజలు, పండుగ దినాలు ఉపయుక్తాలవుతాయి. 

  అటువంటి విశేషమైన దినాల్లో ఇతర దినాల కంటే విశేషంగా దైవపూజ, ధ్యానం, సంకీర్తనలు చేయటానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో రకరకాల పిండివంటలతో మనం ఆరగించే విందు, ఎక్కువ జపధ్యానాదులు అనుష్ఠించి మనం స్వీకరించవలసిన ఆధ్యాత్మిక విందుకు
ప్రతీక. కాని కేవలం పిండివంటలు ఆరగించడంతోనే ముగిస్తే పండుగలకు అర్థం ఉండదు. పర్వదినం సెలవు దినం అవుతుందంతే!

ఈ పండుగ, పర్వదినాలు మహాపురుషుల పుట్టినరోజులై ఉండవచ్చు ఉదాహరణకు రామనవమి లాంటివి. లేదా మనదేశపు ధార్మిక, సాంస్కృతిక చరిత్రలో మైలురాళ్ళు కావచ్చు. ఉదాహరణకు; గీతాజయంతి. లేదా ప్రకృతిమాతకు మనం కృతజ్ఞతలను సమర్పించే సంక్రాంతి మొదలైన పర్వదినాలు కావచ్చును. దీపావళి, దసరాలాంటి పండుగలు పురాణ ప్రాశస్త్యం కలిగినవి. ఇటువంటి రోజుల్లో విశేషంగా ఉపవాసం ఇంద్రియనిగ్రహం, దైవపూజ, పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను పొందటం, తర్వాత బంధుమిత్రాదులతో విందు భోజనం చెయ్యటం, పరస్పరం గృహాలకు వెళ్ళి కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం మొదలైనవి వాడుకగా వస్తూ ఉన్నాయి. అయితే ఇవేవీ కూడా పర్వదినాలలో ఆచరించవలసిన జపతపాలకు ఆటంకంగా పరిణమించకూడదు.

ఉత్తర భారతదేశంలో దసరా కాలంలో శ్రీరామలీల దుర్గాపూజ మొదలైన ఉత్సవాలను ఎంతో ఆడంబరంగా జరుపుతారు. దక్షిణాన వినాయక చతుర్థిని ఘనంగా జరుపుకుంటారు. హోలీ, కృష్ణాష్టమి ఇత్యాది పండుగలను అన్ని ప్రాంతాలవారు వైభవంగా జరుపుకుంటారు.

దురదృష్టవశాత్తూ ఇటీవల వీటిలోని ధార్మికప్రభావం తక్కువై జుగుప్స కలిగించే వికృత చేష్టలు, హింసాత్మక ధోరణులు ప్రబలుతున్నాయి. హిందూసమాజం మేల్కొని ఇటువంటి అనుచిత క్రియాకలాపాలకు చోటులేకుండా చేసి ఈ పండుగల పవిత్రతను, వైశిష్ట్యన్ని, మహత్తా్వన్ని
కాపాడేందుకు ప్రయత్నించాలి.

రచన: స్వామి హర్షానంద

24, జులై 2020, శుక్రవారం

నాగ పంచమి - Naaga panchami

నాగపంచమి - Naagapanchamiచలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . మంచో , చెడో ... విపరీత ధోరణి ఇది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధం గా బ్రాహ్మణులూ , ఋషులు , మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతి జనము : 
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు ,
శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముక కు అడుగుభాగము లో మూలాధార చక్రమున్నది . ఆ చక్రం లో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత , ధ్యానం తో ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, జులై 2020, ఆదివారం

ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ – సంస్కృత భాష - Samskruta Bhaasa


సంస్కృత భాష

సంస్కృత భాష

సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంతరాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు  ప్రధాన స్రవంతిలోని  పాఠ్యాంశాల నుండి  అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను  తీసివేస్తున్నాయి. జీవితంలోని అన్ని దశలలో సంస్కృత భాష  పునరుత్థానం కావడం అంటే అది మనదేశ నిజమైన స్ఫూర్తిని,  దాని ఆత్మశక్తిని పునరుజ్జీవనం చేయడమే. సంస్కృత భాష  ద్వారానే మనం మన పూర్వీకులలోని శౌర్యపరాక్రమాలను,జ్ఞానతృష్ణ ను గ్రహించి గొప్ప నాగరికతలతో ఒకటిగా ఏర్పడ్డాము.

చైతన్యశక్తి:
 • ☸ మానవ చైతన్యశక్తిని  శ్రేష్ఠమైన స్థాయికి పెంచే గొప్ప శక్తి సంస్కృతానికి ఉంది. 
 • ☸ సంస్కృత భాష ద్వారా వ్యక్తీకరించబడిన భావాలు ఒకవ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, సంస్కృతం, ఆ భాషను స్పృహతో పలికేవారి చైతన్యశక్తిని విస్తృతం చేస్తుంది. 
 • ☸ ఈ చైతన్యం వివిధ స్థాయిలలో పనిచేసే శక్తి. ఎల్లపుడూ శుద్ధిగా, నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటుంది కనుక  సంస్కృతాన్ని తిరిగి ఆవిష్కరించడం అంటే, సంస్కృత శబ్దాలలో దాగిన శక్తుల గురించి చైతన్యాన్ని వ్యాపింపజేయడమే అవుతుంది.
సంస్కృతం  కష్టమైన భాష?
సంస్కృతం – మృత భాష, కష్టమైన భాష, హిందూ భాష, ఉద్యోగావకాశాలు లేని భాష లాంటి అపోహలు ఆ భాష చుట్టూ చాలా ఉన్నాయి. కానీ, ప్రస్తుత మారుతున్న సమాజంలో పరిశీలిస్తే మనదేశంలో 16 సంస్కృత విశ్వవిద్యాలయాలు సంస్కృత మాధ్యమం ద్వారా వివిధ విషయాలను బోధిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఐచ్ఛిక భాషలలో ఒకటిగా, I నుండి XII తరగతి వరకు సంస్కృత బోధన జరుగుతున్నది. స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులలో చాలావరకు 6వ తరగతి నుండి 10 వ తరగతి  వరకు ‘త్రీ లాంగ్వేజ్ ఫార్ములా’లో భాగంగా  XI , XII తరగతులలో రెండవ ఐచ్ఛిక భాషగా సంస్కృతాన్ని భోదిస్తున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండవ అధికారిక భాషగా  సంస్కృతం కొనసాగుతున్నది. కొన్ని పాఠశాలలు నర్సరీ స్థాయి నుండే సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు దీనిని మాతృభాషతో పాటు మిశ్రమ కోర్సుగా అందిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో మొత్తం ఐదు కోట్ల మంది విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తున్నారని అంచనా. 

దేశంలో పాఠశాల స్థాయిలో సుమారు 5000 సాంప్రదాయ సంస్కృత పాఠశాలలు, 1000 వేద పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో సంస్కృత మాధ్యమిక విద్యా మండలి లేదా సంస్కృత విద్య డైరెక్టరేట్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఏమీ లేవు. సుమారు 120 సాధారణ విశ్వవిద్యాలయాలు యుజి నుండి పిజి స్థాయిలో సంస్కృతాన్ని అందిస్తున్నాయి. ఇవే కాకుండా మన దేశంలో 10 సంస్కృత అకాడమీలు, 16 ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, 60 కి పైగా పీరియాడికల్స్, మ్యాగజైన్స్, సుమారు వంద ఎన్జీఓలు సంస్కృతం ప్రజాదరణ పొందడం కోసం పనిచేస్తున్నాయి.

రేడియో ద్వారా..
 • ➧ ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో రోజుకు రెండుసార్లు సంస్కృత బులెటిన్‌లను ప్రసారం చేస్తున్నది. 
 • ➧ డిల్లీ దూరదర్శన్ రోజుకు రెండుసార్లు  సంస్కృత వార్తలను, వారానికి అరగంట ప్రత్యేక బులెటిన్ సంస్కృతంలో ప్రసారం చేస్తుంది. 
 • ➧ దివ్యవాణి అనే సంస్కృత  24/7 ఇంటర్నెట్ రేడియో, వివిధ రకాల ప్రసారాలను పూర్తిగా సంస్కృతంలో ప్రపంచవ్యాప్తంగా 165 కి పైగా దేశాలలో అందిస్తున్నది. 
 • ➧ ప్రతి సంవత్సరం సంస్కృతంలో వందలాది రచనలు, పరిశోధనా పత్రాలు ప్రచురించబడుతున్నాయి.
అవార్డులు:
సంస్కృతంలో సృజనాత్మక రచయితలకు ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు ఇస్తున్నారు. కర్ణాటకలోని మత్తూరు లాంటి ఏడూ గ్రామాలూ, మధ్యప్రదేశ్‌లోని ఝిరీ వంటి  గ్రామాలు సంస్కృతంను  రోజువారీ భాషగా ఉపయోగిస్తాయి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు సంస్కృతం నేర్చుకుని సంస్కృత కుటుంబాలుగా మారిపోతున్నాయి.

