Page Nav

HIDE
FALSE
HIDE_BLOG

Classic Header

{fbt_classic_header}

తాజా విశేషాలు:

latest

గుజరాత్: 19 ఏళ్ల తర్వాత అరెస్టయిన గోద్రా రైలు 'కరసేవకుల' దహనం కేసులో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ భటుక్ !

Godhra train massacre గు జరాత్: సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి 59 మంది కరసేవకుల (సాధువుల) దహనం కేసులో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ...

Godhra train massacre
Godhra train massacre
గుజరాత్: సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి 59 మంది కరసేవకుల (సాధువుల) దహనం కేసులో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ భటుక్ ను దాదాపు 19 సంవత్సరాల ( 27 ఫిబ్రవరి 2002న ) తర్వాత ఎట్టకేలకు సోమవారం పోలీసులు ఇతనిని గోద్రాలో అరెస్టు చేశారు.

ఈ కుట్రకు పాల్పడిన ప్రధాన నిందితులలో భాతుక్ ఒకడు :
  పంచమహల్ పోలీసు సూపరింటెండెంట్ లీనా పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం గోద్రా రైల్వే స్టేషన్ లో కూలీగా పనిచేసే 51 ఏళ్ల భటుక్ మొత్తం కుట్రలో పాలుపంచుకున్న దోషులలో ఇతను ముఖ్య భూమికను పోషించాడు. ఇతను 19 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. 

ఆదివారం గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ ఫాలియా ప్రాంతంలో ని ఒక ఇంటిపై ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసుల బృందం దాడి చేసి అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. "భతుక్ మొత్తం కుట్రకు పాల్పడిన నిందితులలో ప్రధానమైనవాడు, 

అల్లరిమూకలు చేతిలో దహనమైన కరసేవకులు (సాధువులు)
అల్లరిమూకను ప్రేరేపించి కరసేవకులు ఉన్న రైలు కంపార్ట్మెంట్ను తగలబెట్టడానికి పెట్రోలును  కూడా ఏర్పాటు చేసాడని సమాచారం. దర్యాప్తు సమయంలో తన పేరు రావడంతో వెంటనే ఢిల్లీకి పారిపోయాడు. ఇతనిపై హత్య మరియు అల్లర్లను ప్రేరేపించాడన్న దానిపై కేసులున్నాయని" అని ఎస్పి పాటిల్ పేర్కొన్నారు.

Source: Opindia