పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి - Puttinaroju, Birthday

0

భారతీయ సంసృతిలో పుట్టినరోజు

కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యువతను చెడగొడుతోందో తెలుస్తోంది.
వెలిగే దీపం ఆర్పడం
వెలిగే దీపం ఆర్పడం 
వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం:
 • ➣ ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.
 • ➣ ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి, ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి.
 • ➣ లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి.
 • ➣ అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది.
 • ➣ కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి?
 • ➣ మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??
 • ➣ ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.
 • ➣ పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.
 • ➣ ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి. 
 • ➣ పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.
 • ➣ చిన్నవారందరు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.
 • ➣ మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..
వీడియో లో చూడవచ్చును:


“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

 రచన: శ్రుతి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top