విదేశాలలో సంస్కృతానికి ఆదరణ:
 • ➧ విదేశాలలో కూడా సంస్కృతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. 
 • ➧ అనేక ఆన్‌లైన్ మాధ్యమాలు సంస్కృతంలోని వివిధ అంశాలను వీక్షకులకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. 
 • ➧ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా సంస్కృతానికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. 
 • ➧ సంస్కృత రంగంలో అద్భుతమైన పరిశోధనలు, గణనపై భాషాశాస్త్రంలో  కొన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థలలో గుణాత్మక పనులు జరుగుతున్నాయి. 
 • ➧ సంస్కృతంలో గుణాత్మక పిల్లల సాహిత్యాన్ని సృష్టించడం, మూల్యాంకనం చేయడం, ప్రచారం చేయడం కోసం పూర్తిగా నిబద్దతతో  ప్రపంచంలో పని చేస్తున్న ఏకైక సంస్థ  ‘సంస్కృత బాలసాహిత్య పరిషత్’
 • ➧ ఈ సంస్థలో భారతదేశంలోని ఇరవై ఐదు వేల మంది ప్రజలు తమ మాతృభాషగా సంస్కృతాన్ని నమోదు చేసుకున్నారు. 
 • ➧ చాలా మంది సంస్కృతంలో సంభాషిస్తున్నారు, సంస్కృతంలో బ్లాగ్ లు  నిర్వహిస్తున్నారు, సంస్కృతంలో ఇమెయిల్, సంస్కృతంలో ట్వీట్లు , వారి వాట్సాప్ గ్రూపులలో సంస్కృతంలో పోస్ట్ చేస్తున్నారు. 
 • ➧ సంస్కృత సమావేశాలలో, మొత్తం సంభాషణలు, చర్చలు, ప్రదర్శనలు సంస్కృతంలో ఉంటున్నాయి.
దేశంలో..
భారత రాజ్యాంగం ప్రకారం సంస్కృతం అధికారిక భాషలలో ఒకటి. దేశంలో సాధారణంగా మాట్లాడే భాష సంస్కృతం కానప్పటికీ, అన్ని భారతీయ భాషల/మాండలికాల పదజాలం సంస్కృత మూలాల నుండి వచ్చినదే.

సంస్కృతంలో అనేక భాషా గణన సాధనాను అభివృద్ధి చేయడంతో ఈ భాషపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా భాషా బోధన రోజురోజుకు పెరుగుతోంది. ఈ భాషను నేర్చుకోవడం ద్వారా భారతదేశంతోనే కాకుండా మొత్తం ప్రపంచంతో సామాజికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా,మత,ఆధ్యాత్మిక మూలాలతో అనుసంధానం కావచ్చని  చాలా మంది భావిస్తున్నారు.

సంస్కృతం ఒక భాష మాత్రమే కాదు, ప్రాచీన భారతదేశం అభ్యాసాన్ని ప్రతిబింబించే సంపూర్ణ  జ్ఞాన వ్యవస్థ. ప్రపంచలోని పేరొందిన  శాస్త్రీయ సాహిత్యంలో  సంస్కృతం కూడా అపారమైన జ్ఞాన నిధి. ఆ క్రమలో మనం తప్పిపోయిన లింకులను అందించి  అంతర్-క్రమశిక్షణా విధానాలను ప్రోత్సహించి, సంస్కృతంలో ప్రస్తుతం ఉన్న జ్ఞాన వ్యవస్థలను సుసంపన్నం చేసే  సామర్థ్యాన్ని పెంచితే , ముఖ్యంగా అది అన్ని భారతీయ భాషల సుసంపన్నతకు చాలా దోహదం చేస్తుంది.

సంస్కృత భాష శిక్షణ:
సంస్కృతం నేర్చుకోవడంలో ఆచరణాత్మక విషయం ఏమిటంటే, మనసును తార్కికంగా ఆలోచించడానికి శిక్షణ ఇవ్వడం, స్పష్టంగా వ్యక్తీకరించడం, మేధో బలాన్ని అభివృద్ధి చేయడం, పదాల అర్థాలపై తీవ్రమైన అవగాహన కల్పించడం అనే వాటిపై అది ఆధారపడి ఉంటుంది.
 • ➧ సంస్కృత ఉచ్చారణలో నాణ్యత, మెదడు పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచడంలో  సహాయపడుతుంది. 
 • ➧ అంతేకాక, సంస్కృత ఉచ్చారణ  చైతన్యశక్తిని పెంచుతూ, వ్యక్తిత్వంలో అద్బుతమైన పరివర్తన తీసుకురావడంలో భాష విస్తారమైన శక్తిని కలిగి ఉంటుంది. 
 • ➧ ఈ భావన  నిజమైన ఆనందానికి దారితీయడమే కాక హృదయాన్ని, మనస్సును అమరత్వం అనే సంపూర్ణ భావనతో నింపుతుంది. 
 • ➧ భాషలోని  స్వచ్ఛత మనలను ఆకర్షిస్తుంది, ప్రేరేపిస్తుంది. 
 • ➧ మన జీవితంలోని నిజమైన లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది, మనలోని సత్యాన్ని మనకు స్పృహ కలిగిస్తుంది. 
 • ➧ సంస్కృతభాష  లయ సౌందర్యం, శ్రావ్యత, దాని శబ్ద ప్రకంపనాల స్వచ్ఛత, శబ్ద నాణ్యత గొప్పతనం, మూలశబ్దాల పారదర్శకత,  పదజాలం, విషయాల గొప్పతనం ఇవన్నీ సంస్కృత భాషను సమాజంలో గర్వపడేలా చేసాయి.
వ్యాసకర్త:  –డా. సంపదానంద  మిశ్రా, డైరెక్టర్,  శ్రీ అరబిందో ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ (SAFIC), శ్రీ అరబిందో సొసైటీ, పుదుచ్చేరి.
__విశ్వ సంవాద కేంద్రము

21, జూన్ 2020, ఆదివారం

నమస్కారం - ఓ సాంస్కృతిక అంశం మరియు ఓ విజ్ఞానం - Namaskara - a cultural aspect and a knowledge

namaskarma - namaskar


నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశం మాత్రమే కాదు. దాని వెనుక ఓ విజ్ఞానం ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తుంది.

మీరొక వ్యక్తిని చూసినప్పుడు, అది మీరు పనిచేసే చోటైనా, వీధిలో అయినా, ఇంట్లో అయినా లేదా మరెక్కడైనా సరే, మానవ బుద్ధినైజం ఎలాంటిదంటే, అది చూసిన క్షణమే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికొచ్చేస్తుంది.  “ ఆ మనిషిలో ఇది బాగుంది, ఈ మనిషిలో ఇది బాలేదు. అతను మంచివాడు, అతను మంచివాడు కాదు, అతను అందంగా ఉన్నాడు, అతను వికారంగా ఉన్నాడు” ఇలా ఎన్నో నిర్ణయాలకు వచ్చేస్తుంది. వీటన్నిటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలు, తీర్మానాలు జరిగిపోతాయి. మీ తీర్మానాలు పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ జీవితంలోని మీ గతానుభావాలనుండీ వస్తున్నవే. దేన్నైనా, ఎవరినైనా  ప్రస్తుతమున్న విధంగా గ్రహించడానికి మిమ్మల్ని ఇవి అనుమతించవు. ప్రస్తుతమున్న విధంగా విషయాలని, మనుషులని గ్రహించడం చాలా ముఖ్యం. మీరు ఏ రంగంలోనైనా సమర్థవంతంగా పని చేయాలంటే, మీ ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు, వారిని ప్రస్తుతం ఎలా ఉన్నారో అలా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. వారు నిన్న ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. వారు ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి, మొదట మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఒక్కసారి మీరలా చేస్తే, మీ ఇష్టాయిష్టాలు బలపడకుండా, మెత్తబడతాయి. ఎందుకంటే వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యమిదే.

సృష్టికర్త
సృష్టికర్త హస్తం:
సృష్టికర్త హస్త ప్రమేయం లేనిదేది సృష్టిలో లేదు.  ప్రతీ కణంలోనూ ప్రతీ అణువులోనూ సృష్టి మూలం పనిచేస్తోంది. అందుకే భారత సంస్కృతిలో మీరు పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, శిరస్సు వంచి అభివాదం చేయమని చెబుతారు. మీరొక స్త్రీని, పురుషుడిని, పిల్లాడిని, ఆవుని, లేదా ఓ చెట్టుని చూసినా, శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది ఈ సంస్కృతి. మీలో కూడా సృష్టి మూలం ఉందన్న విషయాన్ని ఇది నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తిస్తే, నమస్కారం చేసిన ప్రతీసారి మీరు మీ సహజ ప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నట్టే.


