అనేక కోటి బ్రహ్మాండజననీ ' పర బ్రహ్మస్వరూపిణి ' - Para brahmasvarupini

అనేక కోటి బ్రహ్మాండజననీ ' పర బ్రహ్మస్వరూపిణి ' - Para brahmasvarupini
అనేక కోటి బ్రహ్మాండజననీ 

పదకొండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః' అని చెప్పాలి.
  • అనేక = అనంతమైన, 
  • కోటి = సమూహములుగా నుండు, 
  • బ్రహ్మాండ = బ్రహ్మాండములకు, 
  • జననీ = తల్లి
ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహతారకలు, సమస్త జీవ వస్తు జీవజాలములతో ఉండేదే -
బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలెన్నో ఉత్పన్నమవడం విలీనమవడం ఈ సృష్టి ప్రళయాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండ సముదాయలన్నీ తనలో బీజప్రాయంగా ఉండేదే అమ్మవారు. ఈ నామంలోని 'జననీ' పదం స్త్రీ స్వరూపిణిని తెలియ చేస్తుంది. కాబట్టి - స్త్రీ శరీరంలో ప్రతి కానుపుకీ అండాశయాలు ((ovaries) విచ్చుకున్నట్లు - ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారి లోంచి ఉద్భవమౌతాయనే సమన్వయ భావంతో ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. 
    ఇలాంటి నామాలను బట్టే అమ్మవారంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది. ఆవిడకు ఆవిడ ఎంతటిదో కూడా తెలియకపోవచ్చు ! భాగవతం ద్వితీయ స్కంధంలో బ్రహ్మ నారదుడితో “ఈ హరికి (దేవుడికి) ఆయన ఎంతటి వాడో ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు గూడా !' అంటాడు. భాగవతంలోని ఈ బ్రహ్మ మాటలను గాని, లలితా సహస్రనామంలోని ప్రస్తుత నామం వివరణ గాని వింటున్నపుడు - ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఇది అర్థం అవాలంటే - ఆకాశాన్ని చూస్తే ప్రత్యక్ష నిదర్శనం ఏర్పడుతుంది. ఆకాశానికి తెలుసా అది ఎంతటిదో ? అయినా - ఆ ఆకాశం ఉండటం ఎదురుగా చూస్తునే ఉన్నాం గదా . మనకళ్ళలోను, మన మనస్సులోను ఎన్నైనా ఇమడకలవు కదా ! అంత అనంతమైన శక్తి (Capacity) మనకళ్ళకు, మనస్సుకే ఉన్నపుడు - అనేక కోటి బ్రహ్మాండాలు తనలో ఇమడగలగడం, సకలసృష్టి స్వరూపిణి, పర బ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారికి ఉండటంలో ఆశ్చర్యమేముంది? 'అనంతమైన బ్రహ్మాండముల సముదాయమునకు తల్లి - అని ఈ నామానికి అర్థం .

" ఓం ఐం హ్రీం శ్రీo కోటి బ్రహ్మాండ జనన్యై నమః " అని చెప్పాలి 
శ్రీ మాత్రే నమః

రచన: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top