పంచాయితీ ఎన్నికల ప్రచారంలో తిరుపతి లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసిన వైయస్ఆర్సిపి అభ్యర్థి - YSRCP candidate distributes Tirupati laddoos for free during election campaign

0
తిరుపతిలో సమీపంలోని తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న (వైఎస్‌ఆర్‌సిపి) తిరుమల శ్రీవారి లడ్డును ఓటర్లకు పంపిణీ చేయడంతో వివాదానికి దారితీసింది.
   ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంది. ఇక్కడ గత నెల రోజులుగా పలు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

సాధారణంగా, రాజకీయ పార్టీలు తమ ప్రచార సమయంలో ఓటర్లను నగదు, మద్యం మరియు బిర్యానీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చూస్తారు. .అయితే, తిరుపతికి సమీపంలో ఉన్న తోండవాడలో ప్రజలకు తిరుమల శ్రీవారి లడ్డులతో పాటు వైఎస్‌ఆర్‌సిపి ఓటరు స్లిప్‌లను ఇచ్చి పార్టీకి ఓటు వేయమని పట్టుబట్టారు. వైయస్ఆర్సిపికి ఓటు వేయమని ప్రజలను కోరుతూ సుమారు ఏడు లక్షల లడ్డులను పంపిణీ చేసినట్టు సమాచారం.
తోండావాడ పంచాయతీలో కొత్తగా ప్రారంభించిన పిడిఎస్ డోర్ డెలివరీ వాహనాలను వైయస్ఆర్సిపి ఓటర్లకు లడ్డులు పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నట్టు వీడియోలో ఉంది.
తెలుగు దేశమ్ పార్టీ చీఫ్ చంద్ర బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఈ చర్యను ఖండిస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు అక్కడ పోటీచేసిన అభ్యర్థిని అనర్హులుగా ప్రకటిస్తూ బాద్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. 
ఇదే విషయమై బిజెపి కూడా వైయస్ఆర్సిపి చర్యను ఖండించింది :
   బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక ట్వీట్‌లో తన నిరసన తెలిజేస్తూ “ఇంతకంటే సిగ్గుపడేది ఏదైనా ఉందా? ఈ విషయంపై టిటిడి వెంటనే కేసు నమోదు చేయాలి మరియు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాము. ” అంటూ ట్విట్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top