దీనికి మరో కోణం కూడా ఉంది. మీ అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి – దీన్ని ఈనాటి వైద్య శాస్త్రం కూడా కనుగొంది. వాస్తవానికి మీ నాలుక కన్నా, కంఠం కన్నా మీ చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగా ముద్రలను గురించి పూర్తి శాస్త్రమే ఉంది. మీ చేతిని కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మీరు మీ పూర్తి వ్యవస్థనే భిన్నంగా పనిచేసేటట్లు చేయవచ్చు. మీరు మీ చేతులని జోడించిన క్షణమే, మీ ద్వైత భావనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ కోరికలు, మీరు ఈసడించుకునే విషయాలు, ఇవన్నీ సమమై, తొలిగిపోతాయి. ఇలా మీరెవరో వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మీలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి.
మిమ్మల్ని మీరే సమర్పించుకోవటం
కాబట్టి నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు. దాని వెనుక ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీలో జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, వ్యక్తులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇది ప్రతీ జీవికీ వర్తిస్తుంది. ప్రతీ జీవి కూడా తనకు తన చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, వృద్ధి చెందగలగుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

3, జూన్ 2020, బుధవారం

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి - Puttinaroju, Birthday


భారతీయ సంసృతిలో పుట్టినరోజు

కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యువతను చెడగొడుతోందో తెలుస్తోంది.
వెలిగే దీపం ఆర్పడం
వెలిగే దీపం ఆర్పడం 
వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం:
 • ➣ ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.
 • ➣ ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి, ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి.
 • ➣ లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి.
 • ➣ అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది.
 • ➣ కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి?
 • ➣ మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??
 • ➣ ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.
 • ➣ పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.
 • ➣ ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి. 
 • ➣ పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.
 • ➣ చిన్నవారందరు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.
 • ➣ మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..
వీడియో లో చూడవచ్చును:


“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

 రచన: శ్రుతి

28, సెప్టెంబర్ 2019, శనివారం

ఉత్తరాయణ కాలం - Uttarayanamఉత్తరాయణ కాలం - Uttarayanam
ఉత్తరాయణం పుణ్యకాలం
‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి.

సత్యనిష్ఠ మానవ ధర్మంగా ఉండాలి. అనుకోని క్షణంలో అనుకోని విధంగా పలకరించేందుకు మృత్యువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడొస్తుందో తెలియని మృత్యువుకు భయపడకుండా.. మానవులు తమ ధర్మం ఆచరించాలని ఆర్షవాక్కు. ఎలాంటి వాయిదాలకూ ఆస్కారం ఇవ్వకుండా దైవ, ధర్మకార్యాలు ఆచరించాలి. పగటి వేళ అయిన ఉత్తరాయణంలో దైవీశక్తులు మేల్కొని ఉంటాయి. పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలమిది.

భీష్మాచార్యులు కురుక్షేత్ర సంగ్రామంలో కుప్పకూలినా స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో ఉత్తరాయణం వచ్చే వరకు ఊపిరి విడువలేదు. ఆయన కన్నుమూయడానికి ముందు ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు ఉపదేశించాడు. ధార్మిక చింతనకు ఉత్తరాయణం పుణ్యప్రదం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పితృకార్యాలకూ ఉత్తరాయణం విశేషమైనది. ఈ కాలంలో మరణించిన వారికి పరమపదం కలుగుతుందని కొందరి విశ్వాసం.

నక్షత్రాలు ఇరవైఏడు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు. తొమ్మిది పాదాలకు ఓ రాశి. అలా పన్నెండు రాశులు 108 పాదాలలో విస్తరించి ఉంటాయి. ఈ రాశుల గుండా సూర్యుని ప్రయాణం సాగుతుంది. సూర్యుడు ఒకరాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. ఇలా ఏడాదికి పన్నెండు సంక్రమణాలు వస్తాయి. వీటిలో మకర సంక్రమణం ఉత్కృష్టమైనది. మకర సంక్రమణంతో భాస్కరుని గమనం ఉత్తర దిశగా సాగుతుంది. ఉత్తర దిక్కు మోక్షాన్ని సూచిస్తుంది. అందుచేతనే ఉత్తరాయణ పుణ్యకాలం మోక్ష సాధనకు అనువైనదిగా పెద్దలు చెబుతారు.

మకర సంక్రమణం తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు గోచరిస్తాయి. అప్పటి వరకు వణికించిన చలి మెల్లగా తగ్గుముఖం పడుతుంది. సమశీతోష్ణ స్థితి నెలకొంటుంది. ఇన్ని విశేషాలున్న ఉత్తరాయణంలో తెలుగువారికి అత్యంత ప్రియమైన సంక్రాంతి పండుగ మరో ప్రత్యేక ఆకర్షణ. పాడిపంటలకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది ఈ పర్వదినం. వ్యవసాయంతో ముడిపడిన మూడు రోజుల పండుగ ఇది. మొదటి రోజున భోగి. శ్రీ రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకుని భోగభాగ్యాలు ప్రసాదించినందున ‘భోగి’ ఏర్పడిందనేది ప్రసిద్ధం. భోగి నాడు తెల్లవారుజామునే భోగిపిడకలతో మంటలు వేసి.. ఇంట్లోని పనికిరాని సామాన్లు ఆ మంటలో వేస్తారు.

పాత పీడలు తొలగిపోయి నూతనత్వానికి స్వాగతం పలకడం ఇందులోని అంతరార్థం. అదేరోజు సాయంత్రం పిల్లలకు భోగిపండ్లు పోస్తారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రేగుపళ్లను తలపైనుంచి పోయడం ద్వారా చిన్నారులకు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. రెండో రోజు సంక్రాంతి. ప్రతి లోగిలి ధాన్యరాసులతో తులతూగాలని కోరుకునే పండుగ ఇది. కొన్ని ప్రాంతాల్లో గౌరీదేవిని పూజించి పసుపు, కుంకుమలు ముత్తైదువులకు ఇచ్చే సంప్రదాయం ఉంది. చివరి రోజైన కనుమ కర్షకుల పండుగ. పశువుల కొట్టాలను శుభ్రం చేస్తారు. పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు.
హరిదాసు 
ఈ పర్వదినం ఆచరణలో, తినే పదార్థాల వెనుక వైజ్ఞానికమైన ప్రాముఖ్యం కూడా ఉంది. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, కొవ్వు అవసరం అవుతాయి. అందుకే నువ్వులు, బెల్లం, పిండివంటలు ఆరగిస్తారు. వీటి ద్వారా చలికాలంలో శారీరంలో కలిగిన మార్పులు సర్దుకుంటాయి.

మన సంస్కృతిలో ప్రతి పండుగ సారాంశం ఇతరుల మేలు కోరడమే. పంటలు ఇళ్లకు చేరే కాలంలో వచ్చే సంక్రాంతి కూడా అలాంటిదే. రైతులు తమ పొలంలో పని చేసిన కూలీలకు, అవసరార్థులకు తోచినంత ధాన్యం ఆత్మీయంగా దానం చేస్తారు. ఈ సయయంలోనే ఊరూరా తిరిగే హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, బుడబుక్కలవాళ్లకూ ఎంతో కొంత సమర్పించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం.

14, ఆగస్టు 2019, బుధవారం

సనాతన సంస్కృతి.. సంప్రదాయాలు - ఆశ్చర్య పరిచే నిజాలు - Sanatana Sampradayalu


సనాతన సంస్కృతి.. సంప్రదాయాలు - ఆశ్చర్య పరిచే నిజాలు - Sanatana Sampradayalu
న పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక తర్కం ఉంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే.. వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలుచేశారు.

మన భారతీయులు అనుసరించే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం. అవన్నీ.. మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు.. ఇకపై వాటిని మిస్ అవకుండా పాటించేలా మీ ఆలోచనల్ని మారుస్తాయి.

1) పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు. శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు. కానీ.. మహిళలు కేవలం ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా.. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హైబ్లడ్ ప్రెజర్ ( రక్త పోటు ) సమస్యతో బాధపడేవాళ్లు. కాబట్టి మహిళలు.. ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు.. వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.

2) చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది. అందుకే.. ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు.మన భారత దేశం లో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు. చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి.. ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే .. ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు.

3) హిందూ సంప్రదాయంలో రావిచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు. దీనివెనక ఆసక్తికర రహస్యం ఉంది. రావిచెట్టు అన్ని చెట్ల కంటే.. ఎక్కువ ఆక్సిజన్ ని రాత్రి పూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల.. ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల.. ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ (ప్రాణవాయువు) గ్రహించవచ్చనే ఉద్ధేశ్యంతో.. ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు.

4) పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం. చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతి పాటించితీరాలి. ఈ మట్టెలను కాళి రెండో వేళికి ధరిస్తారు. కాలి రెండోవేళికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే.. ఈ వేలు గర్భాశయం, గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి.. రుతుక్రమం క్రమపద్ధతిలో ఉండేలా చేస్తుంది. వెండి మట్టెలే ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి, శరీరం మొత్తానికి అందిస్తుంది.

5) గంటలు కొట్టడం వల్ల మైండ్ ని రిలాక్స్ చేసి.. ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్ధం.. మెదడుకి చెందిన ఎడమ, కుడి వైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది.ఒకసారి గంట కొడితే ఏడు శబ్ధాలు వస్తాయట. ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి. నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం.. వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది.

6) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్ లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ, భూమి గురుత్వాకర్షణకు పూర్తీగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు.. ఐరన్ మెదడు దిశగా వెళ్లి.. తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే.. మనపూర్వీకులు అప్పటికే.. లాజిక్ గా ఆలోచించి.. అటువైపు తలపెట్టుకోకూడని చెప్పేవాళ్లు.

7) కుంకుమ పసుపు, నిమ్మ, మెర్క్యురీ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యురీ.. ఒత్తిడిని తొలగిస్తుంది.

8) నమస్కారం పెట్టే సంప్రదాయం వెనకా.. రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ల చివర్లు కలుస్తాయి.వేళ్ల చివరి భాగాలు కళ్లకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. రెండు చేతులు జోడించినప్పుడు.. మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే.. ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

9) గోరింటాకు అందంగా కనిపించడమే కాదు.. అద్భుతమైన మూలిక కూడా. గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో అప్లై చేస్తారు. పెళ్లి అంటే.. చాలా హడావుడి, ఆందోళన అని మనందరికీ తెలుసు.మెమందీ.. నరాలకు సాంత్వన అందించి.. శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు అప్లై చేయడం వల్ల.. నరాల చివర్లకు గోరింటాకు అంది.. ఒత్తిడిని దూరం చేస్తాయి.

10) మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదికూడా కాళ్లు మడతపెట్టి.. కూర్చుంటాం. దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన ఇస్తుంది.

11) మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తినా.. చివరగా స్వీట్స్, డిజర్ట్స్ తీసుకుంటాం. ఎందుకు అని ఎప్పుడు ఆలోచించలేదా ? దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది.స్వీట్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి.. ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు, యాసిడ్స్ ని పొట్ట దాచుకుని.. తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది.

12) పూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు. రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది.

13) ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రంచేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లినింగ్ సిస్టమ్ గా మార్చారు.ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో.. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80 శాతం నీళ్లు, 20 శాతం పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.ఉపవాసం డయాబెటిస్ ( చక్కరవ్యాధి ) , రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.

14) మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు.బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.

15) ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్నీ ,ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.

16) గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.

కొన్ని ముఖ్య సూచనలు:
 • ♦ మీరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు
 • ♦ గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు
 • ♦ మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.
 • ♦ మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
 • ♦ స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.
 • ♦ కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి నాసిని.
 • ♦ ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.
 • ♦ నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది
 • ♦ ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము
 • ♦ ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది
 • ♦ టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను
 • ♦ స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది
 • ♦ శుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ
 • ♦ కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.
 • ♦ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు
 • ♦ సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు
 • ♦ స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
 • ♦ పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను
 • ♦ ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు
 • ♦ ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది. 
కాలి వేలికి మెట్టెలు ధరించడం వల్ల…

గర్భాశయం దృఢపడుతుంది. రక్తప్రసరణను నియంత్రించి, శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది. కావున ఆధునిక పోకడలకు పోకుండా వివాహమైన స్త్రీలు మెట్టెలు ధరిస్తే , చక్కని ఆర్యోగ్యాన్ని పొందిన వారవుతారు.

17) మన ఇంట్లో డబ్బుల బీరువాలో మరియు రోజు వాడే డబ్బుల పరుసు లోను మన వీలును బట్టి 786 (ఓం- సంకేతం)నంబరు ఆఖరుగ ఉన్న అంటే (ఉదాహరణకు నంబరు 9HH 9000786)పది,వనఁదా,వెయ్యి ఏ నోటు అయినా పెట్టుకోవాలి .ఆ నోటును ఎప్పుడు ఖర్చుకు వాడరాదు.యిలా చేయడం అదృష్టం కలిసి రావటానికి సంకేతం.

18) మన శాస్త్రం, తరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశ దానాలు చేసి 

తరువాత వధువు చేతిలో కొబ్బరిబోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి కాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే.

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

ఓం 

16, మే 2019, గురువారం

నేటి ఆధునిక యుగంలో మన సంప్రదాయాలు, ఆచారాలు - Bharatiya Aacharalu

నేటి ఆధునిక యుగంలో మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు - Bharatiya Aacharalu
ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం. ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహారాలే. ప్రతి దెశానికీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి.

ఐతే భారతదేశంతో పోలిస్తే ఆయా సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సాంఘిక వ్యవస్థలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాని భారతీయ సాంఘిక వ్యవస్థ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఇతర దేశాలకు ఓ సరికొత్త దిశను చూపుతున్నాయి.

భారతదేశంలో ఉన్నా, మరే ఇతర దేశంలో ఉన్నా స్వదేశీయుడైనా, విదేశీయుడైనా; చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరి నోటా వినిపించే ఏకైక మాట "ఇండియన్ కల్చర్" "Indian Culture" "భారతీయ సంస్కృతి ". వేరే ఏ ఇతర దేశమైనా తమ దేశం పేరుపెట్టి ఉచ్చరించడానికి సంశయించే కల్చర్ అన్న పదానికున్న గౌరవం ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కడం వెనక ఉన్న భారతీయ సంస్కృతి , చరిత్ర యొక్క ఘనత తేటతెల్లమవుతున్నాయి.

ప్రక్రుతితో మనకున్న బంధంకానీ, వివాహ మరియు కుటుంబ వ్యవస్థ పట్ల మనకున్న గౌరవం వల్లకానీ మన సంప్రదాయాలకో ఘనమైన కీర్తి దక్కింది.భారతదేశ ఆవిర్భావం నాటినుండీ ఒక ప్రత్యేక క్రమశిక్షణ కోసం కొన్ని రూపొందించబడితే మరికొన్ని సంప్రదాయాలు మనలో అంతర్భాగంగా వాటంతటకవే స్రుష్టించబడ్డాయి. స్రుష్టి గతాను క్రమంలో ఇదో అద్భుతమై ఖండాంతరాలలో మనకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థను చాటాయి. ఇతర దేశాలకు మార్గదర్శకాలయ్యాయి.
విదేశీ యోగి 
మన వేద విజ్ఞానాన్ని పాశ్చాత్యులు అనుసరిస్తున్నారు. యోగ నేర్చుకునేందుకు మన దేశానికే తరచూ వస్తునారు.

భారతీయుల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని గేలి చేసినా ఆ సెంటిమెంటే మనలోని భాషాపరమైన, మతపరమైన భిన్నత్వాన్ని ఏకత్వంగా చూపిస్తుంది. మనల్ని ఏకతాటిపై నిలుపుతోంది. నవీన తరానికి నేటి ఆచార వ్యవహారాలు చాందసంగా అనిపించినా ఆ చాందసత్వమే వారి పాలిట వరమని కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకునేలా చేస్తుంది.

ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు మనం ఎన్నో నియమ నిబంధనలను అనుసరిస్తుంటాం.సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం. ఇది మన ఆచార వ్యవహారాలలోని ఓ అంకమైనా దాని వెనుక ఓ గొప్ప సాధన యోగం ఉంది. అదే ఆరోగ్యానికి మూల కారణంగా నిలుస్తుంది. ఆ చిన్న రహస్యం తెలుసుకుంటే చాలు ప్రతి ఆచారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ సంజీవనిగా మనకు బోధపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గులేయడం. మన పూర్వీకులు పెట్టిన ఈ సంప్రాదాయం శుభ మంగళానికి చిహ్నంగా కళ్ళకు కనబడుతున్నా, వీధిలోని బ్యాక్టీరియా ఇంటిలోకి రాకుండా నియంత్రించే ఒక ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది.

కొన్ని ఆరోగ్యానికి సూత్రాలుగా నిలిస్తే, మరికొన్ని నడవడికకు మార్గదర్శిగా నిలుస్తాయి. అజ్ఞానాన్నీ, అహంకారాన్నీ కొన్ని తొలగిస్తే కొన్ని అరాచకం ప్రబలకుండా నియంత్రిస్తాయి. ఆరోగ్యం దేహానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఎంత అవసరమో ఈ కట్టుబాట్లు తెలియజేస్తాయి. ఆరోగ్యకరమైన సమాజమంటే మిత్రభేదం లేని ఆహ్లాదకరమైన సమాజం. అశాంతులకి అవకాశమీయని నాగరిక సమాజం. అటువంటి సమాజం కావాలంటే కట్టుబాట్లనేవి ఇంటినుంచే ప్రారంభం కావాలి.

