భోపాల్: కిరస్తానీ 'పెర్సిక్యూష‌న్ రిలీఫ్ మిషనరీ సంస్థ' అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్ నమోదు - Bhopal: FIR registered against President of Persecution Relief Missionary Organization

0
President of Persecution Relief Missionary Organization
 President of Persecution Relief Missionary Organization
భార‌త దేశంలో మైనారీటిల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటూ అమెరికా తదితర దేశాలకు త‌ప్ప‌డు నివేదిక‌లు చేరవేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ మిషనరీ సంస్థ ‘పెర్సిక్యూష‌న్ రిలీఫ్’ (Persecution Relief) అధ్య‌క్షుడు షిబూ థామ‌స్‌పై భూపాల్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ విష‌యాన్ని లీగ‌ల్ రైట్ ప్రొటెక్ష‌న్ ఫోరం(LRPF) త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంది.

ఇదే అంశంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ గతంలో కేంద్ర హోంశాఖతో పాటు బాలల హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసింది. పెర్సిక్యూష‌న్ రిలీఫ్ సంస్థ భార‌తదేశంలో జ‌రుగుతున్న మాములు నేరఘటనలను మైనారీటిల‌పై పేర్కొంటూ అమెరికా తదితర దేశాల ప్రతినిధులకు చేరవేయడం, ఆయా నివేదికల ఆధారంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) భారతదేశంపై ఆంక్షలు విధించాలంటూ తమ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న విషయాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. 

     అదే విధంగా “దేశంలో క్రైస్తవ అనాథశరణాలయాలపై దాడులు చేస్తున్నారని, క్రైస్తవ శరణాలయాల   యజమానులు తప్పుడు కేసులో ఇరికించి పోక్సో చట్టం కింద అరెస్టులు చేస్తున్నారంటూ పెర్సెక్యూషన్ రిలీఫ్ చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాల్సిందిగా చేసిన ఫిర్యాదుకు స్పందించిన జాతీయ బాలలహక్కుల కమిషన్, ఈ వ్యవహారంలో విచారణ జరిపి నిజానిజాలు తెలియజేస్తూ నివేదిక ఇవ్వాల్సిందిగా గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి ఘటనలేవీ తమ రాష్ట్రంలో జరగలేదంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో తప్పుడు ఆరోపణలు చేసిన శిబూ థామస్ మీద కేసు నమోదు చేయాలంటూ జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించడంతో తాజాగా ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.
___విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top