ఆలయాలకు పెట్టె ఖర్చును తగ్గించాలంటూ హిందూ దేవాలయాలకు ఆదేశాలు జారీచేసిన కేరళ వామపక్ష ప్రభుత్వం !

0
కేరళ
హిందూ దేవాలయాలపై కేరళ ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడికి దిగినట్టుగా కనబడుతోంది. కేరళలోని మలబార్ దేవస్వామి బోర్డు ఉద్యోగులను ఆలయ ఖర్చులను తగ్గించాలని ఆదేశించించి.
ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద ఉత్తర్వు ప్రకారం ఆలయ ఉత్సవాలు, దక్షిణా, పూజలకు అర్చకులు వెంటనే తగ్గించాలని, ఖర్చులు తగ్గించకపోతే రాష్ట్రానికి ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. ఆలయ వ్యయం పెరగడం వల్ల ఉద్యోగులకు అదనపు అలవెన్సులు ఇకపై చెల్లించడం లేమని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆలయ ఉత్సవాలు నిర్వహించడం, ఆలయానికి విరాళాలు లెక్కించడం ఆలయ ఉద్యోగుల విధి అని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వదని ఉత్తర్వులో పేర్కొంది. ఉత్సవాల నిర్వహణ ఖర్చును 'సంస్థాగత ఖర్చుగా' పరిగణించాలని, అది ఆలయ ఆదాయంలో 50 శాతానికి మించరాదని కూడా చెబుతోంది.

ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వివిధ హిందూ సంస్థలు, ఆలయ పూజారులు ముందుకు వచ్చారు. రోజువారీ పూజలు పై రాజీపడేది లేదని, దేవాలయాలకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, దేవస్వామ్ బోర్డుకి ఉందని వారు అన్నారు.
ఈ మధ్య కాలంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఆలయాలకు సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top