ఇంట్లో పాటించే అనేక కట్టుబాట్లు కట్టుదిట్టమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. మనం చేసే ఉపవాస దీక్షలు పరులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏ విధంగా అంటే ఉపవాసం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనిషిలో మానసిక ఎదుగుదల వస్తుంది. మానసికంగా పరిపూర్ణుడైన వ్యక్తి లో ఇరుగు పొరుగు అనే భావన కలుగుతుంది. తన అనే భేద భావం పోయి మన అనే ఆలోచన కలుగుతుంది. అది అతని పొరుగువారికి ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది. సమాజ నిర్మాణంలోపాలుపంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రార్ధనా స్థలాలకు వెళ్ళడం, జాగరణలు చేయడం ఇవన్నీ మన సంస్ర్కుతిలో భాగాలు. వీటి వల్ల శాంతి ప్రవర్తన కలిగి, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది.
పెళ్ళి ఆచారాలు
పెళ్ళి  ఆచారాలు
ఈ సాంఘికాచారాలనే సంస్కారాలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని ఆరోగ్యం కోసం చేసేవైతే, మరికొన్ని ఇంటిపై ఇతర చెడు ప్రభావాలు (దిష్టి) పడకూడదని చేసేవి. ఈ సంస్కారాల్లో ముఖ్యమైనవి పెళ్ళి, నామకరణము, అన్నప్రాశనము, పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టించుట, అక్షరాభ్యాసము, ఉపనయనం మొదలైనవి. స్త్రీలకు ప్రత్యేకంగా సీమంతము అనే ఆచారముంది. సీమంతమంటే గర్భిణి స్త్రీకి ఆరవ నెలలో చేసే శుభ సంస్కారం.

పెళ్ళిలో రెండు విధాలైన ఆచారాలు ఉంటాయి. అవి ఆర్యాచారాలు, దేశీయాచారాలు. పాణిగ్రహణము, సప్తపది ఆర్యాచారాలు. కాబట్టే వీటిని వైదిక మంత్రాల ద్వారా నిర్వహిస్తారు. మంగళసూత్రధారణ దేశీయాచారము. కాబట్టి దీన్ని మంత్రాలతో కాక శ్లోకాలతో నిర్వహిస్తారు. అనేక వేడుకల సంగమమే పెళ్ళి. కొత్త దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి పెద్దలు అనేక వేడుకలు చేస్తారు. పూల చెండ్లతో బంతులాట ఒకటి. తరువాత అయిరేని కుండలలో బంగారం, వెండి ఉంగరాలు వేసి దంపతులచే తీయించడం మరోటి. వీటన్నింటిలోనూ తలంబ్రాలు పోసుకొనుటలో ఎంతో వినోదం ఉంటుంది. ఇటివంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచీ వస్తూ మన నిత్య జీవితంలో అంతర్భాగాలైపోయాయి.

ఐతే ఈ సాంఘికాచారాలు చాలావరకు స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. ఇంటి ఆడపిల్లను ఒక గ్రుహిణిగా తీర్చిదిద్దేందుకు చేసే పద్ధతులే ఈ ఆచారాలు. ఓర్పు, మితభాషిత్వం నేర్పేందుకు మౌనవ్రతము లేదా మూగ నోము అనే అచారము ఏర్పదింది. మూగనోము దీపావళి వెళ్ళిన మరునాటినుంచి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు పదిహేను రోజులపాటు చేస్తారు. ఇవికాక ఇంకా చిన్న చిన్న నోములు బాలికలకు అనేకం ఉంటాయి. శ్రావణ మాసంలో చేసె గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇంకా...అట్లతద్దె, నాగుల చవితి, బొమ్మల నోము మొదలైనవి. కొందరు మొక్క మొలిచిన కంద దుంపను తెచ్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. దీనివల్ల కందపిలకలవలే సంతనాభివ్రుద్ధి జరుగుతుందని వీరి నమ్మకము.

ఊయల
ఊయల
అట్లతద్దె నాదు ప్రొద్దున్నే నిద్రలేచి, తలారా స్నానాలు చేసి, పెరుగన్నం తింటారు. ఆ తరువాత పెద్దలు అట్లు పోసి చుట్టుప్రక్కలవారికి పంచడం చేస్తుంటారు. అత్లతద్దె నాటి వేడుకలలో అత్యంత ముఖ్యమైనది ఊయలలు వేయడం. ఈ ఊయలలు ఇళ్ళలోనే కాకుండా ఊరంతా అనుకూలంగా ఉన్నచోటల్లా వేస్తారు. ముఖ్యంగా తాటి చెట్టు బోదెలతో వేసె అతి పెద్ద ఊయలలు ఊరంతా వినోదాన్ని నింపుతాయి.
బతకమ్మ పండుగ - Bathukamma Festival
బతకమ్మ పండుగ - Bathukamma Festival
తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు బతకమ్మ పండుగను ఎంతో ఘనంగా చేస్తారు. బతకమ్మను చెరువులో వాలారించి చల్దులు తిని ఇంటికొస్తారు. స్త్రీలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో చేసే వ్రతం నాగులచవితి. పాము పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోసి, మొక్కుకుంటారు. నాగెంద్రునికి వేది వస్తువులు పెట్టరు. ప్రధానంగా చలిమిడి పెదతారు. ఇదే కాకుండా గ్రామ దేవతను సంత్రుప్తిపరిచేందుకు బోనాలు పెడతారు. బోనము అంటే అన్నం వండి పెరుగు, స్వీటు చేసి, ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి బోనమును దానిలో పెట్టి గ్రామ దేవతకు సమర్పించడం.
ఇవేకాక స్త్రీలు చేసె మరో చక్కని వ్రతము బొమ్మల నోము. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. 
కోడి పందేలు
కోడి పందేలు
పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే పురుషుల వినోదాలు ఎక్కువ.

ఏదేమైనా పురాతనకాలం నాటి ఆచార వ్యవహారాలను వీడకుండా వాటిని చెక్కుచెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. వాటి మనుగడకోసం క్రమశిక్షణతో క్రుషి చేస్తున్నారు. తమ తమ వారసులకు వాటి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. ఆ సంప్రదాయాలను కాపాడుకుంటూవస్తున్నారు. సంస్కృతీ సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాతుతున్న భారతదెశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అందుకు ఆధారం ప్రపంచ దేశాలు మన సంస్ర్కుతి పట్ల ఆకర్షితులవడమే.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకూ అందుతూనే ఉంది.ఆ సంపదను కలసిమెలసి అనుభవించడం, ఆ ఆనందాన్ని నలుగురితోనూ పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. ఆ ఆనందాలకు శాశ్వతత్వం చేకూర్చవలసిన బాధ్యత అందరి మీదా ఉంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
పెనుశిల ధర్మ పరిరక్షణ సమితి

1, నవంబర్ 2017, బుధవారం

నమస్కారములు అంటే ఏమిటి ? అవి ఎన్ని?

namaskaram ante yemiti

నమస్కారములు:
నమస్కారములు చాలా విధములు అందులో

1. సాష్టాంగ నమస్కారము:- ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా, పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.

2. పంచాంగ నమస్కారము:- పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.

3. అభివాద నమస్కారము:- ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను, వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.

4. ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి, అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది, వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

14, అక్టోబర్ 2017, శనివారం

పాము - సర్పముతో మానవునికి ఉన్న అనుబంధము !

human-relationship-with-the-serpent-paamutho-manavudu

ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు
అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

పాశ్యాత్యదేశాల్లో పాముల గురించి వ్యతిరేక భావం ఉండడానికి ప్రధాన కారణం క్రైస్తవ మతంలోని కొన్ని అంశాలలో పాముల గురించి చాలా అవాస్తవంగా వివరించటమే. పాముని దెయ్యానికి ప్రతినిధిగా, అదొక వ్యతిరేక శక్తిగా వారు భావిండానికి ఒక కారణం, పాము ఈవ్ను యాపిల్ పండు తినేందుకు ప్రోత్సహించడం అయివుండవచ్చు. ఈ భూమి మీద ఇద్దరు మూర్ఖులు ఆడం ఈవ్  లు ఉండేవారు. వాళ్ళకి కనీసం తమతో తాము ఏమి చేసుకోవాలో కూడా తెలియలేదు. చూడండి, ఒక యువకుడు గానీ, ఒక యువతి గానీ ఎరుకతో, మనఃపూర్వకంగా తమ లైంగికతను అధిగమించగలిగినట్లైతే, అదొక అద్భుత విషయం, కాని, కనీసం వారి లైంగికత కూడా వారికి తెలియకుండా ఉండటం మూర్ఖత్వానికి ప్రతీక. వారు ఆత్మజ్ఞానం పొందిన స్వేచ్ఛాజీవులు కారు. వారు మూర్ఖులు. ఎంత మూర్ఖులంటే వాళ్ళకు అసలు ఆత్మజ్ఞానం, స్వేచ్చ అంటే ఏమిటో కూడా తెలియదు. అట్టి పరిస్థితులలో జీవం కొనసాగే అవకాశమే లేదు. అప్పుడు పాము అక్కడ ప్రవేశించి ఈవ్ ని ప్రలోభపరచింది. అది ఈవ్ ని ప్రలోభపరచి యాపిల్ తినేలా చేసి ఈ భూమి మీద జీవం కొనసాగేలా చేసింది.
ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే
మీరు ఈ భూమి మీద జీవరాశి అంతా దేవుని సృష్టి అని నమ్ముతున్నట్లైతే, అలాగే ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసింది పాము అయితే, అప్పుడు పాము దేవుని ప్రతినిధా లేక దెయ్యం ప్రతినిధా చెప్పండి? అది తప్పక దేవుడి ప్రతినిధే! అవునా, కాదా? ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే. జీవ ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకులు, జీవ ప్రక్రియ గురించి కనీస అవగాహన కూడా లేని మూర్ఖులు, ప్రాథమిక శరీర నిర్మాణం గురించి కూడా తెలియని వారు మాత్రమే భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాముని దెయ్యం ప్రతినిధి అంటారు. జీవ ప్రక్రియ తెలిసినవారెవరైనా ఖచ్చితంగా పాముని దేవుడి ప్రతినిధిగానే చూస్తారు.

ఇక్కడ ఈ సంస్కృతిలో పాముని మనం దేవుని ప్రతినిధిగానే చూస్తాం. శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అదీ పాదాల వద్ద కాదు తన తలపై. జీవపరిణామ ప్రక్రియలో మానవ జన్మ వైపు పడిన అడుగులలో పాము జన్మ ఒక ముఖ్యమైన అడుగుగా చూడబడుతున్నది. అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాములు ఉంటాయి.
నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.
శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అదీ పాదాల వద్ద కాదు, తన తలపై
పాముని దెయ్యం ప్రతినిధిగా భావించడం ఎంతో బాధాకరమైన విషయం. అది అజ్ఞానం వల్ల ఏర్పడిన భావన. పాము ఈవ్ యాపిల్ నితినేలా ప్రోత్సహించిందని ప్రపంచంలో సగంమంది పాముని దెయ్యం ప్రతినిధిగా భావిస్తున్నారు. అసలు యాపిల్ తినటం అనేది చెడ్డ పని కాదు. ఒకవేళ భగవంతుడు మానవ సృష్టిని కొనసాగించదలచుకోకపోతే అసలా సంఘటన జరిగేదే కాదు. అలా ఆ యాపిల్ తినటమే ఈ భూమిపై జీవరాశి ఉద్భవానికి కారణమయింది. అదే జీవానికి మూలం. జీవం దేవుని సృష్టి అయితే, పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే. జీవ వ్యతిరేకులు మాత్రమే పాముని దెయ్యం ప్రతినిధి అని అంటారు. ఎవరు జీవాన్ని నమ్ముతారో, జీవానుకూలంగా ఉంటారో, వారు సహజంగానే పాముని జీవప్రేరణ శక్తిగా చూస్తారు. అందుకని ఏది జీవితాన్ని ప్రేరేపిస్తుందో, అది ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే అయివుండాలి, దెయ్యం ప్రతినిధి కానే కాదు. ____సద్గురు


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ ఎందుకు వస్తోంది ? - Why is the confrontation between old and new?


ఇప్పుడు పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. వయోధికుల అనుభవమూ, యువతకున్న శక్తీ రెండూ కలిసి పనిచేసేటట్లు చేయడం ఎలా?

వాళ్లు ఇప్పుడే కాదు, ఎప్పుడూ పరస్పర వ్యతిరేకంగానే ఉన్నారు. అసలు సమస్య ఏమిటంటే ముసలితరం తాము ముసలి వాళ్లమనుకోవడం లేదు. యువతరం తీసుకోవాలనుకుంటున్న స్థానాన్ని వృద్ధతరం ఖాళీ చేయడం లేదు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే జంతువుల పరిస్థితీ ఇదే. మీరు కొన్నిసార్లు గమనించవచ్చు. యౌవనావస్థలోని మగ ఏనుగు క్రోధంతో అన్నీ విరిచి వేయడం, ధ్వంసం చేయడం చూడవచ్చు. గుంపులోని మరో పెద్ద మగ ఏనుగుతో అది పోరాడ వలసి రావడమే దీనికి కారణం. ఆ మగ ఏనుగు తన స్థానం ఖాళీ చేయడంలేదు,  ఆ స్థానం కోసం ఈ యువ మగ ఏనుగు పోరాడుతూ ఉంది. కాని దానికింకా ఆ శక్తి రాలేదు, అందుకే అంత కోపం – అదే కౌమారం..!

అందుకే భారతీయ సంస్కృతిలో వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచారు. 0-12 సంవత్సరాల వరకు బాలావస్థ, ఈ దశ కేవలం ఆట పాటలకే – శరీరమూ, బుధీ వృద్ధి చెందాలి. 12-24 సంవత్సరాల మధ్య బ్రహ్మ చర్యం – మీ శరీరానికి, మనస్సుకు క్రమశిక్షణ అలవారిచే సమయం. మీ శక్తిని అభివృద్ధి చేసుకోవాలి, శక్తిమంతులు కావాలి. 24 ఏళ్ల వయస్సులో జీవితాన్ని మీరు స్పష్టంగా చూడగలిగితే, ఈ సంసారాన్ని సాగరాన్ని ఈద దలచుకోకపోతే, సన్యాసులవుతారు. లేకపోతే పెళ్లి చేసుకుని, గృహస్థులవుతారు. మీరు 24 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటే, రెండు సూర్య ఆవృత్తుల తర్వాత అంటే మరో 24 ఏళ్ల తర్వాత మీరు 48 ఏళ్ల వాళ్లవుతారు. అంటే ఆ సమయానికి మీ పిల్లలు యుక్తవయసుకు వస్తారు-  పొట్ల గిత్తల స్వభావం ఉంటుంది. మీరు తప్పుకోవాలని వాళ్లనుకుంటారు, కానీ చెప్పలేరు.

అందువల్ల 48 సంవత్సరాల వయసులో దంపతులు వేరు వేరు మార్గాలలో వెళతారు. భర్త ఒక సంస్థలోకి, భార్య మరో సంస్థలోకి. 12 ఏళ్లపాటు తమ తమ ఆధ్యాత్మిక సాధనలో గడుపుతారు. 60 ఏళ్లకు మళ్లీ కలుసుకొని, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మీరు వేరువేరుగా పోవడం లేదు కాని 60లో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మీరు పన్నెండేళ్లు ఎడంగా వెళ్లాల్సి ఉంది. మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు దేహావసరాలో, భావోద్వేగాలో, మరొకటో మిమ్మల్ని వశీకరించుకొని ఉండవచ్చు. ఇప్పుడవన్నీ అయిపోయాయి. మీరు 12 ఏళ్ల ఆధ్యాత్మిక సాధన చేశారు. మీరు భిన్న పద్ధతిలో ఒకటి కావడానికి వచ్చారు. కలిసి వాన ప్రస్థానానికి వెళతారు. మీ జీవితంలో చివరి భాగం గడపడానికి అడవికి వెళతారు.
ఇప్పుడు వెళ్ళదచుకోవడం లేదు, పిల్లలు వెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ప్రపంచంలో తమ కాళ్లూనుకుంటే వాళ్లు ఎట్లాగూ వెళతారు. వాళ్లు కూళ్లూనుకోకపోతేనే సమస్య, అప్పుడే ఘర్షణ.
ఎవరిస్థలం వారికి కావాలి:

తమంతట తాము తల్లిదండ్రులనో, పిల్లలమనో అనుకొంటున్నారు, దీనికి కారణం మనోభావాలే. కాని జీవిత వాస్తవంలోకి వస్తే స్థానంకోసం, ఆధిపత్యం కోసం సంఘర్షించే పెద్ద వృషభం, చిన్న వృషభం. పురుషులు ఒక విధంగా ప్రవర్తిస్తే, స్త్రీలు ఒక రకంగా ప్రవర్తిస్తారు. కాని ప్రాథమిక సమస్య ఒకటే – మీకు స్థానం కావాలి, వాళ్లు స్థానం ఖాళీ చేయడం లేదు – ఘర్షణలు జరుగుతాయి. తల్లిదండ్రులకు దూరంగా జీవించే పిల్లలు ఎప్పుడూ వారిని ప్రేమిస్తుంటారు. కానీ, వాళ్లు మీతో ఉంటే ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటారు – దీనికి కారణం మీరు చెడ్డవారో, వాళ్లు చెడ్డవారో కావడం కాదు. మీకు ఒక రకమైన వాతావరణం అవసరమైతే, వాళ్లకు మరో రకమైన వాతావరణం అవసరం. ఇద్దరూ ఒకే చోట ఉంటే వేడి పుడుతుంది.

ఇది కొత్త సమస్య ఏమీ కాదు. మానవుడు గుహల్లో జీవించినప్పుడు కూడా ఈ సమస్య ఉండి ఉంటుంది. మనం దీన్నెలా పరిష్కరించుకోవాలి? పెద్దలు పక్కకు తప్పుకోవడం నేర్చుకోవాలి. పిన్నలను ఆ స్థలం ఆక్రమించుకోనివ్వాలి. పెద్దలు ఒక స్థాయి వివేకాన్ని, అనుభవాన్ని ప్రదర్శించాలి, అది పిన్నలకు వారిపట్ల గౌరవాన్ని కలిగించాలి. మీరలా చేయకపోతే యువత మిమ్మల్ని ఏవగించుకుంటుంది, అనేక విధాలుగా మొరటుగా ప్రవర్తిస్తుంది. మీరు పెద్ద వాళ్లయ్యే కొద్దీ ఒక స్థాయి వివేకాన్ని, జీవితంలో అంతః దృష్టిని సంపాదించుకుంటే – దాన్ని పిన్నలింకా సంపాదించుకోవలసి ఉంటుంది – వాళ్లు ఆదర్శం కోసం మీ వైపు చూస్తారు. అప్పుడు దాదాపుగా మీరు అదే స్థలంలో ఉండవచ్చు. మీరు మొదటి అంతస్తులో ఉండండి.. వాళ్లను కింది అంతస్తులో ఉండి మీ కోసం పైకి చూడనీయండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

1, జులై 2017, శనివారం

మహా కుంభ మేళా - Maha Kumbh Mela

ప్రపంచ దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం.  హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగః అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతీ నదులు ఈ క్షేత్రంలోనే సంగ మించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరొచ్చింది. దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మను గడకు నీరే ఆధారం. కనుక దీన్నిబట్టి నది నీటిని, అందులోనూ గంగానదినే మనం ప్రధమంగా స్మరిస్తాం. సమస్త దేవతలు నివసించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ.

పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తూ అన్నీ పాపాలు పోతాయని హిందువుల భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తుంటాయి. వీటికి అంతర్వాహినిగా సరస్వతీ నదిగా కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటారు. పర్వదినాల్లో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాక కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.

కుంభమేళా ప్రాశస్త్యం:

కుంభమేళాకు హిందూపురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం
సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు. దేవ, దానవులు సముద్ర మధనం చేస్తూండగా అమృత కలశం ఒకటి బయటకు వస్తుంది. అమృతం కోసం దేవ
దానవులు పన్నెండు రోజులు, పన్నెండు రాత్రులు (మనుష్యుల ప్రకారం 12 సంవత్సరాలు) ఘోర యుద్ధం చేశారు. దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు
మహా విష్ణువును ప్రార్థించగా, స్వామి మోహిని అవతారం ఎత్తుతారు. విష్ణువు చేతిలోని కలశం నుంచి నాలుగు అమృత చుక్కలు అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని నాసిక్‌లలోని
పుణ్యనదుల్లో పడ్డాయని భాగవతం, విష్ణుపురాణం, మహాభారతం, రామాయణం తదితర పురాణాల కథనం. మరో కథ కూడా ఉంది. సాగర మధనంలో ఉద్భవించిన అమృత కలశాన్నిమోహిని అవతారం లోని విష్ణువు తన వాహనమైన గరుడుడి కిచ్చి భద్రపరచ మంటాడు. గరుడుడు కలశాన్ని తీసుకెళ్తుండగా నాలుగు చోట్ల ఈ చుక్కలు పడతాయట.
ఆ నాలుగు చోట్లే ''ప్రయాగ'' అలహాబాద్‌లోని ''హరిద్వార్‌'' (ఉత్తర ప్రదేశ్‌) ''నాసిక్‌'' (మహాష్ట్ర) ''ఉజ్జయిని'' (మధ్యప్రదేశ్‌) అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ప్రతి
మూడేళ్లకోసారి ఒక్కోచోట రొటేషన్‌ పద్ధతిలో కుంభమేళా జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి పన్నేండేళ్లకోసారి కుంభమేళా జరుగుతున్నది.

మహా కుంభ మేళా-చరిత్ర,విశిష్టత:
 -కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనే ది ఒక రాశి. మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందు ధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి. వేద కాలం నుంచి కుంభమేళా ఆచరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత భాండానికై దేవ-దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు భాండాన్ని తీసుకొని పోతుండగా అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారవిడిచారని నమ్ముతారు.
అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా  జరుగుతుంది. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా  జరుగుతుందన్నమాట.

ఆరేళ్లకోసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని.. పన్నెండేళ్లకొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇక చరిత్రలో క్రీ.శ 629 ప్రాంతంలో హర్షవర్ధనుడి కాలంలో భారత పర్యటన చేసిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ రచనల్లో సైతం కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ది సీబీఎస్‌ సండే మార్నింగ్‌ అనే
ప్రముఖ అమెరికన్‌ షో 18, 2010 హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమంగా అభివర్ణించింది.ఏప్రిల్‌ 28, 2010న బీబీసీ కుంభమేళాను ..గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌ గా ఒక రిపోర్టును వెలువరించింది. దీన్ని బట్టి కుంభమేళ ఎంత ప్రశస్తమైందో తెలుసుకోవచ్చు.

సమయం
సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అహాబాద్‌ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి-మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.

ఆచార వ్యవహారాలు
-ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాతో పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితి. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ప్రత్యేత. పురాతన సాంప్ర దాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్‌ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు.

ఏ రోజుల్లో ప్రశస్తమంటే
కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. ఈ ఏడాది జనవరి 14 (మకర సంక్రాంతి), 27 (పౌర్ణమి), ఫిబ్రవరి 6 (ఏకాదశి), 10 (అమవాస్య), 15 (వసంత పంచమి), 17 (రథ సప్తమి), 18 (భీష్మాష్టమి), 25 (మాఘ పౌర్ణమి) దినాలలో ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు స్నానాలు చేయటానికి వస్తారని భావిస్తున్నారు.

రివేణి సంగమంలో ఆధ్యాత్మిక సంరంభం మహా కుంభమేళా -

అలహాబాద్‌ : మహాకుంభమేళా..ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ధార్మిక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. యావత్‌ హిందువులు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించే అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలను ఉత్తరాదిన కుంభమేళా అంటారు.
అలా 12 పర్యాయాలు వచ్చే కుంభమేళాను ’మహా కుంభ మేళా’గా పిలుస్తారు. ఇప్పుడు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగనుంది. ఈ నెల 14 నుంచి 56 రోజులపాటు జరిగే కుంభమేళా కోసం ఉత్తర్రపదేశ్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించింది. గత కుంభమేళా కన్నా ఈ సంవత్సరం 10 శాతం ఎక్కువ మంది భక్త జనం పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 1.1 కోట్ల మంది భక్తులు త్రివేణి పుణ్య తీర్థంలో స్నానమాచరించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసేందుకు అటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. భారీ ఎత్తున భక్తులు, ఆధ్యాత్మిక గురువులు హాజవుతున్నందున వీరం దరికీ భద్రత ఏర్పాట్లు ఒకింత కష్టమే అయినప్పటికీ అటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం విస్తృతమైన కార్యచరణతో ముందుకు వెళ్తుంది.

ఉగ్రవాద దాడులు జరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో దాదాపు 7000 మంది కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దిగనున్నారు. అలాగే పలు కంపెనీల రాపిడ్‌ యాక్షన్‌
దళాలు, కేంద్ర విపత్తు నివారణ సంస్థ సిబ్బం దిని కుంభమేళా భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నారు. -అలహాబాద్‌ ఐజీ అలోక్‌నాథ్‌ను శాంతి భద్రతల ఏర్పాట్లకై నోడల్‌ అధికారిగా నియమించారు. 2016లో కుంభమేళా జరిగినప్రాంతం దాదాపు 2,802 ఎకరాలు ఉంటే.. ఈసారి అది 4,932 ఎకరాలకు పెరిగింది. స్నానఘట్టాల వద్ద అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కుంభనగరిలో 600 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఇప్పటికే పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

10, జూన్ 2017, శనివారం

భక్తి - Devotion ( Bhakti )

భక్తి - Devotion ( Bhakti )

భక్తి మార్గము :
ముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము . జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి . కాల ప్రవాహానికి ఒడిదుడుకులకు అతీతమయినది భక్తి . హిందూధర్మ సంస్కృతిలో భక్తి గురించిన విశేషాలు అనేకానేకము ఉన్నాయి . సాధకులు , ఆరాధకులు ఏవిధమ్ముగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి . భక్తి తో తన ఇస్టదైవాన్ని ఆరాధిస్తే మనస్శాంతి కలుగు తుంది . మనసు లో చెడు ఆలోనచలము తావుండదు . . . సన్మారగము లో నడిచేందుకు వీలుపడుతుంది . ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును . నిత్యజీననం లో వత్తిళ్ళకు , వడిదుడుకులకు తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది . మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము . భక్తి తో వీటినన్నింటినీ అధిగమించవచ్చును .
 • భగవంతుదుని ఆరాధించడమే భక్తి అని పరాశరుడు తెలియజేసాడు .
 • భగవంతుని లీలావిశేషాల గురించి తెలుసుకోవడమే భక్తి అని గార్గుడు తెలియజెప్పాడు .
 • మన:పరిపక్వ సాధనే భక్తి అని అంటాడు శాండిల్యుడు .
 • రామానుజాచార్యులు , మధ్యాచార్యులు కూడా భక్తి మార్గము గురించి ఉత్తమోత్తమము గా తెలియజేసారు .
 • కర్మ , జ్ఞాన , యోగ మార్గదర్శకమే భక్తి మార్గము . గుణ , రూప , పూజ , సఖ్య , వాత్సల్య , మాధుర్య , ఆత్మనివేధన , తన్మయ మరియు విరహ - ఇలా అనేక భక్తి మార్గాల గురించి నారదభక్తి సూత్రాలలో వివరించబదింది .
అదేవిధం గా భగవద్గీతలోని అనేక అధ్యాయాలలో భక్తి ప్రాశస్యం మనకు గోచరిస్తుంది . ఉదాహరణకి ....

శ్రవణ భక్తి , కీర్తం భక్తి , స్మరణ భక్తి , పాదసేవ భక్తి , వందనభక్తి , దాస్య భక్తి , అర్చనభక్తి , స్నేహభక్తి , అత్మానుసందాన్యభక్తి , మొదలైనవి .
 • భక్తి మారగములో ద్యాన భక్తికి ఒక ప్రత్యేకత ఉంది ... త్యాగరాజు , పురందరదాసు మొదలైన వారు భక్తిపారమార్ధ్యాన్ని పానం చేసిన మహనీయులు .
 • కీర్తన భక్తి కి - రామదాసు , అన్నమయ్య
 • శ్రవణభక్తికి - గోపికలు , రుక్మిణి ,
 • స్మరణభక్తి కి - నారద , తుంబుర , ప్రహ్లాదులు ,
 • పాదసేవన భక్తి కి - శబరి , భరతుడు , లక్ష్మణుడు ,
 • అర్చన భక్తికి - కన్నప్ప , ఏకలవ్యుడు , నంది ,
 • వందన భక్తి కి - మానవులు ,
 • దాస్య భక్తి కి - హనుమంతుడు , గరుత్మంతుడు ,
 • స్నేహభక్తి కి - సుగ్రీవుడు , విభీషణుడు ,
 • ఆత్మనివేదన భక్తికి - కుబేరుడు , అర్జునుడు .
భక్తి మార్గము లో గట్టి పట్టుదల ఉండాలి , దృఢమైన ప్రతి్జ్ఞ చేసుకోవాలి అప్పుడే కార్య సాధకుడవుతాడు .

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

28, మే 2017, ఆదివారం

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో , సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము . ఇది ఒక సనాతన , కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము . ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి . ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ... అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి , చేయించాలి .

ప్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు , బంధుమిత్ర అనుబంధాలు , ఆప్యాయతలు మెండుగా ఉండేవి . పండుగులకు , పబ్బాలకు , ఉత్సవాలకు , గ్రామ వేడుకలకు , ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు . అది ఎంతో మంచి సంప్రదాయము . నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక , టైం లేదని వాపోతుంటారు . మన సంస్కృతిలోని పురాణ కథలు , వ్రతాలు , నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు , చరిత్రలు మన తరువాత తరమువారికి అందించే భాద్యత మన అందరిపైనా ఉన్నది .

తోడబుట్టిన స్త్రీ సంతానాన్ని " భగిని" అంటారు . ఆమె హస్తము తో చేసిన (చేతితో వండిన)భోజనాన్ని చేయడాన్ని భగినీహస్త భోజనము అంటారు . కార్తీక మాసము ప్రవేశించిన 2 వ రోజున ఈ బోజనాలు చేయాలన్నది శాస్త్రము . ఇక్కడ రెండు వేరు వేరు కాలలో చెప్పబడిన కదనాలు ఉన్నాయి. ఒక కాలము లో బలిచక్రవర్తిని , ఇంకోకాలము లో యమధర్మరాజుని వారి వారి చెల్లి , లేదా అక్క (ఇక్కడ అన్నా-చెల్లెలు , అక్కా-తమ్ముడు ... అంటే తమ సోదరుల్ని (సమానమైన ఉదరము అంటే ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వాళ్ళని ) తమ ఇంటికి కనీసము ఏడాదికి ఒకసారైనా వచ్చి తమ చేతి భోజనము తిని వెళ్ళవలసిందిగా కోరారట .  కార్తీక శుద్ద విదియ నాడు వస్తామని ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటినిచ్చి అలాగే జీవితాంతము చేశారని పురాణం లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు తమ సోదరి (ల) ఇంటికి వెళ్ళి భోజనము చేసి కానుకలు , వస్త్రాలు పెట్టి -- అక్క ఇంటికెళ్తే ఆమె ఆశీర్వాదాన్ని పొందాలని , చెల్లిలయితే ఆమె ను ఆశీర్వదించి రావాలని ... ఓ నియమము చేసింది శాస్త్రము . ... అదే " భగినీ హస్తభోజనము "

దీపావళి పండుగ తరువాత వచ్చే విదియ యమద్వితీయ , లేక భ్రాతృద్వితీయ . ఆ రోజు ప్రతి పురుషుడు తమ చెల్లెలు ఇంటనో ... చెల్లెలు లేనట్లైతే చెల్లెలు వరస ఇంటనో , అక్క ఇంటనో భోజనము చేయాలి . ఈ పండుగ నియమ నిభందనాలలో ఇదొకటి . సూర్య భగవానుని సంతానమైన యమున (కూతురు) యమధర్మరాజు కవలపిల్లలు ... చెల్లెలు తన ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా పని భారముతో యముడు వెళ్ళడం కుదరలేదు . . . చివరకు ఒకరోజు అనగా దీపావళి తరువాత విదియ నాడు వెళ్ళి చెల్లెలి ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి ... వస్త్రాభరణాలు , కట్న , కానుకలు ఇచ్చాడంటారు . అలా ప్రతిసంవత్సరమూ చేస్తూఉంటాడని నమ్మకము . కార్తీక శుద్ధవిదియనాడు భ్రాతృపూజ అని ఈ ఆచారానిని అంటారు .

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
జీవితాన్నీ , ఈ జన్మనీ పొందింది అక్కడెక్కడో శరీర -ఇంద్రియ -ప్రాణాలని ఫణము గా పెట్టి  ఉద్యోగము చేస్తూ గడిపేయడానికేనా?.. కాదు . ఒక అన్నా లేదా తమ్ముడూ ఓ సోదరి ఇంటికి వెళ్తే ఆమె ఇంటి పరిస్థితి ఎలాఉందో , మేనళ్ళుడూ ,మేనకోడలూ ఎలా ఉన్నారో, తమ సోదరి పట్ల బావగారు లేదా బావమరిది  ప్రవర్తన ఎలా ఉందో , ఇలా అన్నివిషయాలు ప్రత్యక్షము గా తెలుస్తోంది. మరి అన్న లేదా తమ్ముడే ఎందుకు వెళ్ళాలి అంటే తమని కన్న అమ్మకుడా ఓ సోదరుడుకి సోదరే కాబట్టి .. ఆయన రావలసిన రోజున అమ్మ తన కూతురు సంసారము చూడానికి వెళ్తే ఎలా?  .

ఇంట్లో ఉండే పెద్దన్న తండ్రి తరువాత తండ్రంతటివాడు .అలాగే ఇంట్లో ఉండే తోబుట్టువు అమ్మ తరువాత అమ్మంతటిది . అంటే దీనర్ధము భగినీ హస్తభోజనానికి తల్లిదండ్రులు గతించిన వాళ్ళే వెళ్ళాలని కాదు . అంతేకాదు ఇలా సోదరినుండి తన సంసార పరిస్థితిని గమనించిన సోదరుడు ఆ సంసార పరిస్థితి మొత్తాన్ని తమ తండ్రికి చెప్పలన్నదే దీనిలోని నేపధ్యము . కుటుంబాలు విడిపోకుండా ఉండేందుకు ఇదో సాంప్రదాకమైన పద్దతి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

27, మే 2017, శనివారం

తాంబూలంవల్ల ఉపయోగం ఏమిటి? - Benefits of Tambulam

తాంబూలంవల్ల ఉపయోగం ఏమిటి? - Benefits of Tambulam
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.

ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

28, నవంబర్ 2016, సోమవారం

అట్లతదియ వ్రతవిధానము - Atla taddi Telugu Festival

Atla taddi Telugu Festival అట్లతదియ
ట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.
Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము
ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకొంటారు. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా- పెళ్ళి అయిన తరవాత పది సంవత్సరాలపాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నులపండుగగా ముగిస్తారు
త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది.
ఉయ్యాలపండగ Atla taddi Telugu Festival
ఉయ్యాలపండగ Atla taddi Telugu Festival
చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.
Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము
అట్ల తద్ది లేదా అట్ల తదియ వ్రతవిధానము

రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడమ్, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.

అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్

చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు

ఈ వ్రతంలో ఒక కథ చదువుతుంటారు. పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి ఈ అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలతచెంది అడవికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకొంది.

అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వలన అలా జరిగిందని ఆదిదంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వలన నీరసించిపోయింది. ఆమె అన్నలు అది తెలిసి, గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేసి ఉపవాసాన్ని విరమింపజేశారు. ఫలితంగా ఆమెకు సరియైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధా భక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్యపరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు- ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.

అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.

By: కోటీ మధవ్ బాలు చౌదరి

Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము